SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
ఈ ఒక్క సంఘఠన చాలు C.K ఔన్నత్యాన్ని చాటదానికి.
Dec 29th, 2008 by chittoor Murugeshan

నాకు సంవత్సరం సరిగ్గా గుర్తులేదు కాని చిరంజీవి నటించిన చానక్య శపథం సినిమా రిలీజైన రోజది.

చిరంజీవి అభిమానులంతా ఒక గ్రూపైతే, అభిమానుల్లో నలుగురం ఒక గ్రూపుగా ఏర్పడినాం. అప్పట్లో మా బాస్ స్వ//ఎన్.ఆర్.రఘు

 (చిత్తూరులో పసుపు చొక్కా వేసుకుని ,తిరిగిన మొట్ట మొదటి వ్యక్తి. కాని ఒక కులం వారు అతనిని ప్రక్కన పెడుతూ కవున్సిలర్ పదవికే పరిమితం చేసేరు. కాని సి.కె. అతన్ని పిలిచి మరి ఎం.పి.పి.గా పోటి చేయమని అవకాశం కల్పించారు. అప్పటికే అతను ఔట్ డేటడ్ అయ్యుండడం, సినిక్ గా తయారు కావడం చేత ఓడిపోయాడు)

ఆయన ఆద్వర్యంలో మేము చానక్య శపథం ఫ్యావరిట్ షోకు ప్లాన్ చేసాం . తిక్కెట్లు ముద్రించుకొని విక్రయం కూడ మొదలు పెట్టేసాం. అప్పుడు సి.కె. మునిసిపల్ వైస్.చేర్మన్ గా ఉన్నారు.

తక్కిన అభిమానులంతా సి.కె.వద్దకు వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారు. ఆయన అనుకుని ఉంటే షోను మెజారిటి గ్రూపు అభిమానులకు దక్కేలా చేసి ఉండవచ్చు.  ఇందాకా అమ్మిన టికెట్ల డబ్బులను సైతం రాభట్టి అసలైన అభిమానులకు ఇచ్చి ఉండవచ్చును.

కాని ఆయన మా అందరిని ఒప్పించి ఇందాకా అమ్మిన టిక్కెట్ల సొమ్ము త్యేతర్ అలంకారానికి మేమే వెచ్చించేట్లు, తక్కిన టికెట్లను అసలు cost కే కౌంటర్ లో అమ్మేలా ఏర్పాటు చేసారు.

ఈ ఒక్క సంఘఠన చాలు ఆయన ఔన్నత్యాన్ని చాటదానికి.

ఆయన కత్తి పట్టుకుని తిరిగాడు అవి ఇవి అంతా అభూత కల్పనలు.

ఇంకో చిన్న విషయం చెబుతా చిత్తూరు తౌన్ తేన బండ అవతల మంగ సముద్రం ఉంది. ఆ సర్పంచ్ తె.దే.పా కు చెందినవారు. అక్కద మురావత్ ఆలిషా బాబా దర్గా ఉంది. చిత్తూరు ఎం.పి.ఆదికేఆవులు మంగసముద్రానికి ఒక త్రాగునీటి బోరు ఒకటి మంజూరు చేసారు.(ఎం.పి.నిదుల్లో నుండి) బోరు పాయింట్ దర్గా ఆవరనలో పడింది. దర్గా వారు బొరు వేసుకోవడానికి అనుమతించారు. పది మంది ఉపయోగపడే పని కాబట్టి. బోరు వేసారు.  మోతారు బిగించారు. ఓపనింగ్ తేది దగ్గర పడింది. సర్పంచ్ దర్గా కమిటి వారివద్దకు వచ్చి ప్రస్తుతానికి దర్గా కరెంటుతో ఓపనింగ్ మాత్రం చేస్తాం. ఆతరువాత లైన్ వచ్చేస్తుందన్నారు. దర్గా వారు అందుకూ సమ్మతింఛేరు.

ఇక చూసుకొండి రోజులు నెలలయ్యై,నెలలు సంవత్సరాలయ్యాయి. లైను రాలే ,ఇంకోటి రాలే.. విదుయుత్తేమో దర్గా వారిది. బిల్లేమో వేలల్లో వస్తుంది. పేరేమో సర్పంచికి,ఎం.పి.కి. పోని బిల్లు కట్టడం మానేస్తే డిపార్ట్మెంటు వారు ఫ్యూజు పీకుతారు. అయినా సంవత్సారాలు తరబడి బిల్లులు కట్టేరు. ఆపై దర్గా వారు సి.కె.కు విన్నవించేరు. సి.కె. సతరు సర్పంచికి చెప్పేరు . చెప్పినప్పుడల్లా అతివినయం ప్రదర్శించతం. తీరా ఆ మాటలను గాలికొదిలేయడం . ఇదీ వరసా. సి.కె. ఆ సర్పంచిని తన్న లేదే.బెదిరించ లేదే. ఈ సమస్య ఆ నోట ఈ నోటా ప్రాకి నా చెవికి వస్తే నాదైన శైలిలో ఈ సమస్యను పరిష్కరించాను. ఇందుకు క్రుతజ్ఞతలు తెలుపడానికి దర్గా కమిటి వారు నాకు సాలువ కప్పడానికి సిద్దమయ్యేరు. కొందరు అత్యుత్సాహం తో ఈ సంగతి సి.కె.చెవికి చేర్చారు., ఆయన ఏ మాత్రం ఈగో ఫీల్ కాలేదే. దర్గా కమిటీ వారు నాకు సాలువ కప్పేరు. ఆ ఫొటో పత్రికల్లో సైతం వచ్చాయి.

ఆత్మ విశ్వాసం గలవాడు ఎప్పుడూ ఈర్ష్య ఫీల్ కాడు. సి.కె.వ్యక్తిత్వం,ఔదార్యం,హుందాతనం గురించి చెప్పాలంటే ఇంకా 10 బ్లాగులు పెట్టాలి సుమా !

RTS Perm Link

సి.కె.బాబుకు స్పీకర్ పదవి ఇస్తే ఓ.కే నేమో ?
Dec 28th, 2008 by chittoor Murugeshan

చిత్తూరు(డిసెంబర్,28)
అసెంబ్లీలో సభ భాగా జరగడంలేదని,చర్చలు సాగడంలేదని ప్రతిపక్షాలు దుమారం రేపుతుంటాయి. చిత్తూరు జిల్లా, చిత్తూరు టౌన్ ,దర్గా సర్కిల్ లో చిత్తూర్ హ్యాట్రిక్ ఎం.ఎల్.ఏ సి.కె.బాబు అద్వర్యంలో నిర్వహించిన మానవ హారం అనంతరం జరిగిన సభకు హాజరైన వేలాది మంది కార్య కర్తలను,అభిమానులను కేవలం ఒక అభయహస్తంతో తన కట్టిడిలో ఉ౦చుకున్న ద్రుశ్యాన్ని సి.ఎం.రాజ శేఖరరెడ్డి గారు చూసి ఉంటే తప్పకుండ సి.కె.బాబుకు స్పీకర్ పదవి ఇస్తే ఓ.కే నేమో అని అనిపించి ఉంటుంది!
ఆదివారం ఉదయం గాంథి రోడ్డులోని పార్టి కార్యాలయానికి చేరుకున్న సి.కె. పార్టి పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టి కార్యాలయం నుండి గాంథి రోడ్డు,ప్రకాశం హై రోడ్డు, మీదుగా పలమనేర్ రోడ్డులోని దర్గా సర్కిల్ అంబేద్కర్ విగ్రహం దాక చకచక నడుచుకుంటూ వెళ్ళారు. దారి పొడవున కండువాలు,గజమాలలు షరా మామూలే.
ఇంతకీ 2007,డిసెంబెర్,31 న జరిగిన హత్యాయత్నంలో నుండి త్రుటిలో తప్పించుకున్న సి.కె, ఇప్పుడిప్పుడే వ్రుధ్యాప్యంలో అడుగిడుతున్న సి.కె, ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ప్రత్యర్దుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి.. గత కొన్ని నెలలుగా సి.కె.ప్రత్యర్దులు సి.కె.ఆరోగ్యం పై ఎన్నో వదంతులు పుట్టించారు. కాని ఆదివారం గాంథీ,అంబేద్కర్ విగ్రహాలకు ఆ మెట్ల పై అవలీల గా ఎక్కి పూల మాలలు వేస్తుంటే నిత్య యవ్వనాన్నిచ్చే కాయకల్పం ఏదైనా సేవించారా అన్న అనుమానం సి.కె.అభిమానులకు కలిగింది.
ప్రతిజ్ఞ అనంతరం సి.కె.ప్రసంగించవలసి ఉ౦ది. సి.కె.మాట్లాడేందుకు ఉపక్రమిస్తుంటే, కార్య కర్తల్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. “సి.కె.జిందాబాద్,”సి.కె నాయకత్వం వర్దిల్లాలి”,”చిత్తూర్ టైగర్ జిందాబాద్ “అంటూ నినాదాలు చేసారు. సి.కె. అభయ హస్తం చూపుతూ సైగ చేసారంతే.. వేలాది జనం,వందలాది యువత, అయితేనేం. గుండు సూది పడితే చప్పుడయ్యేంత నిశబ్దం.
ఈ ద్రుశ్యాన్ని గాని రాష్ఠ్ర ముఖ్యమంత్రి, డా// వై.ఎస్.చూసి ఉంటే అప్పుడే నిర్ణయించి ఉంటారేమో? సి.కె.బాబుకు స్పీకర్ పదవి ఇస్తే అసెంబ్లీ ఓ.కే అని.
ఇంతకీ సి.కె.ఏం మాట్లాడారంటే:
దేశ ఐక్యతను,శాంతిని పొట్టన పెట్టుకోవటానికి కొన్ని విచ్చిన్న శక్తులు ప్రయత్నిస్తున్నాయి. మానవ బాంబులులను సైతం మనలోని ఐక్యతను చాటి చెప్పే ఈ మానవ హారం తో ఎదుర్కొంటాం. దేశంలో శాంతి,మత సామరస్యతలను పరిరక్షించి, దేశాన్ని అభివృద్ది బాటలో నడపే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది. కావున కాంగ్రెస్ పార్టి 124 వ వార్షికోత్సవ సందర్భంగా కా౦గ్రెస్ పార్టి విజయానికి ఐక్యమత్యంతో పనిచెయ్యాలని ప్రతిన భూనుతాం.

RTS Perm Link

సి.కె.బాబుకు స్పీకర్ పదవి ఇస్తే Assembly ఓ.కే !
Dec 28th, 2008 by chittoor Murugeshan

చిత్తూరు(డిసెంబర్,28)
అసెంబ్లీలో సభ భాగా జర్గ డంలేదని,చర్చలు సాగడంలేదని ప్రతిపక్షాలు దుమారం రేపుతుంటాయి. చిత్తూరు జిల్లా, చిత్తూరు తౌన్ ,దర్గా సర్కిల్ లో చిత్తూర్ హేట్రిచ్ ఎం.ఎల్.ఏ సి.కె.బాబు అద్వర్యంలో నిర్వహించిన మానవ హారం అనంతరం జరిగిన సభకు హాజరైన వేలాది మంది కార్య కర్తలను,అభిమానులను కేవలం ఒక అభయహస్తంతో తన కట్టిడిలో ఉంచుకున్న ద్రుశ్యాన్ని సి.ఎం.రాజ శేఖరరెడ్డి గారు చూసి ఉంటే తప్పకుండ “సి.కె.బాబుకు స్పీకర్ పదవి ఇస్తే ఓ.కే నేమో  అనిపించి ఉంటుంది !

ఆదివారం ఉదయం గాంథి రోడ్డులోని పార్టి కార్యాలయానికి చేరుకున్న సి.కె. పార్టి పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టి కార్యాలయం నుండి గాంథి రోడ్డు,ప్రకాశం హై రోడ్డు, మీదుగా పలమనేర్ రోడ్డులోని దర్గా సర్కిల్ అంబేద్కర్ విగ్రహం దాక చకచక నడుచుకుంటూ వెళ్ళారు. దారి పొదవున కండువాలు,గజమాలలు షరా మామూలే.

ఇంతకీ 2007,డిసెంబెర్,31 న జరిగిన హత్యాయత్నంలో నుండి త్రుటిలో తప్పించుకున్న సి.కె, ఇప్పుడిప్పుడే వ్రుధ్యాప్యంలో అడుగిడుతున్న సి.కె, ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ప్రత్యర్దుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి.. గత కొన్ని నెలలుగా చి.కె.ప్రత్యర్దులు సి.కె.ఆరోగ్యం పై ఎన్నో వదంతులు పుట్టించారు. కాని ఆదివారం గాంది ,అంబేద్కర్ విగ్రహాకు ఆ మెట్ల పై అవలీల గా ఎక్కి  పూల మాలలు వేస్తుంటే నిత్య యవ్వనాన్నిచ్చే కాయకల్పం ఏదైనా సేవించారా అన్న అనుమానం కలిగింది.

ప్రతిజ్ఞ అనంతరం సి.కె.ప్రసంగించాలి. సి.కె.మాట్లాడేందుకు ఉపక్రమిస్తుంటే, కార్య కర్తల్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంటూంది. సి.కె.జిందాబాద్,సి.కె నాయకత్వం వర్దిల్లాలి,చిత్తూర్ టైగర్ సి.కె.బాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేసారు. సి.కె. అభయ హస్తం చూపుతూ సైగ చేసారంతే.. వేలాది జనం,వందలాది యువత, అయితేనేం. గుండు సూది పడితే చప్పుడయ్యేంత నిశబ్దం.

ఈ ద్రుశ్యాన్ని గాని రాష్ఠ్ర ముఖ్యమంత్రి, డా// వై.ఎస్.చూసి ఉంటే అప్పుడే నిర్ణయించి ఉంటారు. సి.కె.బాబుకు స్పీకర్ పదవి ఇస్తే  అసెంబ్లీ ఓ.కే అని.

ఇంతకీ సి.కె.ఏం మాట్లాడారంటే:

దేశ ఐక్యతను,శాంతిని పొట్టన పెట్టుకోవటానికి కొన్ని విచ్చిన్న శక్తులు ప్రయత్నిస్తున్నాయి. మామబాంబులులను సైతం మనలో ఐక్యతను చాటి చెప్పే ఈ మానవ హారం తో ఎదుర్కొంటాం. దేశంలో శాంతి,మత సమరస్యతలను పరిరక్షించి, దేశాన్ని అభివృద్ది బాటలో నడపే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది. కావున కాంగ్రెస్ పార్టి 124 వ వార్షికోత్సవ సందర్భంగా కంగ్రెస్ పార్టి విజయానికి ఐక్యమత్యంతో పనిచెయ్యాలని ప్రతిన భూనుతాం.
 

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa