SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
“ఇ౦డియన్ పొలిటికల్ క్లోసప్”కు విరివిగా ప్రకటనలివ్వండి !
Dec 31st, 2008 by chittoor Murugeshan

                   ఇ౦డియన్   పొలిటికల్ క్లోసప్”కు విరివిగా ప్రకటనలివ్వండి !దీంతో దేశభివృద్దిలోను పాలుపంచుకున్నవారవుతారు !1989 నుండి ప్రొఫెష్నల్  జ్యోతిష్కులుగా ప్రచారం పొందినప్పటికి , తన అన్వేషణను కొనసాగిస్తూ  మానవీయ దృక్పథంతో రేయింబవళ్ళు ఆలోచించి నవగ్రహ పీడనకు  హేతుబద్ద పరిహారాలను కనుగొని వేలాది మందికి వివరించి వారికి మార్గ దర్శకులుగా పేరు గాంచి, బ్రాహ్మణేతర కులంలో పుట్టినా  “స్వామిగా” సంభోదించపడుతూ బ్రాహ్మణ పండితులు  సైతం గౌరవించే  చిత్తూరు.ఎస్.మురుగేషన్ గారిచే ప్రారంభించ బడి 2 సంవత్సరాలుగా విజయవంతమైన పక్షపత్రికగా  (నెలకు 2 సంచికలు) వెలుబడుతున్న “ఇండియన్ పొలిటికల్ క్లోసప్” కేవలం ప్రకటన దారులద్వార‌  అందే మొత్తాలతోనే నడుస్తుంది.  ఎటువంటి దాపరికం లేకుండా జ్యోతిష్య శాస్త్రంలోని గూడ రహస్యాలను సైతం బట్ట బైలు చేసిన “మిని జ్యోతిష్య భోదిని స్వామిగారి మాస్టర్ పీస్. చిత్తూరు ,బజారు వీదిలోని శ్రీ కృష్ణా జ్యుయలర్స్   సౌజన్యంతో వెలుబడిన ఈ చిన్న గ్రంథానికి పుర ప్రజలు ఎంతో ముగ్దులయ్యారు.( వీలును బట్టి  ఇటువంటి చిన్న గ్రంథాలను సైతం ప్రచురిస్తున్నారు) పాఠకులకు పూర్తిగా   ఉచితంగా   అందుతున్న ఈ పత్రికకు చిత్తూరు పురప్రజల మద్య ఎంతో ఆధరణ ఉంది. అందే ప్రకటనాదాయన్ని బట్టి    3000 ముండి 5000 ప్రతుల దాక ముద్రి౦చ బడి ఉచితంగా అందించ  పడుతుంది.కేవలం ఒక చిన్న కరపత్రం ముద్రించాలన్న రూ.100 ముండి 300 దాక ఖర్చవుతుంది.  

 కాని “ఇండియ‌న్ పొలిటికల్ క్లోసప్” పక్ష పత్రికలో కేవలం రూ.100 కే విజిటింగ్ కార్డు సైజు ప్రకటన  ప్రచురించబడుతుంది.  ఇంతే కాదు .

మా ఎడిటర్ చిత్తూరు.ఎస్.మురుగేషన్ 

భారత దేశ సర్వ సమస్యలకు . .సమూల పరిష్కారంగా ” రూపొందించిన ఆపరేషన్ ఇ౦డియా 2000పథకం/ఆ పథకం యొక్క ప్రచారం,అమలు కొరకు మురుగేషన్ చేసిన కృషి వివరాలు తరచూ వెలుబడుతుంటాయి. దేశ౦యొక్క దీర్ఘకాలిక  ప్రయోజనాల కోసం ఆపరేషన్ ఇండియా 2000 పథకాన్ని రూపొందించిన మురుగేషన్, కేవలం ఆదర్శాలంటూ మడికట్టుకుని కూర్చుండి పోక , ప్రస్తుత రాజకీయ పరిస్తితిలో డా. . వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారుఅమలు చేస్తున్న అభివృద్ది,సంక్షేమ  పథకాలకూ విరివిగా తమ పత్రికలో చోటు కల్పిస్తున్నారు.  అంతే కాదు, గత 20 సంవత్సరాలుగాదురద్రుష్ఠం వెంటాడడంవలన( ఇక్కడి  ఎం.ఎల్.ఎ. కు సంబందించిన పార్టి  రాష్ఠ్రంలో పరిపాలనకు రాక పోవడం)  పెద్దగా అభివృద్దికి నోచుకోని మన చిత్తూరు  నియోజిక వర్గ దురద్రుష్ఠాన్ని మార్చటానికి నడు0 కట్టారు. రానున్న ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టి ఘ్నవిజయం సాధిస్తుందని ,వై.ఎస్.మళ్ళి ముఖ్యమంత్రి అవుతారని విశ్వసించి ,వై.ఎస్.ఆప్తులు,చిత్తూరు హేట్రిక్ ఎం.ఎల్.ఎ.     మళ్ళి ఎం.ఎల్.ఎ.కావాలని మనస,వాచ,కర్మన భావిస్తూ ఈ దేయ సాధనే   దేయంగా వార్త కథనాలు ప్రచురిస్తున్నారు.ఇంతే కాక వీలును బట్టి 14 సంవత్సరాలు గురుకుల వాసం చేసినా ఏ గురు నేర్పని యోగ రహస్యాలను సైతం భాహుటంగా తెలుపుతున్నారు. అవును.  Indian Political Close up  కేవలం మరో పత్రిక కాదు. సదా ప్రకటన కర్తల,పాఠకుల శ్రేయస్సు కోరుతూ, నియోజిక వర్గ,రాష్ఠ్ర,దేశాభివృద్దికి కట్టుబడి పని చేస్తుంది. అందుకే . . .  ఇండియన్ పొలిటికల్ క్లోసప్ పక్ష పత్రికకు విరివిగా ప్రకటనలివ్వండి. ఈ పవిత్ర కార్యసాధనలో భాగ స్వాములు కండి !   ప్రకటన టారిఫ్   ఫుల్ పేజి :   రూ.10,000 1/2 పేజి:            రూ.  5000 1/4 పేజి:               రూ.2,500 విజిటింగ్ కార్డు సైజు: రూ.100     ఎం.శిరిష , In charge, ADVT 

RTS Perm Link

తిరుమల పై చెడుగాలులకు చెక్ : తిరుమల విషన్ 1900
Dec 31st, 2008 by chittoor Murugeshan

  తిరుమల(డిసెంబర్,31)  (తిరుమలనుండి ఇ.పొ.క్లో.ప్రత్యేక ప్రతినిథి)పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రాణ చెడుగాలుల కట్టిడికి తమ ‘ తిరుమల విజన్ 1900 ” ఉపకరిస్తుందని చిత్తూరు మురుగేషన్ తెలిపారు. 1999 న తిరుమల పై క్రీ.శకం 1900 నాటి పవిత్రతను తిరిగి సాదించేందుకు కొన్ని సలహాలను తిరుమల విజన్ 1900 పేరిట పొందుపరచి నాటి ఇ.ఓ.గారికి పంపానని ఆయన వివరించారు.నాటినుండి నేటి దాక ‘ తిరుమల విజన్ 1900 “  అమలుకు కృషి చేస్తున్నానని , అయితే తిరుమల పెద్దలు తన సలహాలను అరా కొరగా లేపేసి అమలు చేస్తున్నారు గాని వారిలో అవగాహణ లోపమే ఇందుకు కారణమని మురుగేషన్ వాపోయారు. తిరుమలకు వచ్చే భక్త సముద్రంలో  క్రిమినల్స్ కలకలిసి వచ్చి మకం వేస్తున్నారని ,దీనిని కట్టిడి చేసేందుకు భక్తులందరి చేతి రేకలను కలెక్ట్ చేసి, వాటిని నేర చరిత్రుల హస్త రేకలతో పోల్చి నేరస్తులను అదుపులో తీసుకోవాలని నా విజన్లో పేర్కొంటే, దానిని అంగ ప్రదిక్షణ చేయడానికి వచ్చే భక్తులకు మాత్రం పరిమితం చేసేరు, తి.తి.దే. కొరకు ప్రత్యేక టి.వి.చేనల్ ఉ-0డాలని 1999లోనే ప్రతిపాదించిన నాకు కేవలం ఒక కార్డు ముక్క ద్వార కూడ కృతజ్ఞతలు తెలిపిన పాపాన పోలేదని మురుగేషన్ అన్నారు తమ …http://www.blaagu.com/swamy7867 .వెబ్ సైట్లో తిరుమల విజన్ 1900 ను త్వరలోనే పొందుపరుస్తానని చదువరులే తన పథకం పై స్పందించాలని ఆయన అన్నారు. ఇ.పొ.క్లో.తిరుమల ప్రతినిథితో ఆయన పై విదంగా తమ భావాలను వివరించారు.  

RTS Perm Link

నా శక్తిని నేను వృధా చేస్తున్నానేమో?
Dec 29th, 2008 by chittoor Murugeshan

ఔను..
నకీ అనుమానం తరచూ వస్తుంటుంది.
1984 నుండి 1986 దాకా నా సర్వ శక్తి యుక్తులను సెక్స్ కొరకే వెచ్చించాను.

అది వృధ అని గ్రజించి భ్రహ్మచర్యం చేపట్టాను
భ్రహ్మచర్యాన్ని కొనసాగించటం కోసం హనుమన్నను పూజించాను
ఎక్కడ రామ నామం ద్వనిస్తే అక్కద హనుమన్న ప్రత్యక్షమవ్తాడని
రామ నామం జపించాను.

యధ్బావం తధ్భవతి అన్నట్టుగా అతి కామినైన నేను
రాముడంతటి  వాదినాయ్యాను.

భారత దేశాన రామరాజ్య స్థాపనకు (బా.జా.పా చెప్పే రామ రాజ్యం కాదు)
ఒక పథకం రూపొందించాను.

రామనామ మహిమతో నేను సైతం ఒక శాస్త్రజ్ఞుడ్నైనను.
గ్రహ పీడనలకు మనవీయ ,హేతుబద్ద పరిహారాలను కనుగొన గలిగాను.

ఇంతలో నా పూర్వ జన్మ సుకృతమా అన్నట్టు శాక్తేయం నన్ను ఆకర్షించింది.
మాయా భీజాన్ని గత 8 సంవత్సరాలుగా జపిస్తున్నను.

2 సంవత్సరాలకు ముందు పొట్ట చేత పట్టి భ్రతికిన నేను
నేడు ఒక పక్ష పత్రికను విజయ వంతంగా నడుపుతూ పది మంది ఉపాది కల్పిస్తున్నాను.

అయినా నాకనిపిస్తుంది. నేను నా శక్తిని వృధా చేస్తున్నానని.

ఇంతకీ ఈ రాజకీయాలతో నాకెటువంటి సంబంథమూ లేదు. అయినా కాస్తో కూస్తో రాజకీయ అవగాహన ఉన్న వాదిని కాబట్టి నాకు తోచిన వాటిని నా
ప్రజలతో పంచుకోవాలనుకున్నను.

ఇది కేవలం ఒక ఔట్లెట్ మాత్రమే.

ఇంకేంచెయ్యాలి?

ఎంత సభ్యత సాధించినా మానవుడు ఒక జంతువు. ఆ జంతువు భట్టలతో ధాయ బడి ఉంది. ఆ జంతువుకు ఆకలి,కామం కలిగినప్పుడు అది భట్టలను తెంచుకుని
భయిటబడి నానా భీబత్సం సృష్ఠించేస్తుంది. దీనిని ఎలా అడ్డుకోవడం?

మానవులు పలు ముసుగులతో చేసేవి రెండే పనులు ఒకటి చమంపటం రెండు చావడం. ఈ రెండు ప్రక్రియలు సెక్స్లో సాధ్యం. అందుకే మానవులకు సెక్స్ మీద ఇంత మక్కువ.

మతం,సమాజం దాదాపు సెక్స్ను నిషేదించాయి కాబట్టి అనగ త్రొక్క బడిన సెక్స్ కోరికలు హింసగా వెలుబడుతున్నాయి.

సెక్స్కు ప్రత్యామ్నాయంగా డబ్బు,పదవి,మేధస్సులను ఎంచుకుని మానవులు చంపుతూ,చంపబడుతూ ఉన్నారు.

ఈ సంస్థ సృష్ఠి ఒకే వస్తువునుండి ఉధ్భవించినవే. మహా విస్ఫోటం ద్వారా విడి పడిన ఇవి మళ్ళి కలిసి పోవాలని తపిస్తాయి. అందుకు ఈ శరీరాలే అడ్డమని భ్రమిస్తాయి.

అందుకే ఈ చంపడాలు,చావడాలు.

ఇంతకీ ఈ జీవుల మమేకానికి అడ్డం శరీరాలు కావు మనలోని అహమే. ఈ సృష్ఠికి కేంద్ర భిందువు తనేనని భ్రమించటం, ఈ సృష్ఠినుండి తను విడిపడి యున్న అపోహతో కేవలం ఈగోతో తనకంటూ ఆలోచననలు,తనకంటూ పట్టింపులు..ఇదే అహమంటే.  ఇక ఆ  అహాన్ని “నేను”గా భ్రమించడం. ఆ అహం కాస్త దెబ్బ తిన్న కుమిలి పోవడం. ఇదేనా జీవితం. కాదు..కాదు.. కాదు..

ఈ సమస్త సృష్ఠికి కేంద్ర భిందువు మీరో నేనో కాదు. ఒబామా సైతం కాదు. మరెక్కడో ఉంది ఆ కేంద్ర భిందువు. దాని దృష్ఠిలో మనం పురుగులం.

ఈ సృష్ఠితో ఇదివరకే పెనవేసుకుని గమ్యానికేసి కొట్టుకు పోతు.. ఇక ఈ అపోహలేల..భ్రమలేల..
 

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa