స్నేహపు మొలకలు
Uncategorized April 11th, 2009కమ్మని కబురులు ఎన్నో చెప్పే
రమ్మని పిలిచే నేస్తాలుండగ
బంజరు భూమిలొ స్నేహపు మొలకలు
సుగంధాలతో ఆహ్వానించగ
మధుర ఙ్ఞాపికలు మనసున తొలచి
మూగగ నిలిచిన మనిషిని నేను
స్నేహలతలతో నిండిన తోటలొ
పరిభ్రమించే మాలిని నేను
ఎన్నో హద్దులు ఎన్నో బుద్దులు
అల్లరి పనులకు అలిగిన వేళలు
మీకన్నులలొ మీమనస్సులలొ
చెరగని ముద్రలు సందడి చేయగ
కళ్ళముందరె కాలం కదిలే
ఎన్నో ఊళ్ళకు స్నేహం తరలె
మరలా కలిసే భాగ్యం వస్తే
ఏమని చెప్పద నాఉల్లాసం
స్నేహపు వారది పునాది రాయిని
చేస్తానంటె ఎంతధృష్టం….!
-శ్రీనివాస్ ప్రభు
(ఎన్నో వసంతాలు ఎవరు ఎక్కడో తెలియకుండ బ్రతికి, మరలా మేము చుదువుకున్న స్కూలు వి.యం.బంజరులో నా ప్రాణ మిత్రులను కలుసుకున్న మధుర క్షణంలో)

April 11th, 2009 at 5:48 am
మచ్హ్చ్… అదృష్టవంతులు..