Apr 11
స్నేహపు మొలకలు
Uncategorized 1 Comment »కమ్మని కబురులు ఎన్నో చెప్పే
రమ్మని పిలిచే నేస్తాలుండగ
బంజరు భూమిలొ స్నేహపు మొలకలు
సుగంధాలతో ఆహ్వానించగ
మధుర ఙ్ఞాపికలు మనసున తొలచి
మూగగ నిలిచిన మనిషిని నేను
స్నేహలతలతో నిండిన తోటలొ
పరిభ్రమించే మాలిని నేను
ఎన్నో హద్దులు ఎన్నో బుద్దులు
అల్లరి పనులకు అలిగిన వేళలు
మీకన్నులలొ మీమనస్సులలొ
చెరగని ముద్రలు సందడి చేయగ
కళ్ళముందరె కాలం కదిలే
ఎన్నో ఊళ్ళకు స్నేహం తరలె
మరలా కలిసే భాగ్యం వస్తే
ఏమని చెప్పద నాఉల్లాసం
స్నేహపు వారది పునాది రాయిని
చేస్తానంటె ఎంతధృష్టం….!
-శ్రీనివాస్ ప్రభు
(ఎన్నో వసంతాలు ఎవరు ఎక్కడో తెలియకుండ బ్రతికి, మరలా మేము చుదువుకున్న స్కూలు వి.యం.బంజరులో నా ప్రాణ మిత్రులను కలుసుకున్న మధుర క్షణంలో)
