సత్యాలు రాలాయి
Uncategorized April 7th, 2009దాచుకునే వాడెవ్వడు దానిని దోచుకునే వడెవ్వడు
భాద్యుడెవ్వడు వీర భోజ్యుడెవ్వడు
“సత్యాలు”ముక్కలై రాలిపడుతుంటే
హైటెక్కు మోసాలు బయటపడుతుంటే
రాజులే రాజ్యన్ని దోచేచి దాస్తుంటె
రక్షించు వాడెవడు దండుదొంగలనుండి
ఈనాడు చెప్పెదరు హితభోద పద్యాన్ని
ఆనాడు కనలేని అవినీతి బంధాన్ని
అధికార చట్టాల చుట్టలు వీరురా…
కోట్ల చాటున వేల కోట్లు దాచేస్తారు
సూట్లు, సూట్కెసులతొ స్విస్ బ్యాంకు తడతారు…
కమిటీలు వస్తాయి కన్నీళ్ళూతుడవంగ
మదుపుదారుల మదిలొ భ్రాంతులే నింపంగ
ఏ అయ్య ఇచ్చేను ఏ అమ్మ పెట్టేను
కరిగిపోయిన సొమ్ము కలతచెందిన దమ్ము
కీచకులు వంచకులు భూభక్ష్య హంతకులు
భరత భూ వృక్ష్యాన్ని పీడించు చీడరా
లెమ్మురా సోదరా నీజాతి రక్షణగ
రాజకీయపు రంగు దులిపేయ కడిగేయ
పోరాడు వీరుడా ప్రాణములె హద్దుగా
-శ్రీనివాస్ ప్రభు
( లోక్ సత్తా జయప్రకాష్ నారయణ గారికి అంకితమిస్థూ )

December 21st, 2010 at 2:50 pm
I am a huge fan of your blog, you always post really useful posts