”నీ నవ్వుల పువ్వుల వర్షంలో  

నే కరిగిపోతున్న విరహంతో

చెలి చేరి తీర్చవే దాహాన్ని

నా చెంత చేర్చవే దేహాన్ని”

సురగంగ వాగువై…

చిన్న నాటి మనసు చిలిపి వలపులోన

నీ నీలిఓణీల నిగనిగ అందాలు

కనువిందు చేసాయి కాంక్షలను నింపాయి

వయ్యారి కదలికతొ వడివడిగ నడిచేవు

సయ్యాట చూపులతొ స్వర్గాన్ని చూపెదవు

సురగంగ వాగువై సుడిగుండ హోరువై

సాగిపోతావేల ఆగవె ప్రియురాల

చీకటితొ చెప్పాను నావెలుగు నీవని

వెన్నలను కోరాను ప్రతిరేయి రమ్మని

ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎనెన్ని మజలీలు

 ఆగలేకున్నను సాగలేకున్నను

విరహాల అగ్నిలొ వేగిపొతున్నను

జవరాల నీ కరుణ జాబిల్లి వెన్నెలె

 కలువనై కొలనులొ కాసుకొని వున్నను

రావమ్మ వెలిగింప రసరాగ దీపాలు

       -శ్రీనివాస్ ప్రభు

RTS Perm Link