ఏకాంతముల చింత

ఓ చెలి నెచ్చెలి నిలువవే జాబిలి

ఏకాంతములు చెంత నా చింత తీర్చంగ

ముత్యాల మునిపంట ముద్దునేగ్రోలంగ

అదరాల మధువులతొ నీమేను తడవంగ

కుచకుంభ మొనలపై తడిపెదవులాడంగ

సురపొంగు శృంగార నాభినేగాంచంగ

చదునైన భూమిపై శ్వాస నే విడువంగ

 బ్రహ్మపదార్దాల బ్రమణమే చేయంగ

ఊగంగ తూగంగ ఉప్పొంగి పొంగంగ

 పిచ్చిగా పచ్చిగా మాటలను తూలంగ

గెలిచాను నిన్నని గర్వంగ చూడంగ

అంతలో ఓడి నీ వడిలోన వాలంగ

చెమట బింధువులూరి సేదలె తీర్చంగ

 నీచూపు దీవెనలు నా కళ్ళు తాకంగ

సుఖమిచ్చు భారంతో మత్తులో జారంగ

రతిరాజ్య పుస్తకపు ఒకపేజి చేరంగ

ఈగురుతు చాలు చెలి బ్రతుకంత గెలవంగ…

  -శ్రీనివాస్ ప్రభు

RTS Perm Link