తెలంగాణా కోసం – దశాబ్దానికొక్కడు!!

@mjr గారు commented on “తెలంగాణా రొట్టెముక్క కోసం…” –

ముందుగా, తెలంగాణా వాళ్లని తాలిబన్లు అని నేను నా బ్లాగ్‌లో ఎక్కడా సంబోధించలేదు. అలాంటి విద్వేషాలను రెచ్చగొట్టే పదప్రయోగాలు నాకు అలవాటు లేదు కూడా. తెలంగాణా కోసం పోరాడే వాళ్లందరినీ ఒకే గాటన కట్టేయడం కూడా సమంజసం కాదు. ప్రత్యేక తెలంగాణా జబ్బుకు అభివృద్ధి అనే పరిష్కారాన్ని ఎందుకు ఉపయోగించకూడదో, అక్కడి ప్రజలు ఆ కోణంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారనే నా బాధ. కాలికో, చేతికో కాన్సర్ వచ్చినా ముందుగా మందులతో నయం చేసేందుకు ప్రయత్నిస్తాం.. స్థోమతను బట్టి అంతో ఎంతో ఖర్చుపెడతాం గానీ ఏకంగా సర్జరీ చేసి తీసెయ్యంగా, ఇన్నేళ్లుగా కలిసిమెలిసి ఉన్న ప్రజల మనోభావాలతో చెలగాటాలాడటం ఎందుకని ఎవరూ ఆలోచించలేకపోతున్నారే.

ఇప్పుడు తెలంగాణా ఇవ్వండని పార్టీలకతీతంగా జెఎసి వంటివి వెలుస్తున్నాయి కదా. అసలు ఆ రాజకీయులు తాము పదవిలో ఉన్నంత కాలమూ ఆ ప్రాంతానికి ఏం చేసి అలసిపోయారు. నేను ఏ ఒక్క కెసిఆర్ గురించో మాట్లాడటం లేదు.. జానారెడ్డి, నాగం – ఇలా ఎవరైనా కావచ్చు. అలాంటి మాయాగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకునే, పోలీసులతో వీధి పోరాటాలు చేసే అమాయకుల గురించి ఎవరూ మాట్లాడరేం?

ఈ తెలంగాణా అంశాన్ని నేను నా బ్లాగ్‌లో ప్రస్తావించింది సమైక్యాంధ్రుల కోసమే కాదు. మీరన్నట్లు నా బ్లాగ్‌ను అనుసరించే వాళ్లలో తెలంగాణా వాళ్లు కూడా ఉన్నారు. ఒక రకంగా వాళ్లే ఎక్కువ. “విడిపోవడం ఒక్కటే పరిష్కారం కాదు – కలిసి ఉండి కూడా అభివృద్ధి సాధించవచ్చు” అనేదే నా స్లోగన్. ఎవరేమనుకున్నా సరే!!

తెలంగాణా ప్రాంతం అభివృద్ధి కోసం దీక్షలు చేయండి, ధర్నాలు చేయండి, నీళ్ల కోసం, భూమి కోసం, కనీస సౌకర్యాలు కూడా లేని పల్లెల్లో వెలుగుల కోసం పోరాడండి. అది మీ హక్కు కూడా. తెలంగాణా కావచ్చు, కోస్తా, రాయలసీమ – ఇలా ఏదైనా కావచ్చు.. ఏ ఒక్కరి జాగీరో కాదు. తెలంగాణా అంటే కెసిఆర్, రాయలసీమ అంటే వైఎస్, కోస్తా అంటే మరొకరో కాదు సోదరా.. 10 కోట్ల మందికి వీళ్లు కేవలం ప్రతినిథులు మాత్రమే. ఎవడో ఎక్కడో తెలంగాణా వాళ్లను తాలిబన్లు అంటే అది మొత్తం తెలంగాణేతర ప్రజల ఉద్దేశ్యం కాదు అని గుర్తుంచుకో. ఆ మాటకొస్తే ఆ ప్రాంత నాయకుడు అయిన కెసిఆర్ కోస్తా, రాయలసీమ ప్రజలను అనని మాట ఉందా. వాటన్నింటినీ వల్లె వేయడం మొదలెడితే, నా బ్లాగ్ బూతు బ్లాగ్ అయిపోతుంది.

సంవత్సరానికొక్కడు, దశాబ్దానికొక్కడో తన స్వప్రయోజనార్థం ప్రజల మధ్యన చిచ్చు పెట్టి తన పబ్బం గడుపుకుంటాడు. కాకుంటే అప్పుడు చెన్నారెడ్డి, ఇప్పుడు కెసిఆర్. చూస్తూ ఉండండి.. కెసిఆర్ కొడుకు సోనియమ్మ చంకనెక్కి ప్రత్యేక తెలంగాణాను అటకెక్కించే రోజు ఎంతో దూరంలో లేదు.

ఇక లగడపాటి అంటారా –

వెయ్యి అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. ప్రాణహాని, మానహాని సమయాల్లో బొంకవచ్చన్నారు. (ఇక్కడ మళ్లీ నేను తెలంగాణేతరుణ్ణి కాబట్టి లగడపాటిని వెనకేసుకుస్తున్నాననే కొత్త వాదనను తెర మీదకు తీసుకురావద్దని మనవి). అతను కొంత ఓవరాక్షన్ చేసిన మాట నిజమే. అయినా “కెసిఆర్ దీక్ష చేసింది కూడా ఇలాగే. దీన్ని మీకు అర్థం అయ్యాలే చేసేందుకే నేను ఇలా చేసానం”‘టూ తప్పించుకోబోయాడు. ఒక రాష్ట్రం విడిపోయే పరిస్థితే ఉత్పన్నమయినప్పుడు.. దాన్ని అడ్డుకునే ప్రహసనాన్ని రామాయణం అనుకుంటే – ఈ లగడపాటి వివాదాన్ని (రామాయణంలో) పిడకలవేట అనుకోండి. అయినా మీరడిగారు కాబట్టి, తప్పకుండా అతని గురించి ఆలోచిద్దాం. కొన్నాళ్లుగా మీడియాకు, వివాదాలకు దూరంగా ఉంటున్నాడుగా. మళ్లీ రాకపోడు.. తీవ్రతను బట్టి చెడామడా దులిపేద్దాం..

ఏమంటారూ??!

RTS Perm Link

17 Comments so far

 1. sudha on January 9th, 2010

  నా అభిప్ర్రాయం కూడా అదే. కలసి ఉంటేనే అభివృద్ధి సాధించవచ్చు. కష్టపదే వాడికి ఎక్కడైనా పని దొరుకుతుంది. చదువుకున్నవాదు ఎక్కడైనా బతక గలడు. జీవితం లో ఎదగాలని సంకల్పం ఉండాలే కాని ప్రాంతాలలో ఏముంటుంది. కొంత మంది స్వార్దపరులు తప్ప మిగిలినవారందరు కష్తపడితేనే కదా అభివ్రుద్ధి సాధించింది. కాదంటారా ….

  సుధ

 2. sree on January 11th, 2010

  @ సుధ గారు, @ సుధి గారు –
  చదివిన వెంటనే సానుకూలంగా స్పందించినందుకు సుధ గారికి, అలాగే గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యతిరేకంగా విరుచుకుపడిన సుధి గారికి ధన్యవాదాలు.
  **పేర్లలో సమీప పోలికలున్నప్పటికీ, మనోభావాల్లో ఎంత తేడా ఉంది 🙂

 3. sudi on January 9th, 2010

  “ప్రత్యేక తెలంగాణా జబ్బుకు అభివృద్ధి అనే పరిష్కారాన్ని ఎందుకు ఉపయోగించకూడదో, అక్కడి ప్రజలు ఆ కోణంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారనే నా బాధ.”

  — అభివృద్ధి కోసమే ఎన్నో అగ్రీమెంట్లు కుదుర్చుకున్నారు.. అయినా పరిస్తితి మారలేదు. ఒప్పందాలు, జి.ఓ లు కాలరాసిన ఆ.ప్ర రాష్ట్ర రాజకీయాలు ఉండేంత కాలం ఎన్ని మార్గాలు కనిపెట్టినా వేస్ట్. విడిపోయి కలిసి ఉండటం చాల నయం —

 4. Ramesh on January 9th, 2010

  mi post ninda biased views unnai. okati vinandi. Udaymam prajala gundello undi. evado kon kiska leader chethullo ledu. Prathyeka telangaanaa prathi talangaanaa pouridi aakanksha. Ikkadi mi valla vetakaaram discussions vini maaku inka udyama theevratha peruguthundi. Na blog chaduvu. nike ardam avuthundi evadu donga anedi. Donga intlo puttaamani dongathanaanni support cheyalem kada. Mana brain use cheyali. manchi chedu alochinchaali.
  24 gantalu ma prantham lo jai telangaanaa ninaadam vinipisthundante udyamam prajala gundello enthaga paathukoni undo ardam cheskondi.

  http://jaitelangaanaa.blogspot.com

 5. sree on January 11th, 2010

  @ రమేష్ గారు –
  ఏకపక్షం అని మీరనుకుంటున్నారేమోనండి. తెలంగాణా వెనుకబడే ఉంది, అక్కడ అభివృద్ధికి అందరూ తోడ్పడాలి, రాజకీయులందరిలో పరివర్తన రావాలనే కదా నేను అంటున్నది. తెలంగాణా, తెలంగాణేతర నాయకులందరూ కలిసి ఆ ప్రాంతాభివృద్ధికి చేయూతనివ్వాలనడంలో “రాష్ట్రం విడిపోకూడదు” అనే ఒక వాదన తప్ప, మరొకటి మరొకటి లేదే. మెదడు ఉపయోగించాలి అనే సలహా ఇచ్చే ముందు, మీ మానసిక పరిస్థితిని కూడా ఒకసారి మీరు అవలోకనం చేసుకుంటే మంచిదని నా ఉద్దేశ్యం!!

 6. సమతలం on January 9th, 2010

  తెలంగాణ నాయకులకంటె సీమాంధ్ర నాయకులు చాలా బలమైనవాళ్లు. సీమాంధ్రులకు సంఖ్యాబలం కూడా ఉన్నది. అన్ని పార్టీలలో వారిదే ఆధిపత్యం. తెలంగాణ ప్రయోజనాల కొరకు పాటుబడే నాయకులను ఈ రాజకీయ పార్టీలలో నిలువనిస్తరా? ఉద్యమాలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఒప్పందం జరుగుతూనే ఉన్నది. అన్నింటిని మట్టిలో కలుపుతున్నారు.
  మీరు అమాయకంగా మట్లాడుతున్నారా? అతి తెలివిగా మాట్లాడుతున్నారా?

 7. sree on January 11th, 2010

  @ సమతలం గారు –
  “మీరు అమాయకంగా మట్లాడుతున్నారా? అతి తెలివిగా మాట్లాడుతున్నారా?” అమాయకత్వమూ కాదు, అతి తెలివి లేదు – ఆవేదన తప్ప. తెలుగువాళ్లం కలిసిమెలిసి ఉండకుండా, చెట్టుకొకరు పుట్టకొకరుగా తయారైపోతున్నారనే బాధ తప్ప.

  “తెలంగాణ ప్రయోజనాల కొరకు పాటుబడే నాయకులను ఈ రాజకీయ పార్టీలలో నిలువనిస్తరా?” – ఇది మంచి ప్రశ్న. మీ నాయకులను నిలువనిస్తారా అంటే ఎందుకు నిలువనివ్వరు. వీళ్లు ఏ ఎత్తులకో, స్వప్రయోజనాలకో తమ ఆశయాలను తాకట్టు పెట్టేస్తే ఎలా ఉండగలరు. తెలంగాణేతర నాయకులు లంచం ఇచ్చి మాయ చేస్తున్నారనుకుందాం. మరి అలాంటి వాటికి లొంగిపోయే అమాంబాపతు నాయకుల తోకలను పట్టుకుని ప్రత్యేక తెలంగాణా సాధించేసి, ఆ రాష్ట్రాన్ని వాళ్ల చేతుల్లో పెడితే రేపు భవిష్యత్తేమిటి? కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదేస్తామనడం కరెక్టేనా. వీళ్లు తెలంగాణాను అభివృద్ధిపరచగలరా? నిస్వార్థంగా ప్రజల కోసం పని చేయగలరా? అని ఆలోచించండి మరి!!

 8. pannaga on January 10th, 2010

  సరే ! తెలుగు వాళ్ళంతా సమైక్యంగా ఉండాలంటే, తెలంగాణ ప్రజల కష్టాలను అర్థం చేసుకొని, వారి కోరికలకు ఆంధ్రా, సీమ నాయకులు అంగీకరిస్తారా ? అవేం గొంతెమ్మ కోర్కెలేం కావు. ఇది వరకు ’ పెద్ద మనుషుల ఒప్పందం ’ లో ఉల్లంఘన జరిగిన వాటికి సరిదిద్దే కార్యక్రమాలు… ఇంకా తెలుగు వాళ్ళందరిలో భావ సమైక్యత, సమానత్వం పెంపొందించే పనులు. అర్థం కాలేదా ? చెబుతా వినండి.
  1. ” గిర్ గ్లాని కమిషన్ ” లెక్కతేల్చిన 2,50,000 మంది ఆంధ్రా, రాయల సీమ ఉద్యోగులను 3 నెలల లోపు ఆ యా ప్రాంతాలకు బదిలీ చేసి, ఆ ఉద్యోగాలలో తెలంగాణ వారిని రిక్రూట్ చేయాలి. అంటే నిక్కచ్చిగా 610 G.O. ను అమలుపరచాలన్న మాట.
  2. ” ముల్కీ రూల్సు ” ను పునరుద్ధరించాలి. హైదరాబాదు ఆరో జోన్ లో అంతర్బాగమని పార్లమెంటులో బిల్ పాస్ చేయాలి.
  3. ఇక్కడ పెట్టుబడులు పెట్టామని బీరాలు పోయే ఆంధ్రా, రాయల సీమ వాళ్ళ ప్రైవేట్ సంస్థలలో తప్పనిసరిగా కనీసం మూడో వంతు ఉద్యోగాలలో తెలంగాణ వారిని నియమించాలి.
  4. తెలంగాణలోని అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, వినోబా భావే భూదాన యజ్ఞం ద్వారా సేకరించిన భూములు, ఇతర చారిటీ ట్రస్ట్ భూములను ప్రభుత్వం జప్తు చేసుకొని, తెలంగాణ దళితులకు,గిరిజనులకు, మైనారిటీలకు, పేదలకు పంచాలి.
  5. రెండు సంవత్సరాలలోపు ” ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ” మరియు ” ప్రాణహిత – చేవెళ్ళ ప్రాజెక్ట్ ” ను పూర్తి చేసి, ఇంకా కృష్ణా, గోదావరి పరీవాహక నిశ్పత్తి ప్రకారం తెలంగాణ జిల్లాలకు సాగు నీటిని, త్రాగు నీటిని అందించే ప్రాజెక్టులను చేపట్టాలి.
  6. హైదరాబాదుతోసహా తెలంగాణ జిల్లాలలో వచ్చే ప్రభుత్వాదాయాన్ని ఈ ప్రాంతంలోనే ఖర్చు చేసి, ప్రతి సంవత్సరం తెలంగాణ బడ్జెట్ ను వేరుగా ప్రకటించాలి.
  7. పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిని, ఇక్కడి పాత నాయకులు, కవులు, మహానుభావుల ( ఉదా || పాల్కురికి సోమన, గణపతి దేవ చక్రవర్తి, ప్రతాప రుద్రుడు, పోతన, మల్కిభ రాముడు, కులి కుతుబ్ షా, సాలార్జంగ్, కొమురం భీమ్, మగ్ధూమ్ కవి, వానమామలై సోదర కవులు, దాశరథి, స్వామి రామానంద తీర్థ, బూర్గుల, సురవరం ప్రతాప రెడ్డి, పి.వి. మొ|| వారు ) చరిత్రలను తప్పనిసరిగా ప్రవేశ పెట్టాలి. వారి విగ్రహాలను ఆంధ్రా, రాయల సీమ ప్రాంతాలలో విస్తృతంగా ప్రతిష్ఠించాలి. వారి పేర్లను కూడా ఆ ప్రాంతాల ప్రభుత్వ సంస్థలకు పెట్టాలి.

  ఇంత న్యాయబద్ధమైన కోరికలను మేమడిగితే … మీ స్వార్థ ప్రయోజనాలు దెబ్బ తింటాయని, మా కన్నా ముందు మీరే ” జై ఆంధ్ర – జై రాయల సీమ ” అంటారు. 1973 లో మీరు చేసింది అదే కదా! ఒక వేళ మీరు పై పై మాటలకు ఒప్పుకొన్నా, ఆ మాట మీద మీరు నిలబడతారన్న నమ్మకం కూడా మాకు లేదు. అందుకే మీ బతుకు మీరు బతకండి. మా మానాన మమ్మల్ని వదిలేయండి.

 9. sree on January 11th, 2010

  @ pannaga గారు –
  ఇప్పటిదాకా ఈ మాత్రం సరళంగా కూడా ఎవరూ స్పందించలేదు. కనీసం ఇలాంటి డిమాండ్లు ఉన్నాయి – వాటిని నెరవేర్చండి అంటూ మీ నాయకుల్లో ఎవరైనా “ఇటీవలి కాలంలో” పోరాడారా? కట్టె, కొట్టె, తెచ్చె చందాన సోనియమ్మ పుట్టినరోజు కేక్‌ను కోసినట్లు రాష్ట్రాన్ని విడగొట్టేస్తామనగానే పదవుల కోసం బెల్లం చుట్టూ ఈగల్లా ముసిరే జెఎసి నాయకుల్లో ఎవరికైనా మీకున్న ఈ స్పృహ ఉందా? పోనీ, ఎవరైనా వాళ్లకు ఈ మాత్రం ఆలోచనను అందించారా?

  వీటిని సరైన మార్గంలో escalate చేస్తే ఖచ్చితంగా జరుగుతాయనే నా-మా నమ్మకం.

  పోనీలెండి, కనీసం మీరైనా సానుకూలంగా స్పందించారు.. 🙂

 10. చందమామ on January 10th, 2010

  “మాట మీద మీరు నిలబడతారన్న నమ్మకం కూడా మాకు లేదు. అందుకే మీ బతుకు మీరు బతకండి. మా మానాన మమ్మల్ని వదిలేయండి.”

  నాలుగు కోట్ల మంది తెలంగాణా ప్రజల హృదయాల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన ఈ మహా అపనమ్మకం వినబడుతోందా? మనకే సాధ్యమైన మాటల విన్యాసంతో ఈ ఘనీభవించిపోయిన అపనమ్మకాన్ని తొలగించగలమా? అన్యాయం జరిగిందని కోట్ల గొంతుకలు అవతల మొత్తుకుంటున్నప్పుడు కనీసం వాటిని విందాం.. వారి విశ్వాసాన్ని చివరిసారిగా అయినా పొందడానికి ప్రయత్నిద్దాం అని ఇవతల ఎవరైనా అనుకుంటున్నారా? రాజకీయ నేతల దశాబ్దాల కుట్రలు, కుహకాలను సాకుగా చూపి ఇన్ని కోట్ల మంది భవిష్యదాశలను మనం ఎలా విస్మరించగలం.. ఎలా తోసిపుచ్చగలం? ఇంతగా విరిగిపోయిన మనసులను ఎలా అతుక్కునేలా చేయగలం? మాటలయుద్దాలను మాని అనివార్యంగా జరగనున్న పరిణామాలను మౌనంగా అయినా చూస్తూ అర్థం చేసుకుందాం. మనకూ, వారికీ కూడా బహుశా మనం చేయగలగిన, చేసుకోగలిగిన చివరి సహాయం ఈ క్షణంలో ఇదే.. b

 11. Jai andhra on January 11th, 2010

  నాకు ఈ బ్లాగ్ చూస్తె ఎందుకో మండుతుంది. మనం తెలంగాణా కాళ్ళ మీద పడి అడుక్కున్నట్లు ఉంది. వాళ్ళు తు.. విడిపోతాము అంటారు. మీరు ఏమో ఇలా బ్లాగ్స్ రాసి వాళ్ళలో మార్పులు తీసుకవచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నీ బ్లాగ్ చదివి , reply ఇచ్చే వాళ్ళు పని లేని మంగలి వాళ్ళు. తెలంగాణా విడిపోతే మనకు వచ్చే అంటే కోస్త మరియు రాయలసీమ కొచ్చే బాధలు ఏమి చెప్పండి అన్నా శ్రీ గారు. మన భాధ అంత హైదరాబాద్ సెటిల్ అయిన మన వాళ్ళ గురుంచే అయితే మన వాళ్ళు పోయి బెంగళూరు లో ఉండటం లేదా అమెరికాలో ఉండటం లేదా , మరియు ఆస్ట్రేలియా ఉండటం లేదా చంపేస్తున్న. నాకు తెలిసి సెటిల్ అయిన వారికి ఎలాంటి ప్రాబ్లంస్ ఉండకపోవచ్చు. ప్రాబ్లంస్ ఉంటె మన లగడపాటికి ఇంకొంత మంది బడా వ్యాపారులకు ఉండ వచ్చు. మీరు ఏమంటారు. మీరు software engineers అయితే హైదరాబాద్ లో నీకు జాబు వస్తే అక్కడ చేస్తావు లేదంటే బెంగళూరు లో చేస్తావు. లేదంటే ఆంధ్ర కి రాజధాని ఏర్పడ్డాక అక్కడ చేస్తావు. నీవు మన ప్రాంతం అంటే కోస్తనో రాయలసీమనో అయితే నీ భాద చెప్పు

 12. sree on January 11th, 2010

  @ ‘చందమామ’ రాజుగారు –
  చందమామ సంపాదకులైన మీకు ఉడతాభక్తి గురించి తెలిసే ఉంటుంది. లంకకు వారధి కట్టే సమయంలో, గట్టున ఉన్న ఇసుకలో దొర్లి, తన ఒంటికి అంటుకున్న ఇసుకతో శ్రీరామచంద్రునికి అంతో ఇంతో సాయం చేయదలుచుకున్న ఓ ఉడత కథ. తనెంత, తన ఒంటికంటుకున్న ఇసుకెంత. అయినా తాను సైతం అంటూ రంగంలో దూకింది, ఏం.. తన జీవితకాలం సరిపోతుందా సముద్రాన్ని ఇసుకతో ముంచేయడానికి. అల్పజీవి అయితేనేం, రావణుని పై పోరాటానికి సిద్ధమయ్యే రామునికి తన వంతు సాయం అందించదల్చుకుంది..

  ఇంతా ఎందుకు చెప్పానో అర్థమైందనుకుంటా.. 🙂

 13. sree on January 11th, 2010

  @ ‘తమ్ముడు’ Jai andhra గారు –
  “నీ బ్లాగ్ చదివి , reply ఇచ్చే వాళ్ళు పని లేని మంగలి వాళ్ళు.”
  – మరి తమరో..!

  “నాకు తెలిసి సెటిల్ అయిన వారికి ఎలాంటి ప్రాబ్లంస్ ఉండకపోవచ్చు.”
  – మీరు టీవీలు, పేపర్లలో ఆ తెలంగాణా వేర్పాటువాదులు/రాజకీయుల వ్యాఖ్యలను చూసి/విని/చదివి ఉండకపోవచ్చు.

  సమకాలీనాంశాల పట్ల అవగాహన ఉంచుకుని/పెంచుకుని మాట్లాడితే మంచిదనుకుంటా..!

  నా బ్లాగ్‌లో ఉండేది హైదరాబాద్ గురించి హైరానా కాదు తమ్ముడూ.. ఆంధ్రప్రదేశ్ విడిపోతుందనే బాధ మాత్రమే. నేను సెటిలర్ల గురించి, అక్కడి పెట్టుబడిదారులు గురించి వాపోవడం లేదే. ఆవేశం తగ్గించుకుని, ఆలోచన ఒంటబట్టించుకో బ్రదరూ!! తెలంగాణా వాళ్లను కించపరచడం, ఆ వేర్పాటువాదులను తాలిబన్లనడం నా ఉద్దేశం కాదు. వాళ్ల ఆత్మగౌరవానికి భంగం కలుగుతుంటే వాళ్లను చేతులు ముడుచుకు కూర్చోమనడం లేదే.

  రాష్ట్ర విభజనకు ప్రత్యామ్నాయంగా ఈ ఆవేశాన్ని తెలంగాణాభివృద్ధికి మలచమనే..

 14. Jai andhra on January 12th, 2010

  నాకు కలిసి ఉంటె చూడడానికి భాగానే ఉంటుంది అన్న. ఒకే కుటుంబంలా కలిసి ఉంటె మంచిగా ఉంటుంది. ఒక కుటుంబం ఎప్పుడు కలిసి ఉండకూడదు అని కోరుకుంటుంది అంటే సమానత్వం లేదని భావించినప్పుడు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇంటి పెద్ద సరిగా అందరిని చూడనప్పుడు. అప్పుడు కుటుంబం విడిపోవడం మామూలే.అలా అని విడిపోయిన అన్న దమ్ములు భాగుపదలేదని చరిత్ర చెబుతుందా? అదే జరుగుతుంది మన రాష్ట్రంలో అని తెలంగాణా వాదులు భావించారు. అన్న నీవు ఆలోచన పరుడవు. కాదనరు. కాని కొంచెం negative లో అలోచిస్తున్తావు తెలంగాణా గురుంచి. మన రాష్ట్ర కాబినెట్ లో తెలంగాణా మంత్రులు కోస్త మరియు రాయలసీమ వైపు వెళ్ళరు అదే విదంగా రాయలసీమ మరియు కోస్త మంత్రులు తెలంగాణా వైపు వెళ్ళరు ఒక్క హైదరాబాద్ తప్ప. నీకు ఇది తెలిస్తే నిజమని ఒప్పుకో. అలాంటి అప్పుడు మనం వాళ్ళతో కలిసుండడం ఎందుకు అన్న శ్రీ .

 15. Sree on January 13th, 2010

  తమ్ముడు జై ఆంధ్రా –
  “విడిపోయిన అన్నదమ్ములు బాగుపడలేదని చరిత్ర చెబుతుందా?” – పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అనే సామెత మీకు తెలుసనుకుంటా.. ఇంతకంటే దీనికి వివరణ అనవసరం. అర్థం చేసుకోలేకపోతే మీ ఖర్మం.
  “కాని కొంచెం negative లో అలోచిస్తున్తావు తెలంగాణా గురుంచి” – మీరు అలా అనుకోండి, మరోలా అనుకోండి.
  “మనం వాళ్లతో కలిసి ఉండడం ఎందుకు” – :)..

 16. Ramesh on January 29th, 2010

  Mem aveshaanni abhivruddike use chestham. Kaani Mi vaallu anagadokkadaaniki use chesthunnaaru. Nammakam poyindi boss. Chala oppandaalu violate chesaru. Dagaa paddam.
  M.G.University ki- 1.5 Crore
  Yogi Vemana Univ Ki 400 Crores

  Rangareddy district lo lands ammithe vachina money 20,000 Crores.
  Pranahitha chevella project ki ichchindi- 200 Cr (Daani estimated cost 20,000 crores)
  Rangareddy district lo okka Govt. Degree college kuda ledu.

  National high way-9 road widening just andhra prantham varake. Telangaanaa lo narrow road.

  Udyamam intha theevranga nadusthunna chese anyayam panulu aapakunda chesthune pothunnaru. Andhra vaallu hyd ki raaka munde ma prantha developed (Hitech city nizam kattichaada ani navve vetakaaram waste gaallu untaaru.) Miru raakamunde Hakimpet, Begum pet airpots, Kacheguda, Secunderabad, Nampalli railway statioons,Draingae, drinking water, Tanks, Chala pedda pedda hospitals enno unnai. Kurnool capital city lo tents lo mi capital unnappudu files pandulu ethukelthe vaatini paardroladaaniki budget lo money allocate chesevaaru. Adi mi abhivruddi. Hyderabad developed ani vachcharu kaani develop cheddam ani meeru raaledu.

 17. SATHEESH KUMAR C.G. on April 9th, 2010

  Telengaana Abhivruddi koraku poraaadutunna K.C.R , taanu ennikayyi lakshlaku lakshalu jeetaalu teesukuntoo, kotlaku kotlu m.p.lads release cheyinchukuntoo …. intavaraku niyojakavargaaniki kaadu kadaaa kendraanikee raaledu… kaneesam aa niyojakavarga samsyala meeda intavaraku maatalaadaledu.. Emante TELENGANA koraku DELHILOpiravy chestunnaadata… Raajeenaama cheyakapodaaniki kaaranam Mallee poti cheste DEPOSIT Koodaa dakkaneeyakoodadani LOCAL prajalu Decide ayyaaru, anduke jaarukunnaadu..
  TELENGAANA PRAJALU K.C.R Chestalanu choosaina nijam telusukuntaaru.. Lakshala jeetaalani tanayite ettochhu kaani VIDYAARTULU chaduvukokoodadu….
  A.C.lalo tanu gadapocchu, juicelu taagachhu kaani PRAJALU Maatram Police debbalu tintoo, Jaillalo Maggavachhu…..
  Vidyaartulemo BALIDAANAALU Chesukuntunte K.C.R A.Clo koorchuni T.V.lo enjoy chestunnaadu.. Chanipoyina aa talli tandrula baadalanu jeevitaamtam K.C.R teerchagalada ? kaneesam okka roju samasyalanianaa…… ? teerchaledu…,

Leave a reply

RTSMirror Powered by JalleDa

css.php