తెలంగాణా రొట్టెముక్క కోసం…

“చావా కిరణ్” – తెలుగు బ్లాగ్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణా సమస్య గురించి ఓ బ్లాగ్ పోస్ట్ వ్రాసాను, చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని కోరగానే వెంటనే స్పందించారు – మెయిల్ రూపంలో.

ఇదేంటి మహాశయా, ఆ వ్యాఖ్యలేవో బ్లాగ్‌లోని వ్యాఖ్యల రూపంలోనే ఉంచవచ్చుగా అని అడిగితే “కాస్తా ఆగండి, వ్యాఖ్యను మామూలుగా కాదు.. కవిత రూపంలోనే సంధిస్తాను” అని ఓ మంచి కవితను వ్యాఖ్య రూపంలో పంపారు. అంతేనా.. తెలంగాణాలో పేదలకు జరుగుతున్న అన్యాయాల గురించి, వారి బలహీనతను అడ్డుపెట్టుకుని రాజకీయ నాయకులు ఆడే వికృత క్రీడ గురించి నాలుగన్నర సంవత్సరాల క్రితమే నేనో కవిత వ్రాసాను అంటూ తన భాండాగారం నుండి ఓ లింక్ పంపారు.

అంతా బానే ఉందండీ.. ఎలాగూ మన దారులు ఒకటే కాబట్టి, ఈ కవితను నా బ్లాగ్‌లో నేను మళ్లీ ప్రచురించవచ్చా అని అనుమతి అడగగానే “ఓ.. యస్” అనేసి తన సహృదయతను చాటుకున్నారు.

నా బ్లాగ్‌లో “చావా కిరణ్” గారి కవిత.. ఇదిగో (అసలు లింక్) :

రొట్టెముక్క ఒక్కటి ఉన్నది
పిట్టలన్ని వాలినాయి దానికోసం
పెద్ద పిట్ట ఒక్కటి చిన్న సైన్యంతో వచ్చి
రొట్టెముక్కని మొత్తంగా తినబోయినది!
బాబేమో ఆ పిట్టపేరు, తమ్ముల్లేమో దాని సైన్యం।

ఓ ముసలి పిట్ట దాని సేవకులతో వచ్చింది
నా రొట్టె, నా రొట్టె అని అరిచింది
లాక్కున్నారు, లాక్కున్నారు అని అరిచింది
యుద్దం చేసింది, ఓటులతో ఓడిపొయినది, పాపం
రొట్టె దొరకలేదు, ముసలి పిట్టకి పాపం!

మరొక పిట్ట వచ్చినది, చంద్రుడేమో దాని పేరు
మొత్తంగా అయితే కష్టమని
రొట్టెముక్కని ముక్కలు చేయమంది
తన వాటా తనకే కావాలంది
“నో” అన్నారు తమ్ముల్లు
“సై” అన్నాడు చంద్రుడు

ముసలి పిట్ట చంద్రుడితో జోడీ కట్టింది
రొట్టెను ముక్కలు చేస్తాము
రొట్టెను ముక్కలు చేయం
అన్నారు, యుద్దం చేశారు గెలిచారు
రొట్టెను ముక్కలు చేయలేదు
అడిగితే ఇదిగో, అదిగో అన్నారు
కొంచెం కొంచెం కొరుక్కొని తినసాగినారు

బాబుకేమో దిక్కులే దిక్కయినాయి
జాపా అని మరొక పిట్ట
రొట్టెను ముక్కలు చేయండి
అని అన్నది, తన వాటా ఎక్కడ పోతుందో అని

కొత్త పిట్టలు వస్తున్నాయి,
రొట్టెకోసం ఆశపడుతున్నాయి
శాంతి అట్లాంటి పిట్ట
వన్నె చిన్నెలది ఒకప్పుడు
ఇప్పుడేమో రొట్టెముక్క కోసం ఆరాటం

వీటన్నింటికీ దూరంగా
బక్క పిట్టలు
చెక్క ముక్కల మాటున
దీనంగా, వైనం చూస్తూ
ఆకలిగా నోరు తెరిచి చూస్తూ
ఆవురావురుమంటున్నాయి
నీటి చుక్కలకోసం
కాలే కడుపుకోసం
పాపం
పాపం

ఏ పిట్ట ఎవరితో జత కట్టినా
ఏ పిట్ట ఎన్ని చెప్పినా
ఈ బక్క పిట్టల బతుకులింతే
ఏ పిట్ట ఎన్ని చెప్పినా
ఏ పిట్ట ఎన్ని ఆశలు చూపినా
ఈ బక్క పిట్టల బతుకులింతే
అయ్యో అయ్యో
పాపం పాపం

RTS Perm Link

10 Comments so far

 1. ravi on December 30th, 2009

  endukura babu oka prantanni uddesinchi rastaru… chetta nayallu.

 2. sree on December 30th, 2009

  @ravi గారు –
  అంతేగా మరి.. చెత్త నాయాళ్లు కాకపోతే, ఎక్కడో ఏదో తగలబడిపోతుంటే మనకెందుకులే అని ఊరుకోక ఎందుకీ రాతలు. చదివి ఎవడు బాగుపడతాడు కనుక, ఎవడు మాట వింటాడు కనుక. కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులు చెప్పిన మాట వినడమే గగనమైపోయిన రోజుల్లో.. ఎందుకీ పిచ్చి రాతలు. ఆలోచనాశక్తి పూర్తిగా నశించి, ఆవేశపు అంధకారంలో, మేథావులు, విద్యార్థులు, ఉద్యోగులు అనే తేడాయే లేకుండా రాజకీయ మాయలో పడి, మంచీ చెడూ తెలియని ఉన్మత్తావస్థలో కొట్టుకులాడుతున్న ఓ ప్రాంతాన్ని ఉద్దేశించి వ్రాసి ఏం బావుకుందామని?
  కెసిఆర్ చేసిన మహోన్నత దీక్ష గురించి వ్రాయవచ్చుగా..
  జెఎసి వెనుకనున్న పదవీకాంక్షల గురించి వ్రాయవచ్చుగా..
  లేకుంటే కనీసం,
  ఎన్డీ తివారీ రాసలీలల గురించి పుంఖానుపుంఖాలుగా వ్రాయవచ్చుగా..
  ఎందుకీ చెత్త నాయాళ్లు ఇలా పనికిమాలిన అంశాలను పట్టుకుని వేలాడుతున్నారు?

  ఏమో..!

 3. Kumar on December 30th, 2009

  బాబు రవి ఊరికే ఉంటే ఊరాపేరా అని ఎందుకు కామెంట్ పెట్టడం, ఎందుకు దొబ్బిచ్చుకోవడం. ఇంతకీ తమరు ఏ ప్రాంతం వారు బాబూ. తమరు కామెంట్ పెడితే పనికి వచ్చేది పెట్టండి, లేకపోతే అన్నీ మూసుకుని కూర్చోండి. అంతే కానీ చెత్త కామెంట్‌లు పెట్టమాకురా చెత్త నాయాలా……..

 4. Vijay on December 30th, 2009

  ఇక్కడ ఎవరూ కూడా తార్కికంగా ఆలోచించటం లేదు. మనం అందరం ఒక్క తల్లి బిడ్డలమే అయినా కానీ ఇలా కుక్కల్లా కోట్లాడుకోవడం మాత్రం ఏమి బావో లేదు. రాజకీయాల్లో సరైన పరిష్కారం లేదా తప్పు పరిష్కారం అంటూ ఉండవు. కేవలం మన సౌలబ్యం కోసం మనం అందరికీ అమూదయోగ్యం ఐన పరిష్కారం కనుక్కోవటం మాత్రం కావలి. ఇలా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుని మనమే కరెక్ట్ అనుకునే నైజం పోవాలి. ఆంద్ర వాళ్ళు పోగారుబోతులని, తెలంగాణ వాళ్ళు సోమరిపోతులని ఇలాంటి gross generalizations చేసుకోవటం మన అవివేకం కాదా? మనవ సంబందాలు తెగిపోయాక ఇక కలిసున్నాలేకపోయినా పెద్ద లాబం లేదు. ఉద్యోగాల్లో, నీటి వనరుల వినియోగంలో తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది (వాళ్లకి తెలివితేటలూ ఉన్నాయా లేదా అన్న విషయం పక్కన పెడితే) అన్న విషయం వాస్తవం. అలాగే హైదరాబాదు అభివృద్ధిలో అందరి చేయి ఉంది, కానీ ఇప్పుడు దానిని వదిలెయ్యాలి అనటం పూర్తీ గా అన్యాయం. ఇలాంటి పరిస్తితులలో చదువుకున్న మనం ప్రస్తుతం సంయమనం పాటించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం పాటు పడేలా ప్రోత్సహించాలి. అంతే కాని రోజు రోజుకి పడిపోతున్న సౌబ్రాతుత్వాన్ని మరింత తొక్కి మనకి మనం ఏమి మంచి చేసుకోవటం లేదు. Negotiations అందరికి అన్ని లాబాలు జరగవు, మనం కొన్ని పక్కవారి విషయంలో పస ఎంత ఉంది అనేది అలోచించి సర్దుకు పోవడం ముఖ్యం. అన్నింటి కన్నా ముఖ్యం, ఇది జీవన్మరణ సమస్య కాదు. కాని మనల్ని మనం కించ పరుచుకుమ్తున్న విదానం మాత్రం హేయం. అందరం కలుద్దాం పరిష్కారం వెతుకుదాం. రాజకీయంగా కాదు. బ్లాగు పరంగా. ఏమంటారు? కనీసం ఇక్కడైనా మనం వివేకులం అని చెప్దాం. సరైన బ్లాగ్ తయారు చేద్దాం, ఫోరం తయారు చేద్దాం, అందరికి నచ్చేట్టుగా నాయకులను (moderators) ఎన్నుకుని రాజకీయాలతో సంబంధం లేకుండా మనకి మనం పరిష్కారం చర్చిద్దాం. ఇది నేను అన్ని బ్లాగులలో పోస్టు చేస్తున్నాను. దయచేసి అందరం దగ్గరికి వద్దాం. విషం చిమ్ముకోవటం ఆపేద్దాం.

 5. sree on December 30th, 2009

  @Vijay –
  నా బ్లాగులో మీరు దేన్ని ఉద్దేశించి విషం చిమ్మాననంటున్నారో నాకు అర్థం కావడం లేదు..
  ప్రత్యేక తెలంగాణాతో చెడిపోతారు, ఆలోచించండి, ఆలోచించి మీ నాయకులను అభివృద్ధికై నిలదీయండి.. అనేకదా ముందు నుంచీ మొత్తుకుంటున్నది.
  పరిష్కారాన్ని వెదికే క్రమంలో మీతో కలిసి సాగడానికి నేను సిద్ధమే.. ఎలాగో తెలియజేస్తే నేను, నా బ్లాగ్‌ను అనుసరిస్తున్న వారు, నాకు మద్దతిస్తున్న వారందరూ కూడా మీతో చేయి కలుపుతామని హామీ ఇస్తున్నాను!!

 6. Sarath 'Kaalam' on December 30th, 2009

  @ విజయ్
  బ్లాగర్లందరూ ‘కలిసి’ జాయింట్ ఏక్షన్ కమిటీగా ఏర్పడి ఈ సమస్య గురించి చర్చించాలంటారు! అది జరిగేపని అని నేను అనుకోను 🙂

 7. chavakiran on December 31st, 2009

  Hi Sree,

  Thanks for re-posting this here.
  It was written almost five years back, after looking at how Vijaya shanti is making entry into politics.

  Things from politicians haven’t changed a bit todate.

  But lot changed from people/media/center perspective.

  Alas.
  I will stop here.

 8. mjr on January 9th, 2010

  అంతా బాగానే ఉంది కానీ దొంగ దీక్ష చేపట్టి మిమ్మల్ని అందరిని ఫూల్స్ చేసిన లగడపాటి గురించి కూడా ఒక ఆర్టికల్ రాస్తే బాగుంటుంది అనుకుంటాను. మీ బ్లాగ్ చేదివే వాళ్ళలో తెలంగాణా వాళ్ళు (ప్రేమగా మీరు పిలిచే తాలిబన్లు) కూడా ఉన్నారనే విషయం మీకు తెలియంది కాదు.

 9. తెలంగాణా రావు on January 19th, 2014

  అయి పోయిందిరా తెలంగాణ వచ్చేసిన్దిరా

 10. Sree on February 19th, 2014

  అయిపోయిందిరా… మీ పని కూడా ఐపోయిందిరా.. 🙁

Leave a reply

RTSMirror Powered by JalleDa

css.php