తెలంగాణా విభజన – ఆత్మహత్యా సదృశమే!!

మిత్రులు రాజుగారు commented – “తెలంగాణాను దోచుకునేందుకు..!” on December 29th, 2009 –

సినీ రంగంలో దాదాపు 20 సంవత్సరాలు వెకిలి కామెడీలు చేసిన ఆలిండియా అందగాడు బాబూమోహన్ మీకు గుర్తున్నాడా? కొడుకు హఠాన్మరణంతో అతని వెండితెర జీవితం ఒక్కసారిగా కుదేలైపోయింది. మరో కొడుకుతో తీసిన సినిమా కూడా తూతూమంత్రంగా చీదేసేటప్పటికీ అతను ఒక సరిక్రొత్త వివాదానికి తెరతీసాడు… – ఏమని.. తాను “దళితుడు” అయినందువల్లనే దర్శక నిర్మాతలు తనతో వెకిలి కామెడీలు చేయించారని, గాడిదకు తాళి కట్టే సీన్లు, కాలితో తన్నించుకునే సీన్లను తనపై చేసారని పెద్ద దుమారమే రేపాడు. (ఇంచుమించు ఆ సమయంలోనే స్వర్గీయ శోభన్‌బాబు గురించి మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చకెక్కాడనుకోండి..)

ఈ సమయానికే తెలంగాణా రామాయణంలో బాబూమోహన్ పిడకలవేట ఏమిటనే సందేహం మీకొచ్చే ఉంటుంది..

తెలంగాణావాదుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే సందర్భాలు, సంఘటనలు సంభవించినప్పుడే వాటిని ఎదుర్కొనే తీరులో ఎదుర్కొని ఉంటే సమస్యకు అంతిమ పరిష్కారం విడిపోవడం అనేది అయ్యి ఉండేది కాదు. ఇన్ని దశాబ్దాలుగా దాన్ని నాన్చి, నాన్చి ఇక్కడ వరకు తెచ్చారు. అంతెందుకు – మన పొరుగున ఉండే తమిళనాడులో ప్రముఖ హీరో విజయ్ నటించిన ఓ సినిమాలో న్యాయవాదులను కించపరిచే సన్నివేశాలున్నాయని అక్కడి న్యాయవాదులందరూ రచ్చకెక్కారు. ఆ హీరో క్షమాపణలు చెప్పాడనుకోండి. ఆ తర్వాత అలాంటి సన్నివేశాలను చిత్రీకరించేందుకు మిగతావారు వెనుకడుగు వేసారు, వేస్తారు కూడా. అంతేగానీ, ఇలాంటి సంఘటనలను తక్షణమే స్పందించకుండా దాని గురించే ఓ 40, 50 ఏళ్లు ఆలోచిస్తూ ఉపేక్షించడం తప్పని మాత్రమే నా భావన. వీటన్నింటికీ పరిష్కారంగా ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టడం అని వాదించడం సరికాదు కదా.

మన బాబూమోహన్‌నే చూడండి – వేషాలు వచ్చినన్ని రోజులూ చేసాడు, సంపాదించాడు, చక్కగా స్థిరపడ్డాడు. గతంలో అతను ఇలాంటి వేషాలు నేను చేయను అంటూ వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయా? అవసరార్థం, స్వప్రయోజనార్థం అప్పుడు ఒప్పేసుకుని, చేసేసి ఇప్పుడేమో “దళిత” మాస్క్ వేసుకుని ప్రకటనలు గుప్పించేయడం సరి కాదు.

ఇప్పుడేమో మన ఓయూ విద్యార్థులు, తెలంగాణా వేర్పాటువాదులు అందరూ నిరాహార దీక్షలు చేస్తున్నారు – దేని కోసం.. రాష్ట్రాన్ని విడగొట్టమని. అంతేగానీ, వీళ్లల్లో ఏ ఒక్కరైనా, ఎప్పుడైనా మా కోసం ఒక డ్యామ్ కట్టండి, మా కోసం ఒక ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయండి, మా ప్రాంతంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టండి అని ఎప్పుడైనా దీక్షలు చేసినట్లు చరిత్ర ఉందా? (ఇది తెలంగాణాకే కాదు, యావద్భారతానికి వర్తిస్తుంది..) విడిపోవడం సమస్యలకు పరిష్కారమా? చేతనైతే అలాంటి దీక్షలు చేపట్టమనండి. అప్పుడు మనస్సుండే ప్రతి తెలుగువాడూ వాళ్ల దీక్షకు సంఘీభావం ప్రకటిస్తారు. కాదని మీరు, మరొకరు వ్యతిరేకించగలరా?

మీరన్నట్లు – తెలంగాణా ఆత్మగౌరవార్థం ప్రత్యేక రాష్ట్రాన్ని మంజూరు చేసారనే అనుకుందాం.. అప్పుడు సినిమాల్లో వాళ్ల యాసను కించపరిచే సన్నివేశాలుండవని ఎవరైనా హామీనివ్వగలరా? ఇప్పటికీ మన తమిళ సినిమాల్లో తెలుగు భాష, యాసతో పాటు అక్షరాలను సైతం కించపరుస్తూనే ఉంటారే – జిలేబీలు చుట్టినట్లుగా గందరగోళంగా ఉంటాయని.. తమిళనాడు నుండి మనం విడిపోయి ఎన్ని సంవత్సరాలు గడిచాయి మరి?

మీ వ్యాఖ్యలో –
1. ‘మీ నాయకుల చేతకానితనాన్ని మీరు ప్రశ్నించరెందుకు’ అంటూ వారిని దెప్పడం సమస్యకు పరిష్కారం కానేకాదు.
2. తెలంగాణాలో నిజమైన బాధితుల సమస్యను పట్టించుకోకుండా కేవలం అక్కడి రాజకీయ నేతల స్వార్థం మీద మాత్రమే బాణం ఎక్కుపెడితే మరింత ఆవేశకావేషాలు పెరగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఒరగదు.

మొదటిదానికి నా జవాబు –
ఇప్పుడు తెలంగాణాను విడగొట్టడానికి చేతులు కలిపిన నాయకుల్లో ఎన్నో ఏళ్లు ఎన్నో హోదాల్లో, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పదవులు వెలగబెట్టిన వారున్నారు. వారు ఆ ప్రాంత అభివృద్ధికి ఎంత కృషి చేసారు.. అలాంటి వారి దొంగ దీక్షలకు తలొగ్గి ఇప్పుడు తెలంగాణా అనే ప్రాంతాన్ని విడగొడితే ఆ ప్రాంతాన్ని వీరు అభివృద్ధి చేయగలరా? అసలు ఆ నాయకులకు తెలంగాణా ఇమ్మని అడిగే నైతిక హక్కు ఉందా?

అక్కడి అక్షరాస్యతా శాతం ఎంత? పన్నుల రూపంలో లభించే ఆదాయమెంత? అక్కడి సగటు జీవి తలసరి ఆదాయమెంత? తెలంగాణా ఇచ్చేస్తే రాత్రికి రాత్రి అల్లా ఉద్దీన్ కథలోలా ఏమైనా అద్భుతాలు జరిగిపోతాయా?

జల వనరులను వినియోగించుకోవడానికి రోడ్ల మీద గోడలు కట్టినట్లు ప్రాజెక్టులు కట్టెయ్యలేరుగా? ఆ అనుమతులను వారు పొందగలరా? పొందగలిగితే అదేదో కలిసి ఉండే చేసుకోవచ్చుగా. అందుకే మీ నాయకులను ప్రశ్నించండి అని నేను వారికి వారు మర్చిపోయిన వాళ్ల హక్కును గుర్తుచేసానే తప్ప దెప్పలేదు, దెప్పను, దెప్పడం నా అభిమతం కాదు.

ఇక రెండోది –
నా మొత్తం బ్లాగ్ పోస్ట్ సారాంశం అదే మహాశయా.. నిజమైన బాధితుల సమస్యలను పట్టించుకోండి అనే. నీతిమాలిన రాజకీయులను నమ్మి మోసపోవద్దనే. బాధితుల సమస్యలను పట్టించుకోవడమంటే రాష్ట్ర విభజనకు సై అనడం కాదు కదా. అక్కడ సర్వతోముఖాభివృద్ధికి బీజాలు వేయమనే కానీ కపట దీక్షలకు పొంగిపోయో, లొంగిపోయో అనవసర ఆవేశాలకు లోనయ్యో ప్రాణాలు తీసుకోవద్దనే.. అభివృద్ధిపరచమని అడిగేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది, ఆత్మగౌరవానికి భంగం కలిగితే తిరగబడే హక్కూ ఉంది, కానీ – విడిపోవడమే పరిష్కారమా..?

తెలంగాణాను విడగొట్టడమనేది నూటికి నూరు శాతం ఆత్మహత్యా సదృశమే తప్ప మరొకటి కానే కాదు…!

మీ స్పందనకు నా ప్రతిస్పందన సముచిత రీతిలో ఉందనే భావిస్తూ..

RTS Perm Link

16 Comments so far

 1. Venkat on December 29th, 2009

  మీరు సమైక్యాంధ్ర కోరుకునే వాళ్ళు అయితే బాబు మోహన్ అల్ ఇండియా అందగాడు అని సంబోధించేవారు కాదు. ఎందుకంటే బాబు మోహన్ తప్పు గా మాట్లాడాడే అనుకుందాము. ఏమి నీకు బుద్ధి లేదా అలా విమర్శ చేయడానికి. ఎందుకంటే అతను తెలగాణ వాడు కాబట్టి. మేము అభివృధి చెందలేదు. మమ్ములను చెందనివ్వకుండా చేసిన పాపం ఈ రాష్ట్రమును పాలించిన రాష్ట్ర ముక్య మంత్రులది. తెలంగాణా నుండి ముక్య మంత్రులయిన వారు 6 yrs మాత్రమె పరిపాలించారు. మిగతా వారు అంత ఆంధ్ర మరియు రాయలసీమ ముక్య మంత్రులు. వారు తెలంగాణా వాళ్ళకు పదవులు ఎరగా వేసి ఇంత కాలం తెలంగాణా అభివృది చేయలేదు. మేము నూరు కారణాలు చెబుతాము తెలంగాణా ఎందుకు కావాలో. సమైక్య ఆంధ్ర ఎందుకు కావాలో మీరు ఏమైనా కారణాలు చెప్పగలరా. తొక్కల తెలుగు వాళ్ళు విడిపోకూడదు అనే డైలాగ్ కాకుండా. ఎందుకు అంటే హిందీ మాట్లాడే అయిదు నుండి ఆరు రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు ఉంటె ఏమిటి. …

 2. sree on December 29th, 2009

  బాబూ “శంకనాకుడు” వెంకట్,
  (వెంకట్ తన జిమెయిల్ ఐడిని “sankanaaku@gmail.com” అని టైప్ చేసి ఉన్నందున మాత్రమే ఈ సంబోధన అని గమనించగలరు..)
  నీ కోసం మూడు ప్రశ్నలు:
  1. all india అందగాడినని బాబూమోహన్ ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నాడు. నేను తనను అలా సంబోధిస్తే తప్పేంటో, అది అసలు విమర్శ ఎలా అవుతుందో చెప్పగలరు.
  2. మీరన్నారే – “తెలంగాణా వాళ్ళకు పదవులు ఎరగా వేసి ఇంత కాలం తెలంగాణా అభివృది చేయలేదు” అని.. మరి ఇప్పుడు అదే నాయకుల దొంగ దీక్షలకు తలక్రిందులైపోయి ఆ నాయకుల చంక నాకుతున్నావుగా నువ్వు!! (ఇక్కడ మర్యాద కోసం “నాకుతున్నారుగా మీరు” అని అన్నానే అనుకోండి.. మొత్తం తెలంగాణా వాళ్లందర్నీ అంటున్నానని మరికొంతమందిని ఇతను ఉసిగొల్పినా ఉసిగొల్పతాడు.. అందుకే అలవాటు లేకపోయినా తప్పలేదు!)
  3. “మేము నూరు కారణాలు చెబుతాము తెలంగాణా ఎందుకు కావాలో.” – 100 అక్కర్లేదు గానీ, ఓ 50 చెప్పమ్మా
  దీక్షలు చేయండి, అభివృద్ధిపరచుకోండి అనే తక్కిన సారాంశాన్నంతా గాలికొదిలేసి నీదైన శైలిలో నువ్వు రెచ్చిపోతే ఊరుకునేవాడెవడూ లేడమ్మా..!

 3. Govind on December 29th, 2009

  ఇన్నాళ్లూ కెసిఆర్‌కు మాత్రమే నోటి దురుసు ఉందని అనుకునేవాడిని.. కాదు, అది ఆ ప్రాంతంలోని మీవంటి కొందరి కుసంస్కారానికి, భావజాల ప్రకటనలో నరనరాన జీర్ణించుకున్న దగుల్భాజీతనానిది అని మీ వ్యాఖ్య (తొక్క, నీకు బుద్ధి లేదా)తో తేటతెల్లం అవుతోంది వెంకట్ గారూ!!

  సమస్యకు ఉదాహరణగా చెప్పిన బాబూమోహన్‌ను తెలంగాణా వాడని వెనకేసుకొస్తూ మళ్లీ అదే పంథాను అనుసరిస్తున్నారు.

 4. telugu vaadu on December 29th, 2009

  @Venkat
  పదవులు ఎరగా వేస్తే లొంగిపోయే రాజకీయనాయకులని పట్టుకుని ఏమి సుఖపడతావు నాయనా. బాబూ మోహన్ ని అల్ల్ ఇందీ అందగాడు అని సంభోదించడం లో తప్పేమిటో నాకర్ధం కావడం లేదు. విడిపోడానికి నువ్వు నూరు కాదు వెయ్యి కారణాలు చెప్పు అవన్ని దిక్కుమాలిన,చేతకాని,చవట తెలంగాణ రాజకీయనాయకులు వాల్లని గంగిరెద్దుల్లా అనుసరించే చేతకాని వెధవల వల్లే. ఇప్పుడు మా మానాన నన్ను వదిలెయ్యండి అంటె గత 40 ఏళ్ళ నుంచి hyderabad లొ చేసుకున్నదంతా వదిలి వెల్లిపొడానికి ఇది *** కాదు. చేతనయితే నీ *** చూసుకొ లెకపొతే నోరు మూసుకుని కుర్చో.

 5. raki on December 29th, 2009

  telanagaanaa udyama geetaalakai..pl visit
  http://www.raki9-4u.blogspot.com

 6. chavakiran on December 29th, 2009

  కబోదులైతే ఏమిటి
  కర్కోటకులైతే ఏమిటి
  క్రూరులైతే ఏమిటి

  మా నడుములెప్పుడూ వంగిపొయ్యే ఉంటాయి.
  మా సలాములెప్పుడూ వారికే ఉంటాయి.

  నీట ముంచితే ఏమిటి
  ఆముదాన ముంచితే ఏమిటి

  మేమింతే
  మేం మేధావులం.

  మూడడుగుల మించి చూడలేకపోతే ఏం
  మిన్ను విరిగి మీద పడితే ఏం
  మేమింతే
  మేం మేధావులం.

 7. chavakiran on December 29th, 2009

  Also check this I wrote four and half years back. http://archives.chavakiran.com/?p=233

 8. Sarath 'Kaalam' on December 29th, 2009

  బాగా చెప్పారు.

 9. నాగప్రసాద్ on December 29th, 2009

  బాగా చెప్పారు.

 10. sree on December 30th, 2009

  @Govind, @telugu vaadu, @Sarath, @Nagaprasad గార్లకు –
  మీ సమయోచిత మద్దతుకు ధన్యవాదాలు..!

 11. sree on December 30th, 2009

  @raki గారు –
  “మీ బాధ మీదే కానీ మా తీరు మారదు” అనేలా మీరు పంపిన తెలంగాణా పాటలు ఉండే లింక్‌ మీ వంటి మరికొందరి మనోస్థితికి ప్రతిబింబంగా ఉంది.

 12. sree on December 30th, 2009

  @chavakiran గారు –
  చదివిన వెంటనే తగు రీతిన కవితా రూపంలో స్పందించినందుకు ధన్యవాదాలు!

 13. narayana on December 30th, 2009

  హలో sree,
  నీకు ఏమైనా భావ్యంగా ఉందా telugu vaadu రాసిన నీచ భాష నీ బ్లాగ్ లో ఉంచుకోవడానికి. చదువడానికి నీకు, నీ బ్లాగ్ ని follow అవుతున్న వారికి భాగ అని పిస్తడి అనుకుంటున్నావా?

 14. sree on December 30th, 2009

  @narayana –
  ఇదిగో.. ఇప్పుడే “తెలుగువాడు” వ్యాఖ్యను సవరిస్తున్నాను.. అలాగే మీరు పంపిన మరో రెండు వ్యాఖ్యలను ఆమోదించడం లేదు, అంగీకరించడమూ లేదు. కావున సహృదయంతో ఆ వ్యాఖ్యలను, అందులోని పూర్తి పదాలను మీకు మీరే అన్వయించుకోవలసిందిగా కోరుతున్నాను..

 15. Ramesh on January 29th, 2010

  sri…. neeku chala vetakaarma undi. Vekat peru undi. Kaani Mail id ni special ga mention cheyalani niku anipinchindi. Ni prantham buddi ponichukoledu. Ni vetakaarame ma udyamaaniki inka ekkuva balam. Miru entha irritate cheste anthaga calm unna naalaanti vaallu kuda study chesi udyamam loki diguthaaru.

 16. kanna on February 18th, 2011

  why Talangana people’s thinking is so pessimistic?
  They should stand on their own feet.I don’t under stand who is stopping their growth.

Leave a reply

RTSMirror Powered by JalleDa

css.php