తెలంగాణాను దోచుకునేందుకు..!

Telangana

 

మిత్రుడు KRISHNAMRAJU commented – “ఆంధ్ర రాష్ట్ర విభజనకు నిరసనగా..” on December 27th, 2009

మీ ఘాటు స్పందనకు అంతే ఘాటుగా నేనూ స్పందించగలను మిత్రమా.. కానీ మీకు నాకు ఉండే తేడా సభ్యతే కాబట్టి మర్యాదపూర్వకంగానే స్పందిస్తున్నాను!

మీరు ఇందులో పరాన్న జీవులు, నాటక రంగ పెద్దలు వంటి చాలా ఆరోపణలే చేసారు..

సరే – “హైదరాబాద్ లేకుండా తెలంగాణా అడిగితే” అని అంటున్నారుగా.. అసలు హైదరాబాద్‌ను అంతలా అభివృద్ధి పరచకపోయి ఉండి ఉంటే మీరు ఏ ధైర్యంతో ప్రత్యేక తెలంగాణా అడిగేవారని ప్రశ్నిస్తే మీ సమాధానమేంటి?

ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, అదిలాబాదు, మెదక్ , హైదరాబాదు అనే జాబితాలో కాసేపు హైదరాబాద్ అనే పేరును తొలగిస్తే ఏమవుతుంది?

నాకు ముల్కీ కమీషన్, 610 జివో గురించి తెలియదనుకుందాం..

మీకు పెద్ద మనుషుల ఒప్పందం గురించి తెలుసా… మీ ప్రాంత నాయకులు తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మీ భవిష్యత్తును ఎలా పణంగా పెట్టారో తెలుసా? “తెలంగాణా ఇవ్వకపోతే ప్రతి తెలంగాణా వాడు ఒక మానవ బాంబ్ అవుతాడు” అనే దమ్మున్న మీరో, మరొకరో ఆ నాయకుల కాలర్ పట్టుకుని ప్రశ్నించలేకపోయారే? ఎవరు పరాన్న జీవులు. పదవుల మోహంలో, అమాయక ప్రజలనే సమిధలుగా చేసే యజ్ఞంలో బలిపశువులు అవుతుండేది మీరు కాదా?

పెద్ద మనుషుల ఒప్పందం – మీ కోసం – ఇదిగో:

1956లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి – కోస్తా, రాయలసీమ, తెలంగాణా – అన్ని ప్రాంతాల నాయకులూ ఇష్టపడ్డారు. అయితే తెలంగాణా నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అధిక రెవిన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది. ఇటువంటి ఇతర సందేహాల నివృత్తికై అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి 1956 జూలై 19న ఒక ఒప్పందానికి వచ్చారు. దీనినే “పెద్దమనుషుల ఒప్పందం” అన్నారు. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి:

1. కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ రెవిన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి. తెలంగాణా ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి
2. తెలంగాణాలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్ధులకు ప్రత్యేక రిజర్వేషనులు ఇవ్వాలి.
3. సివిల్ సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి.
4. ఐదేళ్ళ పాటు పాలనా వ్యవస్థలోను, న్యాయ విభాగంలోనూ ఉర్దూ వినియోగం కొనసాగాలి.
5. రాష్ట్ర మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం సభ్యులు ఉండాలి. ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి ఇతర ప్రాంతాల నుండి ఉండాలి.
6. ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణా అభివృద్ధి మండలికి ఉండాలి. మండలి సభ్యులు తెలంగాణా ప్రాంతం నుండి ఎన్నికైన శాసన సభ్యులు ఉండాలి.
7. తెలంగాణాలో మద్యపాన నిషేధాన్ని తెలంగాణా శాసనసభ్యులు కోరిన విధంగా అమలు చెయ్యాలి.
8. తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్ళపాటు నివసించి ఉండాలని నిబంధన రూపొందించాలి.
9. కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.

ఈ ఒప్పందం తరువాత తెలంగాణా నాయకులలో ఉన్న సందేహాలు తొలగి, ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

దీన్ని బట్టి మీకేం అర్థమవుతోంది?? ముఖ్యమంత్రి పదవితోనో, ఉప ముఖ్యమంత్రి పదవితోనో మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన వెసులుబాటును ఆనాటి పెద్దలు మీకు ఇచ్చారు. కానీ మీ ప్రాంత నాయకులు ఆ ఉప ముఖ్యమంత్రి పదవిని పొందగలిగారా? పోనీ, దాన్ని ఉల్లంఘించిన ఆంధ్ర నేతలు ఇన్నేళ్లుగా ఉప ముఖ్యమంత్రి పదవి కాకపోయినా, తత్సమాన హోదా ఉండే హోం మంత్రి పదవిని మీ ప్రాంత నాయకులకేగా కట్టబెట్టారు. జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మీ ప్రాంత నాయకులేగా? అంతెందుకు… –

ఇప్పటి కెసిఆర్ గారు తెదేపాను వీడి, తెరాసను స్థాపించింది ఎప్పుడు? నారావారి క్యాబినెట్‌లో పదవిని ఆశించి భంగపడినప్పుడు కాదా? అప్పటిదాకా చెంచాగిరీ చేసిన కెసిఆర్‌కు పదవి రాకపోయేసరికి అకస్మాత్తుగా ప్రత్యేక రాష్ట్ర సాధన గుర్తుకొచ్చేసిందా? మొన్నటికి మొన్న కార్మిక శాఖా అమాత్యులుగా ఆయన మీ ప్రాంతానికి ఏమి వెలగబెట్టాడో మీరు వివరించగలరా?

చెన్నారెడ్డి”గారు” మీకు గుర్తున్నారా? ప్రత్యేక రాష్ట్రం కోసం స్థాపించిన “తెలంగాణా ప్రజా సమితి”ని ఆయనే 1971లో ఎందుకు రద్దు చేసారో తమరు సెలవివ్వగలరా? పోనీ, ఆయన రాష్ట్ర సాధన అనే తపన అంతా తత్ఫలితంగా పొందిన ముఖ్యమంత్రి పదవితో అటకెక్కేసిందనే నిజం గుర్తుందా? పోనీ, ఇందిరా పార్క్‌లోని సమాధిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. వెళ్లి అడిగి చూడండి – రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణాకు నువ్వు ఏం చేసావని? ఇప్పుడేమో ఈ కెసిఆర్, జెఎసి అంటూ ప్రాంతీయవాదాన్ని పట్టుకుని వేలాడుతున్నారు.

ఒక్కసారి – ఆ 10 జిల్లాలు తెలంగాణా పేరుతో విడిపోయాయా.. పుత్రుల్లారా – గుర్తెట్టుకోండి.. అప్పుడు జరిగే పదవుల పందేరంలో, కుహనా రాజకీయవాదుల విశృంఖల రాక్షస మాయలో తెలంగాణా ప్రాంతం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన అప్పుడు నెత్తీనోరు లబలబలాడించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు మీరు, మీలోని ప్రతి ఒక్కరూ మీ భావి తరాలకు జవాబుదారీ అవుతారు.

“అనవసరంగా ఆవేశపడకు. అన్నీ తెలుసుకుని కామెంట్ చెయ్యి” అని నాకు హితబోధ చేసావ్ సోదరా.. మంచిదే.. కానీ నువ్వు ఆవేశపడుతున్నావుగా.. ఆ ఆవేశాన్ని సరైన దిశలో, సరైన మార్గానికి మళ్లించు.. వెళ్లి ఆ కెసిఆర్, జెఎసి నాయకులను కాలర్ పట్టుకుని ప్రశ్నించు.. ఇన్ని రోజులుగా మీరు ఊడబొడిచింది (సంస్కారం కానప్పటికీ, ఇన్నిసార్లు కెసిఆర్, కెసిఆర్ అని జపం చేసేటప్పటికీ అతని పదజాలం నాకూ వచ్చేస్తోంది..) ఏమిటి అని! ఇప్పుడు తెలంగాణా అనే రాష్ట్రం ఏర్పడితే మీ పాలన పంథా ఏమిటి అని.

అప్పుడు కెసిఆర్ ఇలా అంటాడు — (“బాబా” సినిమాలోలా)
“ప్రతి ఐదేళ్లకోసారి ఎలక్షన్ల పేరతో బోలెడు ప్రజాధనం వృథా అయిపోతోంది. మనదసలే వెనుకబడిన ప్రాంతం. ఇహ ఇప్పుడిప్పుడే మనల్ని మనం అభివృద్ధిపరచుకోవాలి. కాబట్టి ముందుగా నేను, నా తర్వాత నా కొడుకు కెటిఆర్, ఆ తర్వాత వాడి కొడుకు ఇలా వారసత్వ పాలనను తిరిగి అమలు చేస్తే.. ఎలక్షన్లకు ఖర్చు చేసే ధనాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించవచ్చు” – అని..

చివరిగా – ఆలస్యం అమృతం విషం అనేది అన్ని సందర్భాల్లోనూ వర్తించదు. నిదానమే ప్రధానం అని కూడా గుర్తుంచుకోండి! మిమ్మల్ని దోచుకునేందుకు ఇతర ప్రాంతాల వాళ్లే అవసరం లేదు, మీ ఆవేశం అనే బలహీనతను అడ్డుపెట్టుకునే మీ ప్రాంత నాయకులే చాలు..

RTS Perm Link

18 Comments so far

 1. ఓ సమైఖ్యాంధ్రవాది on December 28th, 2009

  Well said.

 2. Yogi on December 28th, 2009

  Chala bagha chepparandhi..babu telangana veerulu,ippatiki aina artham chesukoni mee nayakulanu adagandi..Vallaku Separate Telangna endhuku kavalo..

 3. virajaaji on December 28th, 2009

  చాలా బాగా చెప్పారు. కానీ సమైక్య వాదం రుచించని మూర్ఖులకు వారి నాయకులను నిలదీయడం మాత్రం చేతకాదు. అందుకే సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. నాయకులని అనలేక, సాటి తెలుగు వారిపైన విద్వేషాన్ని మూట గట్టుకుంటున్నారు.

 4. Chandamaama on December 28th, 2009

  “ఒక్కసారి – ఆ 10 జిల్లాలు తెలంగాణా పేరుతో విడిపోయాయా.. పుత్రుల్లారా – గుర్తెట్టుకోండి.. అప్పుడు జరిగే పదవుల పందేరంలో, కుహనా రాజకీయవాదుల విశృంఖల రాక్షస మాయలో తెలంగాణా ప్రాంతం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన అప్పుడు నెత్తీనోరు లబలబలాడించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు మీరు, మీలోని ప్రతి ఒక్కరూ మీ భావి తరాలకు జవాబుదారీ అవుతారు……”

  మీరు చెప్పింది అక్షర సత్యం!
  ఇప్పటి పరిస్థితుల్లో ఆవేశం కన్నా ఆలోచనే మిన్న!

 5. chandamama on December 29th, 2009

  పెద్దమనుషుల ఒప్పందం వివరాలను చక్కగానే తడిమినప్పటికీ ఆ ఒప్పందం అమలు పర్చుకోవలసిన బాధ్యత తెలంగాణా ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, నేతలమీదే ఉందనడం భావ్యం కాదేమో..

  ఉమ్మడి ఒప్పందంలో రాసుకున్న వాటిని అమర్చవలసిన బాధ్యత తెలంగాణేతర సీమాంధ్ర ముఖ్యమంత్రుల, నేతలపై ఉండదా? ఒప్పందం అమలుకు రాష్ట్రం ఏర్పడిన తొలి రోజునుంచే తూట్లు పడ్డాయని ఆధారాలు కూడా బలంగా ఉన్నాయి.

  ‘ముఖ్యమంత్రి పదవిలో నేనుండగా ఉమముఖ్యమంత్రి పదవి ఎందుకు దండగ’ అని సాక్షాత్తూ నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి స్వయంగా తోసిపుచ్చారంటేనే ఈ ఉమ్మడి ఒప్పందం ఎంత ఘనంగా అమలయిందో తెలుస్తూనే ఉంది.

  అందరూ కలిసి ఒప్పందానికి తూట్లు పొడిచినప్పుడు తెలంగాణా నేతల మీదే నేరం మోపడం సరికాదు. ఒకప్పటి చెన్నారెడ్డి అయినా, నేటి కెసిఆర్, కాంగ్రెస్‌‌ తదితరపార్టీలలోని గోతికాడ గుంటనక్కలయినా, తమకు అన్యాయం జరుగుతోందన్న ప్రజల ఆకాంక్షల బలం ప్రాతిపదికనే ఉద్యమాలను నడిపి సొమ్ము చేసుకుంటున్నారు తప్ప ఇదంతా కేవలం నాయకులు స్వార్థంగా మాత్రమే కొట్టి పారేయకూడదు. తెలంగాణా ప్రజల ఆకాంక్షను బయట ఉన్న ఎవ్వరం కూడా అగౌరవర్చకూడదు.

  తెలంగాణాలో జీవన్మరణ సమస్యలకు గురవుతోంది అప్పుడూ, ఇప్పుడూ కూడా ఎల్లయ్య, పుల్లయ్య, రామక్క, సీతక్కలే తప్ప కెసీఆరో దామోదరుడో, వాళ్ల వారసులో కాదు. స్వంత ప్రాంతంలో కూడా మోసానికి, వంచనకు గురవుతున్న వారి సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దానిమీదే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. తెలంగాణాలో నిజమైన బాధితుల సమస్యను పట్టించుకోకుండా కేవలం అక్కడి రాజకీయ నేతల స్వార్థం మీద మాత్రమే బాణం ఎక్కుపెడితే మరింత ఆవేశకావేషాలు పెరగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఒరగదు.

  ఈ బ్లాగ్ కథనం సారాంశాన్ని విమర్సించడం నా అబిమతం కాదు. 50 ఏళ్లుగా జరుగుతూ వస్తోందని వారంటున్న అన్యాయం, వివక్షతలలో ఎవరి పాత్ర ఎంతెంత ఉంది అనేవిషయం తేల్చకుండా, ‘మీ నాయకుల చేతకానితనాన్ని మీరు ప్రశ్నించరెందుకు’ అంటూ వారిని దెప్పడం సమస్యకు పరిష్కారం కానేకాదు.

  అందరూ కలిసి పెంచి పోషించిన ఇప్పటి విద్వేష వాతావరణంలో తెలుగు వారు కలిసిమెలిసి ఉండే కనీస భౌతిక ప్రాతిపదికకే తూట్లు పడింది. కాబట్టి ఇది భావోద్వేగాలకు, ఆవేశ ప్రదర్శనలకు సమయం కాదు.

  ఇలా బ్లాగుల్లో, వివిధ వేదికల్లో పరస్పరం ఆరోపించుకుంటే ‘ప్రత్యేకతా’ సమస్య తీరేది కాదు. మనకన్నా బాగానే అవతల పెద్ద తలకాయలు అబ్బలను, అమ్మలను కూడా వదలకుండా సినిమా చూపిస్తూనే ఉన్నాయి ఉచితంగా.

  తెలంగాణా కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, సీమ కావచ్చు వెనుకబడిన ప్రాంతాల భాష, ఆ ప్రజల యాసను కూడా సినిమాలలో వికృతకరించి అపహాస్యం చేస్తూ వస్తున్న మహా సంస్కృతి మనది. నిజంగా ఐక్యంగా ఉండాలనుకునే చోట ప్రజల యాసకు ఇలా అవమానం జరగగలదా?

  సంవత్సరాలుగా చెల్లుబాటవుతూ వస్తున్న ఈ భాషా వివక్షతకు కారకులెవరో విడమర్చి చెప్పాలా?

  ప్రత్యేకించి గత 20 ఏళ్లుగా అభివృద్ధి పేరిట హైదరాబాదులో జరుగుతూ వస్తున్నది నిజంగా ప్రజలకోసమేనా? నేతలను పక్కన పెట్టి, కడుపుకాలిన వాళ్ల బాధను మరంత సంయమనంగా అర్థం చేసుకుంటే మంచిదేమో.

  నా వ్యాఖ్యలో నొప్పించే అంశాలుంటే క్షమించాలి.

  రాజు
  చందమామ

 6. sree on December 29th, 2009

  @rajugaaru –
  చూడండి: http://blaagu.com/sree/?p=311

 7. chandamama on December 29th, 2009

  తెలంగాణా సమస్యపై నాకు తెలిసి అటూ ఇటూ చర్చ జరిపిన బ్లాగులు కొన్నిటిని ఇక్కడ చూడండి.

  1.

  ఆంధ్రులు ఈ రాష్ట్ర ప్రజలు కాదా?
  http://manishi-manasulomaata.blogspot.com/2009/12/blog-post_05.html

  2.

  ఇదేమిటి…ఇగ్నోర్‌ చేయవద్దు.. జవాబు ఇవ్వండి
  http://kovela.blogspot.com/2009/12/blog-post_19.html

  3.

  విద్వేషాల గోలలో విజ్ఞతా స్వరం
  తెలంగాణాపై రంగనాయకమ్మగారి భావాలు
  http://venuvu.blogspot.com/

  4.
  తెలంగాణాపై రంగనాయకమ్మగారు – పరామర్శ
  http://blaagu.com/chandamamalu

 8. sree on December 29th, 2009

  @ఓ సమైఖ్యాంధ్రవాది, @Yogi, @virajaaji, @Chandamaama – మీ తక్షణ స్పందనకు ధన్యవాదాలు.

 9. raki on December 29th, 2009

  telanganaa geetaalu/paatalakai..www.raki9-4u.blogspot.com choodandi..spandinchandi..pracharam cheyandi..telangaana sadhiddaam..jai telangaana

 10. sree on December 29th, 2009

  ఏం.. తెలంగాణాను అభివృద్ధి చేద్దాం.. ఒక్కో ధనవంతుడు, ఒక్కో ఎన్ఆర్ఐ ఒక్కో గ్రామాన్ని దత్తత చేసుకోండి అని పిలుపునివ్వచ్చుగా సోదరా!!
  ఐక్యమత్యంగా ఉండి, దేశ రాజకీయాల్లో కీలకంగా ఉంటూ తెలంగాణా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుదాం అనాలని మీకు తోచలేదా? కేంద్రంలోని యుపిఎ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా మన రాష్ట్రంతో పోలిస్తే చాలా తక్కువగా ఎంపిలను సరఫరా చేసిన తమిళనాడు డిఎంకె ప్రభుత్వం కేంద్రంలో ఎన్ని కీలక పదవులను పొందగలిగింది, తమ రాష్ట్రానికి ఎన్ని ప్రాజెక్ట్‌లను, ప్యాకేజీలను దారి మళ్లించిందో మీకు తెలియదా? ఆ స్థాయిలో మన నాయకులు ఎందుకు పోరాడలేకపోతున్నారనే స్పృహే మీకు కలగదా? సమస్యను మీరు మరొక కోణంలో నుండి చూడలేరా?

 11. ravi on December 30th, 2009

  nee story lone nee neechapu “balupu” arthamavutundi…. anta seenu ledanukunta neeku.

 12. sree on December 30th, 2009

  @ravi గారు –
  ముందుగా మీరు రెండు విషయాలు తెలుసుకోవాలి.
  ఒకటి.. మీ ఆరోపణలను నేను అంగీకరించడం లేదు కాబట్టి అవి తిరిగి మీకే చెందుతాయి.
  రెండు.. నేను చెప్పను.. ఏం చేసుకుంటావో చేసుకో పో..!

 13. Kumar on December 30th, 2009

  ఒరేయ్ రవి… అసలు ఇంతకీ నీ విషయం ఏంట్రా. అసలు నీకు ఏమి నీచపు బలుపు అర్థమయ్యిందో నాకు చెప్పరా. సరే పోనీ మాకు అంత సీన్ లేదే అనుకుందాం నీకు ఎంత సీన్ ఉందో అదైనా చెప్పు. నిన్ను కాని *** కేసిఆర్ ***. పనికిమాలిన ***. ఒరేయ్ నువ్వు ఇంకొకసారి కామెంట్ పెట్టావంటే ***. ***. ***.

 14. sree on December 30th, 2009

  @kumar గారు –
  శాంతి.. శాంతి.. ఈ మధ్య ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పినట్లు – విడిపోవాలనుకునేవాడు కత్తులు దూస్తాడు గానీ, కలిసి ఉండాలనుకునేవాడు జులుం చేయడు, చేయకూడదు. దేన్నీ తెగేదాకా లాగకూడదు. అనవసర ఆవేశాలను రెచ్చగొట్టకుండా ఉండేందుకు మీ వ్యాఖ్యను కొన్ని *లతో సవరిస్తున్నాను.. గమనించగలరు!!

 15. Mjr on January 4th, 2010

  గంటె కాలేటప్పుడు ఏమి అనిపించదు.. వాత పెట్టినప్పుడు తెలుస్తుంది దాని పవర్ ఏమిటో ..kcr కూడా అంతే అందుకే మీరు…కాలి ఎలా అరుస్తున్నారు..మీరు 1969 లో చూసిన తెలంగణా వాళ్ళు వేరు ఇప్పటి వాళ్ళు వేరు..ఒక వేల హైదరాబాద్ తెలంగాణా వాళ్ళకి కాకుండా మీకు ఇస్తే మీరు తెలంగాణా వాళ్ళని కాదని సుఖంగా ఒక్క రోజైనా హైదరాబాద్ లో నిద్ర పోగలరా

 16. sree on January 4th, 2010

  మధ్యన ఈ హైదరాబాద్ లొల్లి ఏంటి.. చాలా మంది తెలంగాణావాదులు అసలు పోస్ట్‌లోని సారాంశానికే సంబంధం లేకుండా, హైదరాబాద్ హైదరాబాద్ అంటూ జపం చేస్తున్నారు.. అసలు వేరుపడటమే వద్దు అని మేమంటుంటే, “హైదరాబాద్ మీకే ఇచ్చేస్తే కాదంటారా, హైదరాబాద్‌లో నిద్రపోగలరా” అంటూ సవాళ్లు విసురుతున్నారు. కళ్లు తెరవండి… బ్లాగును మళ్లీ మొదట్నుంచీ చివరిదాకా పూర్తిగా చదవండి.. మీరు మెచ్చుకునే kcr నిన్నమొన్నటిదాకా మిమ్మల్నేం ఉద్ధరించాడు.. పోనీ ఇకపై ఎలా అభివృద్ధిపరుస్తాడు?

  ఉత్తరాది మాట ఎలా ఉన్నా.. దక్షిణాదిన భాషాప్రయుక్త రాష్ట్రాలే ఉన్నాయి. ఇదిగో.. నిన్నే తమిళనాడు విభజన అంటూ రాందాస్ మళ్లీ రచ్చకెక్కాడు. అది ఇచ్చేసారనుకోండి.. ఆపై కర్ణాటక, చివరాఖరికి కేరళను కూడా విభజించాలని ఆయా ప్రాంతాల స్వార్థ రాజకీయనాయకులు చిందులేస్తారు. వేరుపడవద్దనే సమైక్యవాదులుగా మా వా(బా)ణి!! కాదు, కూడదూ అంటారా..

  ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులని – నీళ్లు చల్లి వదిలేస్తాం..!

 17. mjr on January 5th, 2010

  ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులని – నీళ్లు చల్లి వదిలేస్తాం..!thank’s from telangana people

 18. Rao on January 5th, 2011

  Very well written article. It will be useful to anybody who utilizes it, as well as myself. Keep doing what you are doing – i will definitely read more posts.

Leave a reply

RTSMirror Powered by JalleDa

css.php