ఆంధ్ర రాష్ట్ర విభజనకు నిరసనగా..

ఆర్థిక మాంద్యం చీకట్లు చెల్లాచెదురవుతున్నాయన్నదానికి సంకేతంగా క్షణం తీరికలేని ప్రాజెక్ట్‌లు…

పని ఒత్తిడితో సంబంధం లేకుండా, బృందంలో ఎంతమంది ఉన్నారు, ప్రొడక్టివిటీ ఎంత అనే కనీస స్పృహే లేకుండా ఊహకందని చావుగీతలు (డెడ్‌లైన్లు)..

మన స్వంత బ్లాగ్‌ను పక్కన పెట్టగలం కానీ, ఆఫీస్ పనులను కాదు కదా.. పోనీ ఇంటిలోనైనా బ్లాగుతామా అంటే రోజుకు 14 గంటలు ఇక్కడ పని చేసి చేసి.. నాలో రోజురోజుకూ సృజనాత్మకత అటకెక్కుతోంది..

బోలెడు భావాలున్నాయి – వ్యక్తపరచడానికి.. కానీ తీరికే లేదు..

అంతలో మన రాష్ట్ర విభజనకు పచ్చ జెండా ఊపిన యూపిఏ సోనియా…. రెండు నెలల క్రితం అయితే ఏమో గానీ, ఇప్పుడు ఈ విభజనకు వ్యతిరేకంగా ఏమాత్రం నిరసన గళం అందించలేకపోతున్నానే నిరాశ..

అంతలో మా మిత్రుడు పంపిన ఒక ఫార్వార్డెడ్ ఇమెయిల్.. కనీసం దీన్నైనా మీ అందరితో పంచుకోవాలని..

ఇదిగో ఇలా యదాతథంగా..
10 కోట్ల మంది ఆంధ్రులను ముక్కలు చెక్కలుగా చేయుటకు సిద్దపడుతున్న, సిగ్గులేని పనికిమాలిన రాజకీయ నాయకలను అంతం చేయుటకు మానవ బాంబుగా మారటానికి సైతం మనస్సు సిద్ధపడుతోంది అంటే ఎంత మానసిక సంఘర్షణ జరుగుతుందో నా లోపల ….

4 కోట్ల మంది తెలంగాణా ప్రజల్లో ఎంత మంది తెలంగాణా కావాలని కోరుకుంటున్నారు ..కేవలం వెయ్యి లేదా రెండువేల మంది చోట మోటా నాయకులు తప్ప ఏ ఆంధ్రుడు కూడా రాష్ట్రం విడిపోవాలని కోరుకోవటం లేదు….కొందరు రాజకీయ నిరుద్యోగుల స్వార్ధపూరిత ప్రయోజనాల కోసం తప్ప ప్రత్యేక రాష్ట్రం ఏ విధంగా అభివృద్దికి దోహద పడుతుంది..

అస్సలు KCR జ్యూస్ తాగిన రోజు మీడియా సంయమనం పాటించి వుంటే నేడు ఈ దుర్భర పరిస్థితి వచ్చి ఉండేదా ..

నీతి, నిబద్దత లేని ఒక తాగుబోతుని ఇవ్వాల గాంధీ మహాత్ముడిలా కీర్తించే దుర్దినం వచ్చినందుకు ఒక తెలుగువాడిగా సిగ్గుతో తల దించుకుంటున్నా… మొదటి నుంచి కుడా తెలంగాణా రాజకీయ నిరుద్యోగుల స్వర్గధామంగా వెలుగొందుతుంది.. ఏ ఎదవకి పదవి రాకపోయినా తెలంగాణా పల్లవి ఎత్తుకుని ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడాడు.. తెలంగాణా ఎన్నికలలో పోటీ చేసే సత్తా కూడా లేని ఒక దగుల్బాజీ రాజకీయ నాయకుడు, గాంధీ మహాత్ముడి లాగ బహిరంగంగా కీర్తింప బడుతుంటే 10 కోట్ల మంది ఆంధ్రులు సిగ్గుతో చచ్చిపోతున్నారు……కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలతో సంబంధం లేకుండా ఢిల్లీ పెద్దలు తీసుకున్న ఈ దౌర్భాగ్యపు నిర్ణయాన్ని తెలుగువారు అందరు ప్రతిఘటించాలి….

కేవలం 2000 మంది విద్యార్దులు గొడవ చేస్తేనే తెలంగాణా ప్రకటన చేస్తే లక్షలాది తెలుగు వాళ్ళు ఆందోళన చేస్తే ఏం చేస్తారు…….

సమైక్యాంధ్ర కోరుకునే యువతరం అందరికి ఇదే నా మనవి…
మన యువసత్తా జాతి కోసం చాటాల్సిన తరుణం వచ్చింది…
శాంతియుతంగా మన నిరసనని వివిధ రూపాలలో తెలియచేద్దాము..
తెలుగుజాతి యొక్క ఉనికిని కాపాడుకుందాము……
రాజకీయాలకు అతీతంగా కలిసి పోరాడదాము..
తెలుగుజాతి సత్తాను చాటుదాం..
 
మేలుకో యువత ——–కాపాడుకో రాష్ట్ర భవిత

జల ప్రాజెక్టులు అక్కడ (జూరాల, సాగర్ )……
బీడు భూములు ఇక్కడ….

బొగ్గు గనులు అక్కడ……..
చిమ్మచీకట్లు ఇక్కడ…

IT , కంపెనీలు, విశ్వ విద్యాలయాలు (IIT, IIIT …) అక్కడ……
మన విద్యా కుసుమాలు ఎక్కడ??

అబివృద్ది అక్కడ…… మనమెక్కడ??
పోరాటాలు అక్కడ…… మరి మనమెక్కడ?

RTS Perm Link

6 Comments so far

 1. రహంతుల్లా on December 12th, 2009

  100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.

 2. sree on December 14th, 2009

  రహంతుల్లా గారు.. యానాంను పుదుచ్చేరి నుండి విడదీసి “సమైక్యాంధ్ర”లో కలపాలనే ఆలోచన రావలసింది మనకు కాదండీ.. ఎప్పుడైనా సరే, ఏ ఉద్యమమైనా సరే.. “ఆ ప్రాంత” ప్రజల్లోంచి రావలసిందే తప్ప మనబోంట్ల సామాన్యుల నుండీ కాదు.. కుహనా రాజకీయ నిరుద్యోగుల అవకాశవాద చదరంగపుటెత్తుల నుండీ కాదు..

  బహుశా మీ ఈ ఆలోచనకు కారణం – కేంద్రమంత్రి చిదంబరం ఈ తెలంగాణ అంశానికి సోనియా తరపున ప్రకటనను వెలువరించడమే కావచ్చు. ఐనా.. అతను మాత్రమేమి చేస్తాడు చెప్పండి. “ఎప్పట్లానే హైకమాండ్ ఆడించే తోలుబొమ్మలాటలో అతనూ ఓ బొమ్మేగా“!

 3. KRISHNAMRAJU on December 27th, 2009

  Asalu meeku avagaahana undha ? Asalu meeku charithra thelusa ? thelisthe ilaa maatlaadaaru ?
  Madras state nundi Andhra Rastram kosam Potti Sri Ramulu endhuku Amarana dheeksha Chesadu ? Appudu mee andharu endhuku prathyeka Rastram kosam poradaaru ? Appudu MADRAS nundi vidipovadaaniki bhaadha anipinchaledha ? E bhaasha ayithenemi ? manamantha bharatheeyulam ani mee peddhalaku thochaledha ? mee Adhipathyam chelladhane bhaavanathone kadha ? Ayina memu meeku nastam jaruguthundhane kadha Meeru SAMAIKYANDHRA ani antunnaru ? Enti mammalni vidichi meeru brathakalera ? nee gundela meedha cheyyi vesukoni SAMAIKYANDHRA udhyamam gurinchi cheppu ? neevu avagaahana lekunda maatlaaduthunnavu ? MULKI COMMISSION, 610 G.O. mee vaallu Rastramlo endhuku amalu cheyaledho meeku thelusa ? HYDERABAD lekunda memu TELANGANA adigi unte meeru asalu SAMAIKYAANDHRA ane oose theesevaaru kaadhu. ITHARA PRAANTHALA PAINA AADHIPATHYAM CHELAYINCHADAM, AADHARA PADI BRATHAKADAM MEE NARA NARAANA JEERNINCHUKU POYINDHI. OKKA MAATALO CHEPPALANTE MEERU PARAANNA JEEVULU. SAMAIKYANDHRA PERUTHO MEERU TELANGANA PAI KAPATA PREMA CHOOPISTHUNTE MAAKU MEE NAATAKA RANGA PEDDHALU GURTHUKU VASTHUNNARU. ENDHUKU ANTE MEERU VAALLA SANTHATE KADHAA. OH ANDHRA ANALLU/THAMMULLAARA MANAM ANNADHAMMULLAAGA VIDIPODHAAM. DHAYA CHESI MAATHO GODVALODDHU. IKANAINA MAMMALNI ARTHIKANGA, SAMAJIKANGA EDHAGANIVVANDI PLZ. TELANGANA RAAKA POTHE PRATHI TELANGANA VAADU OKA MAANAVA BOMB AVUTHAADU. ANAVASARANGA AAVESHA PADAKU. ANNI THELUSUKUNI COMMENT CHEYYI.

 4. sree on December 28th, 2009

  చూడండి: http://blaagu.com/sree/?p=298

 5. రహంతుల్లా on January 6th, 2010

  చారిత్రిక నేపద్యం ఒకటే తప్పతెలుగురాష్ట్రంలో యానాన్ని కలపకపోటానికి మరేకారణం లేదుగా?యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఈ కాలంలో కూడా ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో890కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 890కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది. గోదావరి తూర్పు డెల్టా కింద యానాం తాగునీటి ట్యాంకులను నింపాల్సి ఉంది.పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నిస్తున్నది. తాళ్లరేవుకు కూతవేటు దూరంలో ఉన్న పుదుచ్చేరి కేంద్రం పాలిత ప్రాంత పరిధిలో యానాం వాసులకు అనేక ప్రత్యేక రాయితీలు అందుతోన్న విషయం విదితమే. రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేంద్రపాలిత ప్రాంతంలో పన్ను రాయితీలు ఉన్నందున అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి. జిల్లా మధ్యలో ఉన్న యానాం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నందున కేంద్ర పాలిత ప్రాంత ప్రత్యేకతలు జిల్లావాసులకు ఎరుకే. అక్కడి సౌకర్యాలు అంది పుచ్చుకునేందుకు యానాం వాసులుగా నకిలీ ధ్రువపత్రాలతో ఆంధ్రావాసులు యానాంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలు పరిధి తక్కువ కావడంతో కేంద్ర నిధులు భారీగా ఉండడమే కాకుండా ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు.ఒకరూపాయికే కిలో బియ్యం పధకం ప్రవేశపెట్టారు.యానాంలో పరిశ్రమల స్థాపనకు భారీ మొత్తాల్లో సబ్సిడీలు, ఇతరత్రా సదుపాయాల కోసం అక్కడ పరిశ్రమల స్థాపనకు ఆంధ్రా పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపేవారు. అయితే సౌకర్యాలు పొందిన తర్వాత పరిశ్రమలను మధ్యలో వదిలివేసిన సంఘటనలున్నాయి.క్రమేపీ పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి సుముఖత చూపుతుంటే, మంత్రి మల్లాడి కృష్ణారావు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇన్ని దశాబ్దాల తరువాతకూడా యానాం ప్రజలు అటు రాష్ట్రప్రతిపత్తికీ ఇటు గ్రేటర్ కాకినాడలో విలీనానికీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. యానాం ముఖ్యమంత్రి వి వైద్యలింగం కృష్ణాగోదావరి బేసిన్‌ నుంచి తమ ప్రాంతానికి 2.515 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల సహజవాయువును ప్రతిరోజూ సరఫరా చేయాలని గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ గ్యాస్‌ను ఉపయోగిస్తామని పేర్కొన్నారు. కాకినాడ-పుదుచ్చేరిల మధ్య జల మార్గానికి జాతీయ హోదా కల్పించే బిల్లుకు లోక్‌సభ రాజ్య సభ ఆమోదం లభించింది. దాదాపు 970కిమీల పొడవు కలిగిన ఈ జలమార్గంలో 888కిమీలు మన రాష్ట్ర పరిధిలో ఉండగా, ఈ ప్రదేశంలో 14 టెర్మినల్స్ ఏర్పాటు జరుగనుంది.అనసరమైన చోట్ల బకింగ్ హామ్ కాలువకు, బంగాళా ఖాతానికి మధ్య వంతెనలు నిర్మించాలని కోరారు. ఈ జాతీయ జలమార్గం ఏర్పాటు ద్వారా కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్ హామ్ కాలువ,పరిధిలోకి వస్తాయి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేశారు.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు.యానాంలో దేశంలోనే అతిపెద్ద 26 అడుగుల భారతమాత కాంస్య విగ్రహాన్ని విజయవాడకు చెందిన బొర్రా శివప్రసాద్‌ సుందరంగా తీర్చిదిద్దారు.తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

 6. Kaloji fan on May 26th, 2010

  Prajakavi Kaloji Narayana Rao said:

  తెలంగాణ వేరైతే
  దేశానికి ఆపత్తా?
  తెలంగాణ వేరైతే
  తెలుగుబాస మరుస్తారా?

  The state had no answer. Instead they shot the protesters. Kaloji asked:

  ప్రత్యేక తెలంగాణ అంటే
  పక్కలిరగ తన్నేందుకు
  ఆ.ప్ర.రా. ప్రభుత్వాన్కి
  అధికారము ఎక్కడిది?

  Whether Telangana or Yanam, the people have to decide. Others (e.g. andhra guys) have no role to play.

Leave a reply

RTSMirror Powered by JalleDa

css.php