“శ్రీ” మథనం

sree

అసలే విద్యుత్తు ఉండదు
ఉన్నా అందులోనూ కోతలు
రాత్రుళ్లు మోటారు పంపు దగ్గర కాపలాలు
కరెంటు – రైతు దాగుడుమూతలు
ఎప్పుడూ “అవుట్” అయ్యి “పోయేది” రైతే !!

తడిసీ తడవని పైరు
నకిలీ విత్తనాలు
రైతులపై తప్ప పంటల్లో
పురుగులపై పని చేయని మందులు !!

వానలు పడవు
జలయజ్ఞాలు ఫలించవు
కృత్రిమ వాన కరుణించదు
కప్పల పెళ్లిళ్లు కనికరించవు !!

పట్నవాసులేమి చేయగలరు
నేల విడిచి నింగికెగుస్తున్న
బియ్యం ధరను నిలువుగుడ్లతో చూడడం తప్ప !!

ఆకాశ గంగమ్మపై ఆశ ఎలాగూ పోయింది
ఇక అంతంత మాత్రంగా మిగిలింది
ఎండిన నదుల అట్టడుగున దాక్కున్న గంగమ్మే !!

ఇంతలో..
నదుల నీరు లేదు, నన్నడిగే వాడూ లేడు అంటూ
బయలుదేరారు “ఇసుకాసురులు” –
మేము లేమా స్వాహా చేసేందుకు అంటూ !!

నిర్భీతిగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా
ట్రాక్టర్ల లోడులతో కప్పెట్టేస్తున్నారు….
భారతదేశ వెన్నెముకను
మనకు అన్నం పెట్టే రైతన్నను !!

RTS Perm Link

7 Comments so far

 1. హర్ష on May 7th, 2009

  బావుంది మిత్రమా…

  రైతులు నిజంగా పాపం చాలా కష్టాలు పడుతున్నారు.. వారి తినేందుకు మాత్రమే కాకుండా మొత్తం ప్రజలకు పట్టెడన్నం పెడదామని ఆశతో (పేరాశ!!!) రైతులు పడే కష్టాన్ని వరుణ దేవుడు కూడా కరుణించడం లేదు.. ఇంకా ఎంత మంది రైతుల ఆత్మహత్యలను చూడాలో కదా…

  నేటి రైతుల పరిస్థితిని తక్కువ పదాలతో ఎక్కువగా చెప్పిన నీ కవిత బావుంది…

 2. anigalla on May 9th, 2009

  very nice.. this comment is not just for this particular post, this is my overall feedback on “Sree charitham”.. cool and lovely.. keep going..

 3. జయ on May 9th, 2009

  వానలు పడవు
  జలయజ్ఞాలు ఫలించవు
  కృత్రిమ వాన కరుణించదు
  కప్పల పెళ్లిళ్లు కనికరించవు !!

  చాలా బాగా చెప్పారు. ప్రకృతి శాపం ఓవైపు, స్వాహారాయుళ్ల ఆగడాలు మరోవైపు.. దేశానికి వెన్నెముక అయిన రైతన్నను నిలువునా ముంచేస్తున్నాయి. మనందరికీ ప్రాణం పోసే రైతన్న, దిక్కుతోచని స్థితిలో తనే ప్రాణాలు తీసుకుంటున్నాడు.

  ఎప్పటికప్పుడు భిన్నమైన సామాజిక అంశాలను , చక్కటి సామాజిక స్పృహతో, మీదైన శైలిలో రాస్తున్నందుకు ధన్యవాదాలు. మరిన్ని రాయాలని కోరుకుంటూ…

 4. jayachandra on May 9th, 2009

  మీ కవితలన్నీ చాలా బావున్నాయి.శుభాకాంక్షలు

 5. Bindu on June 18th, 2009

  ఎవరి శాపమో అన్నట్లు ప్రతి ఏడాది అన్నదాత ఇబ్బందులు పడుతూనే వున్నాడు . అకాల వర్షాలు, నకిలీ విత్తనాలు/మందులు, ప్రభుత్వ నిర్లక్ష్యం, ఒకటా, రెండా …,,,కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ప్రత్యక్షం గానో ,పరోక్షం గానో వుంటున్నది , తిండి పెట్టె కడుపు ఖాళీగా వుండాల్సివస్తోన్నది . కాని ఒక్కటి మాత్రం నిజం రైతు విలువ తెలుసుకొనే రోజు తప్పక వస్తుంది , రావాలని నా ప్రగాడ ఆకాంక్ష .

 6. madhavarao pabbaraju on June 24th, 2009

  మధనం–చాలా చక్కగా వున్నది. మీ భావన కళ్ళు చెమర్చేదిగా వున్నది.
  భవదీయుడు,
  మాధవ రావు.

 7. sree on June 25th, 2009

  @Harsha, @Anigalla, @Jaya, @Jayachandra, @Bindu, @Madhava Rao –
  అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు..:)

Leave a reply

RTSMirror Powered by JalleDa

css.php