నేను చదివిన నవల

January 3rd, 2008 by sateesharv

మొన్నీమధ్య యండమూరి గారి నవల చదవడం సంభవించింది. ఆ నవల పేరు అంతర్ముఖం.మొదటి పేజీలో యండమూరి గారు తన నవలలన్నింటిలో ఇదే వుత్తమమైన నవల అని పేర్కోన్నారు. అది నిజంగా అద్భుతమన్న రీతిలో వుంది. అదో మానసిక విశ్లేషాణాత్మక గ్రంథం.దాంట్లో ఒక శాంపుల్ కొటేషన్..

“వయసులో వృద్ద్ద శవాన్ని – జ్ఞానంలో శైశవాన్ని”

వీలైతే చదవండి… బుర్ర బద్దలు కొట్టుకోండి.. ;)   ఒకటి మాత్రం నిజం.. నేను చదివిన నవలలో ఇదే చాల బాగా అనిపించింది.

ఈ బ్లాగు గురించి సంక్షిప్తంగా….!!!!

September 17th, 2007 by sateesharv

ఈ బ్లాగు అనుకోకుండా సృష్టింపబడింది.
నాకులాగే చాలామంది స్నేహితులు వుద్యోగ భాద్యతలలొ పడి, చాలా వరకు తెలుగు చదవడం మానేశారు.నెట్ లో తెలుగు బ్లాగులు చూస్తుంటే ,మన కళాశాల రోజుల్లొ వివిధ విషయాల పై చేసుకొన్న వాదోపవదాలు,  రాసుకొన్న ఆశు, భావ కవిత్వాలు…. ఇలా చాలా… చాలా.. గుర్తుకొస్తున్నాయి కదా… అందుకే.. ఈ బ్లాగు… 
మిత్రులారా… మీ అందరికి ఇదే నా స్వాగతం… రండి మీ అభిప్రాయలు, ఆలోచనలు అందరితో  పంచుకొండీ… 
మూగ కొయిలేంటీ.. ఇలా పలకడమేంటని ఆశ్చర్యపోకండి…  

ఇక్కడ మిమ్మల్నెవరిని ఆపరు.. మీకు అనంతమైన స్వేఛ్చ వుంది.. ఏవిధమైన విషయసంబంధమైనా మీ అభిప్రాయల్ని స్వేఛ్చగా వెలువరించవచ్చు.. 

రండి మాటలాడుకొందాం….   
చూద్దాం.. ఇది ఎంతవరకు కొనసాగుతుందో…