Aug 26 2012

ఈనాడు తెలుగు వెలుగు లో నా అక్షరం.

Published by


బ్లాగ్మిత్రులకు..
నా అక్షరం. ఈనాడు. తెలుగు – వెలుగు ఉద్యమం లో కదం తొక్కి పదం పాడింది.
అక్షరాన్ని.. నేనక్షరాన్ని (పేజీ : 65) తెలుగు వెలుగు మొదటి సంచిక.
మిత్రుడు విష్ణు చైతన్య ఏరి కోరి నా తెలుగు ని వెలుగు లోకి తెచ్చాడు.

*నా కవిత మొదటిసారి ముద్రణ లో మీ ముందుకు.. *

నా ఆలోచనని అక్షరీకరించిన ఆత్మీయుడు, ఆప్తుడు విష్ణు కు మీ అందరి సమక్షం లో అభివందన ఆలింగనాలు.
(జుగల్బందీ లా మేమిద్దరం చేసిన) ప్రకాష్ రాజ్ ముఖాముఖీ మీకు నచ్చుతుంది.
( ఈ అవసరం వెనుక నా కాలేజీ జిగరీ దోస్త్: సీతమ్మ వాకిట్లో.. సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఆడ్డాల, నేను షూటింగ్ లో ఎన్నోసార్లు కలిశాం అదో అనుభూతి)
నా కార్యాలయ పరిధి లో జరుగుతున్న ఈ భాషా కళ్యాణానికి ప్రేరణే నేను తిరిగి రాయ పూనుకోవడం అందుకే ఈ కవితల వెల్లువ.. ఈ ఊపు ఎంతకాలమో!!
నా నాయకుడు నాగేశ్వర రావు గారు, ప్రిన్సిపల్, ఈనాడు పాత్రికేయ పాఠశాల, ఈ అత్యుత్సాహాన్ని ఉపేక్షించి ఆశీర్వదింతురు గాక.
నేను కార్య నిర్వాహకుడినే కానీ కార్య కర్తను కాదు.. నాలా ముందుండి నడిచే అదృష్టం అందరికీ రాదు. అది MNR గారి చలవే.
శంకర నారాయణ గారు సమర్ధించు గాక! ఎర్రాప్రగడ రామ్మూర్తి గారు అభినంధించు గాక. ఆర్వీ రామారావ్ గారు ఆనందించుగాక. సన్నిధానం శర్మ గారు ప్రోత్సహింతురు గాక.
నా గంతుల (నాట్య) గురువులు
జగమెరిగిన
శ్రీ సప్పా, కీర్తి శేషులు కోరాడ, కిల్లాడ సత్యం,
బొమ్మల గురువులు తాడేపల్లి వెంకన్న, బాలగోపాలం భాస్కర రాజులు, హరిష్ రేఖా చిత్ర కళాశాల, ఖమ్మం
లెక్కల గురువులు వేదాంతాచారి, కటికిరెడ్డి నరసింహారావు,
గ్రాఫిక్స్ గురువు: పోతుల శ్రీధర్ ,
సున్నిత భావాల స్ఫూర్తి కొప్పర్తి,
నను కన్నతల్లి నా తొలిగురువు గిరిజావతి,
ప్రోత్సహించిన తల్లి జాస్తి రమాదేవి,
ఎన్నడూ మరువలేని మమతల అక్క కీర్తి శేషురాలు డా. కటికిరెడ్డి పద్మావతిదేవి
మీరెక్కడ ఉన్నా.. నా మనసు లొ నిత్యం ఉంటారు. ఈ సందర్భం లో తలుచు కోకుండా ఎలా ఉంటాను!!

తెలుగు భాషా దినోత్సవం 29.8 2012 నాడు మీ ముందుకి రాబోతున్న ఈ మాస పత్రిక ను
రామోజీ మానస పుత్రికను మీ ఇంటి కి ఆహ్వానిస్తారని నా స్నేహితులంతా ఫోన్ చేసి పలుకరిస్తారని ఆశిస్తున్నా.
నా ఫోన్ నెం. కావాలా!! మీరు తెలుగు – వెలుగుపుస్తకం చూడాల్సిందే.
ps: మీ రచనలు teluguvelugu@eenadu.net కు పంపొచ్చు. shriyasaswi@gmail.com ద్వారా నాతో చర్చించొచ్చు. సూచనలు మాత్రమే ఇవ్వగలను.

మీ సతీష్.

RTS Perm Link

9 responses so far

9 Responses to “ఈనాడు తెలుగు వెలుగు లో నా అక్షరం.”

 1. Sailesh Nimmagaddaon 29 Aug 2012 at 6:02 PM

  మీ అక్షర సేద్యం ఇలాగే కొనసాగాలి… మరిన్ని మంచి కవితలకు ఊపిరి పోయాలి….. శుభాకాంక్షలు సర్….

 2. Madhuon 09 Sep 2012 at 7:25 PM

  Sateesh garu nenu madhu telugu velugulo me kivita chadivaka cl chesa..mee blog ippude chustunna adbhutanga undandi..aksharalaku akshitalatho deevistunnattuga undi mee padala vaduka..thank u sir..

 3. చిన్నిon 11 Sep 2012 at 11:10 PM

  నేనక్షరాన్ని చదివాను .చాల బాగా రాసారు .

 4. కెక్యూబ్ వర్మon 02 Oct 2012 at 7:19 PM

  నేను చూసాను…తప్పక చదివి చెప్తా…మీ అక్షర సేద్యం నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ…అభినందనలతో.

 5. ramanaon 17 Oct 2012 at 2:08 PM

  eenadu ఈనాడు తెలుగు వెలుగు లో నా అక్షరం. super

 6. SKYon 17 Oct 2012 at 2:13 PM

  నావి రాతలే.. మీవి చేతలు.. మీ ఆశయాలు సిద్ధించాలని..

 7. అక్షరం” నిజంగా తెలుగు లోకానికి వెలుగు ని చూపే దారిలా, అక్షర సేద్యానికి ఆయువుపట్టుల వుంది, అక్షరం రాసిన మీకు , ప్రచురించిన రామోజీరావు మరియు వారి తెలుగు వెలుగు బృందానికి ధన్యవాదాలు

 8. SKYon 11 Jan 2013 at 6:53 PM

  ఆనందం.. భీమేష్ గారూ..

 9. ramanjineyuluon 15 Feb 2014 at 6:32 PM

  miru vrastunna telugu velugu chala chakkaga rastunnanduku maku santhosanga undi a ndukante teluguvadiga putti nedu telugunu chadavadaniki raani marendaro kavulu nityam kanipistunnaru eesamajamlo

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa