Dec 27 2012

నా కవితలకు;నాకూ.. ఆయొచ్చింది

కాగితాలు పోగేసుకున్న వేళ పాత కవితల వసంతగోల
కాగితం ఎక్కించే నాడు అక్షరాల అచ్చుహల్లుల మేళా
పని పాటల్లో అలసటకు పైరెండు తోడు
అందుకే నా కవితలకు; నాకు ఆయొచ్చింది.

జ్ఞాపకాల తంపర నన్నొదిలి ముంచింది ఇంటినే
ఉప్పుగెడ్డ అడ్డొచ్చిన వరదనీరైనది కలకంఠి కంటినే
పని పాటల్లో అలసటకు పైరెండు తోడు
అందుకే నా కవితలకు; నాకు ఆయొచ్చింది

ఊహల్లో నేస్తాలకు పేర్లుంటాయా
నీ ఆలోచనలకు ఆవేదనకూ వేరు వేర్లుంటాయా
నువ్వూ-నేను ఒకటయ్యాక మనకు వేరు పేర్లుంటాయా
నిన్ను వదిలి నేను నడిచే వేరు దార్లుంటాయా

పని పాటల్లో అలసటకు పైవన్నీ తోడు
అందుకే నా కవితలకు; నాకు ఆయొచ్చింది

ఓ తెల్లకాగితం నానుంఛి విడివడి పడవైన వేళ;
రాని వానను కోరానన్న లోకంపై కోపమొచ్చి..
ఇన్నాళ్లూ… నా కవితలకు; నాకు ఆయొచ్చింది

RTS Perm Link

2 responses so far

2 Responses to “నా కవితలకు;నాకూ.. ఆయొచ్చింది”

  1. sarmaon 29 Dec 2012 at 6:59 PM

    సతీష్ గారూ… మీ బ్లాగు బహు బాగు బాగు…
    అక్షరంపై మీ అభిమానం మరింత బాగు…
    మీ భావాల పరంపర ఇంకా ఇంకా బాగు…
    బ్లాగును తీర్చిదిద్దిన తీరు చాలా చాలా బాగు…
    మీ కలం చేయాలి నిరంతరంగా అక్షరాల సాగు…
    మేమంతా చదివి ఆనందించేలాగు…
    అందరూ మిమ్మల్ని అభినందించేలాగు…
    -ఎ.వి.ఎన్.హెచ్. ఎస్. శర్మ

  2. SKYon 29 Dec 2012 at 7:08 PM

    thanks for your heartful response.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa