Dec 04 2012

అడ్డాలబ్బాయ్!! నేనూ..


ఒకే దీపస్థంభం
వెలుగులీనుతుంది మనమధ్య
తీరం నావల బంధం మనది
నువ్వెకడున్నా.. నే తెరచాపెత్తి సాగిపోతా

తారానగరంలో అంతరిక్ష యానంలో
దిక్సూచివై నువ్వున్నప్పుడు
నీ పౌరహిత్యాన్ని వీక్షించాలని
ఉవ్విళ్ళూరుతూ నేను వస్తాను

ఎవరివో అనుమానాల చీకట్లను
చెరిపేస్తూ దారి చూపిస్తుంటావు.
యుద్ధ ప్రాతిపదికన ఆటలాడిస్తుంటావు
మాటలాడిస్తుంటావ్ పోట్లాడిస్తుంటావ్..

నా స్నేహగంధం నిను చేరినట్టు
ఓ సంకేతం నువ్ తలపరికిస్తావ్
నీ కళ్లతో నను తడిమేలోగా
పొద్దురేఖలు నాలో విచ్చుకుంటాయి

నేల మీది తారలు ఆరోజుకి మరుగవ్వగానే
రెండు చంద్రవంకలు మన పెదాలపైన వాలతాయి
అప్పుడప్పుడొచ్చే నీలిపున్నమి ఐనా
నా స్కూటరు నీతో కలిసి నేల మీదే సాగిపోతుంది
నే గాల్లో తేలిపోతాను.

(కాలేజీ నేస్తం.. శ్రీకాంత్ అడ్డాల filmcity వచ్చినప్పుడల్లా..)

RTS Perm Link

One response so far

One Response to “అడ్డాలబ్బాయ్!! నేనూ..”

  1. మద్దిరాల శ్రీనివాసులుon 08 Dec 2012 at 5:36 AM

    ఆ.వె. మంచి నేస్తమన్న మనకున్న పెద్దెస్తి
    కష్ట సుఖములందు కలిసియుండు
    అట్టి నేస్తమున్న అదృష్టమే నీది
    మీకు దీవెనిదియె మించు శతము

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa