Nov 21 2012

ఉన్నదొక్కటే ఈ క్షణం


ముందేమున్నదో గతంఎలా గడిచిందో
మనకేం ఎరుక..!
చేతుల్లో ఉన్నదొక్కటే ఈ క్షణం

దారుల్లో తెలియని కీనీడలు పొంచిఉన్నాయి
ఊహకందని చేతల్లో
మన మంతా బందీలం

ఈ క్షణమే వెలుగులు మనలో ముందూవెనుకా చీకటే
ఈ క్షణాన్ని పొదవిపట్టుకో
ఇదొక్కటే నీ సొంతం

ఆలోచించు ఓ బతుకు కోరే నేస్తమా
నీ తలపుల్ని పండించుకో

ఈ క్షణపు మిలమిలల్లో
ఈ లోకం కదులుతోంది

ఈ క్షణపు వెచ్చదనం లో
గుండె చప్పుడు దాగుంది

ఈ క్షణం తోడుంటే
ఈ లోకం నీదేగా

తరచిచూడు నేస్తమా
ఈ ఈ క్షణం కోసమే
యుగాల నిరీక్షణ

ఆలోచించు ఓ బతుకు కోరే నేస్తమా
నీ తలపుల్ని పండించుకో

ఈ క్షణపు నీడలోనే మన జీవితాలు గడవాలి
ఈ క్షణం సాగితేనే ప్రతి కథా కదులుతుంది

నిన్నెవరు చూసారు.. రేపెవరు చూస్తారు
ఏదైనా పొందాలంటే.. ఈ క్షణం నీదవ్వాలి

ఆలోచించు ఓ బతుకు కోరే నేస్తమా
నీ తలపుల్ని పండించుకో
చేతుల్లో ఉన్నదొక్కటే ఈ క్షణం

Aage Bhi Jaane Na Tu WAQT సినిమాలోని పాట విన్నాక..
మీతో పంచుకోవాలనిపించి.

RTS Perm Link

3 responses so far

3 Responses to “ఉన్నదొక్కటే ఈ క్షణం”

  1. kanistaon 21 Nov 2012 at 8:29 PM

    నిన్న చూసింది నేను రేపు చూసేది నేను
    ప్రస్తుతం చూస్తోంది నేను

    నేనే కాలాన్ని

  2. padmarpitaon 22 Nov 2012 at 2:00 AM

    నిన్న నీది కాదు…
    రేపేంటో తెలీదు…
    ఈ క్షణమే నీది:-)
    ఆనందించేయి!!!

  3. విరించిon 24 Aug 2016 at 3:52 PM

    నిన్నెవరు చూసారు.. రేపెవరు చూస్తారు
    ఏదైనా పొందాలంటే.. ఈ క్షణం నీదవ్వాలి

    వర్తమానం లో జీవిస్తేనే నిజానికి జీవించినట్టు అంటారు JK.
    Very nice poem annayyaa

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa