Nov 17 2012

ఛార్మినార్.. చెంపన..

ఈ మబ్బులు ఏ ఉత్పాతంలా కనిపిస్తున్నాయ్ చార్మినార్!
ఏ కారో మంటల్లో కాలి ఈ కసి మబ్బుల్ని కమ్మింది
కత్తులు తిట్టుకుంటున్నయ్ ఏమిటీ మరకలని
రాళ్ళగాజుల మండీల్లో పగిలేవి ఏ చేతి గాజులు?

ఎలా అంటుకుందో చెమ్కీ చుక్కై నీ చెంపన మైసమ్మ
ఆడుగుదామంటే ఇప్పుడు లేదు కుంకుమిచ్చే ఆ బామ్మ
ఈ ఊర్లో గొడవలకీ అభిమతాలకీ ఏనాడూ లంకె లేదు
గుళ్ళకీ-గోపురాలకీ ఈ లెక్కల పాఠాలు ఎక్కలేదు

ఆ పక్కనే వెలిసినట్టు రంగు పూద్దామనే ఆదుర్దా ఒకరిది
రంగు వెలిసినట్టు చూద్దామని ఎద్దేవా వేరొకరిది
రాలుపూలనగరం లో నీ బస్తీ గరం గరం
నరంతెగే నాటకాల్లో రాలేది కసుగాయలే

జెండాలో రెండు రంగులూ తెల్లదనాన్ని కుమ్ముతూ
దేవేరికి గుమ్మటాల ప్రాపు… మతంమత్తుకు మధురసాలకైపు…
ఎవరు అద్దినా అది కృతకం అమానుషుల వికృతం
తలతిక్కనాయాళ్ళకు కేవలం నువ్వో ప్లేగు బంధానివి

భాయీ భాయీ బతుకుల్లో నలిగే అలాయి-బలాయి కానుకవి

RTS Perm Link

2 responses so far

2 Responses to “ఛార్మినార్.. చెంపన..”

 1. padmarpitaon 17 Nov 2012 at 10:32 PM

  మనం ఇలా గొంతుకు చించుకుని అమానుషం చెప్పినా ఎవరికి ఎక్కుతుంది చెప్పండి

 2. మద్దిరాల శ్రీనివాసులుon 18 Nov 2012 at 4:59 AM

  సత్కవితలు రాయ సాధ్యమే మీకునూ
  స్పందనందు పదును స్పష్టముండు
  భావ వేదనిందు బహుళముగా నుండు
  చదువరులకు కళ్ళు చమ్మగిల్లు

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa