Nov 16 2012

మాటొకటి చెప్పిపోనీ

గాయాలు నాకు గేయాలై వినిపిస్తున్నప్పుడు
గేయాలు గాయాలై సలిపేస్తున్నప్పుడు
నా సాహిత్యాన్ని ఆస్వాదించనంటావా!
విషాద సంగీతమైన నిన్ను ఆలకించమంటావా!!

గాయం నేనైనప్పుడు ఎవరు గాయపడ్డట్టూ!!
కోల్పోయేది స్నేహ సౌహార్దమో కుటుంబ క్షేమమో
నా ముగింపు ప్రజావినోదమో స్వీయ విషాదమో
నాకళ్ళకు నీ కలల భయమెందుకో

ఎందుకిలా నమ్మకాల తరాజు
చీకటితో పాటు మొగ్గుతుంది!
ఎందుకో గడిచిన రోజుల జీవితం
వొంటరి అలోచనలను కుదుపుతుంది

వాలిన పొద్దు మరునాటికి వెన్ను పొడుస్తుంది
ఏ విషాదాలు మెదులుతున్నాయి తలపుల్లో
నాకెందుకు నేనంటే భయం
పలుకని నిజాలు నను బేరీజు వేస్తున్నాయా!

నేనుండనని రేపటి వెలుగులు ఈరోజే విప్పిపోనీ
నువ్వొప్పుకున్న నెప్పేగా మన అనుబంధం
ఏళ్ళు గడచినా మళ్ళీ నీతో మనసువిప్పి చెప్పుకోనీ

నిను ఎప్పటికీ ప్రేమించిన మాటొకటి ఈరోజూ చెప్పిపోనీ

RTS Perm Link

2 responses so far

2 Responses to “మాటొకటి చెప్పిపోనీ”

  1. kanistaon 16 Nov 2012 at 8:22 PM

    నిన్నమ‌నం
    మెన్న మ‌నం
    అవ‌త‌ల మొన్న మ‌నం
    ఆ అవ‌త‌ల మొన్న మ‌న‌మే
    మ‌రి ఆ అవ‌త‌ల మెన్నో మ‌నమే అనుకుంటా
    దాని ముందు రోజో
    దాని ముందు రోజా… ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది నిన్ను ప‌రిచ‌యం చేస్తాన‌ని మా వాడు చెప్పింది ఆరోజే క‌దా!
    మ‌రి ఈ రోజు మ‌నం
    మ‌రి రేపో మ‌న‌మే
    ఒక వేళ‌ నేను మ‌రి లేక‌పోతే
    హాహాహా దేవుడు వెర్రోడు కాదు!

  2. padmarpitaon 22 Nov 2012 at 2:06 AM

    ఏంటి మీరు చెప్పాలనుకున్న నిజం:-)

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa