Nov 12 2012

ఈ దీపావళి వేళ..

అమావాస్య రాతిరి
ఉపద్రవం ఘనీభవించిన చీకటి
ఎప్పటిలాగే

బాంబుల ఆర్భాటాలతో..
జువ్వల చెలగాటాలతో
ఎంతసేపని ఆపగలను పారి ఆరే వెలుగులను

డబ్బుల్ని కాల్చి వెలిగించిన చిచ్చుల్లో
పసి నవ్వులే వెలుగుతాయి
గతించిన నా బాల్యం లీలలు
నిముషాల్లోనే మిగులుతాయి.

ఎంత తమాయించుకున్నా
నాలో ఆరని శివకాశీ మంటలు
కాలిన బతుకుల నీలినీడల్లో
మందుగుండు ఆర్పిన దీపాలు

ఇవేంపట్టని నేను
చిన్నారి కంటి వెలుగుల కోసం
మనసూ చేయీ కాల్చుకుంటు..

ఏదైనా కాలితేనే పండగా!
జీవితాన్ని రాలిస్తేనే బతుకు పంట పండేనా?
దీపం వెలిగించి ఉంచితే చాలదా!!

RTS Perm Link

2 responses so far

2 Responses to “ఈ దీపావళి వేళ..”

  1. kanistaon 12 Nov 2012 at 5:58 PM

    క‌వి రేయి
    క‌విత వెలుగు
    క‌విత్వం దీపావ‌ళి

  2. మద్దిరాల శ్రీనివాసులుon 13 Nov 2012 at 4:16 AM

    బాణసంచ మాటు బాధలావేదనలు
    బాల్య స్మృతుల గూర్చి,బహుళముగను
    కవిత రూపమందు కటువైన కమ్మగా
    మిత్రమా,తెలిపితివి మిక్కుటముగ

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa