Nov 07 2012

అలాగే.. అలాగే..

నిద్రలేచాకా నేలను కాలు తాకితే ..
పచ్చనోటు తొక్కినట్టే.. అద్దెడబ్బులు.. పెరిగాయి కదా!
అడుగులేసి అద్దం చూసేలోగా ప్రతిబింబం హెచ్చరిక
పేస్టు పొదుపుగా వాడమని

స్నానం గోరువెచ్చని నీళ్ళతోనేసరి
సబ్బు కన్నా చెయ్యే ఎక్కువ అరుగుతుందీలోపల
తువ్వాలన్నా సరిగా ఆరేసుకుందాం. ఎన్ననికొంటాం!!
లోగుడ్దలూ మేజోళ్ళూ పోనీలే .. మరుగున చిరుగులు కనిపించవు
ఏమోయ్! పెళ్ళికి కొన్న రింకిల్ ఫ్రీ పేంట్లెక్కడ.. ఈ బటనుకుట్టు.

బస్సెక్కుదామా.. బండితీద్దామా!!
ఆఫీసుకేగా ఫ్రెండు ని పిలుద్దాం
కారేజీ పెట్టరాదూ.. కాంటీన్ రేట్లు పెరిగాయీ!!
అరె! నా పెన్నేదిరా.. నీదివ్వు ఈరోజుకి

సాయంత్రం వచ్చేటప్పుడు నీకేంకావాలి! పర్లేదులే తెస్తా.
నాన్నా! బాగాచదువుకో.. లేకపోతే మీ నాన్నలానే..
కాఫీ ఎందుకూ.. ఆఫీసులో తాగేస్తాగా.

ఏమోయ్! పండక్కేంకొనుక్కుంటావ్! నాన్నా!! నీకు..
ఏంకావాలి చెప్పండి.. ఎలాగైనా కొనిస్తా సరేనా
మా ఆఫీసతను పెళ్ళుంది ఈనెల.. మంచి చీరకొనుక్కో.. పిల్లాడిక్కూడా.. ఇంద క్రెడిట్ కార్డు.

హలో.. హలో..టెలీఫోన్ బిల్లేగా .. ఇప్పుడు కట్టేస్తా..
ఆ గాస్సిలిండర్ డబ్బులిలా పట్రా.. సాయంతం డ్రాచేసిస్తా.
నీకో గుడ్ న్యూస్ .. ఈనెల డి.ఎ. పెరిగింది మూడొందలు

రాత్రి లేటవుతుంది.. మీరు భోంచేసేయ్యండి.. బాసుతో పనుంది సాయంత్రం.
నీకు మల్లెపూలూ.. వాడికి హనీకేకు.. అలాగే.. అలాగే..

RTS Perm Link

2 responses so far

2 Responses to “అలాగే.. అలాగే..”

  1. kanistaon 08 Nov 2012 at 6:25 PM

    జీవితంలో సంపాద‌న వేట‌లా
    రా.రా. విమ‌ర్శలో న్యాయ‌దేవ‌త‌లా
    ప‌డ‌చు ప‌రువంలో వంపుల అల‌లా
    శిల‌ల్లో మ‌ణిలా భువిలో జ‌ల‌లా
    చ‌తుష్షష్టి క‌ళ‌ల్లో నీ క‌విత భళా భ‌ళా భ‌ళా

  2. కెక్యూబ్ వర్మon 08 Nov 2012 at 11:17 PM

    మధ్యతరగతి సర్దుకు పోయే జీవితాన్ని బాగా చెప్పారు సతీష్జీ…అభినందనలు…

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa