Nov 05 2012

నా ఏడుపేదో నేనేడుస్తా..


నా ఏడుపేదో నేనేడుస్తా.. ఎలాగోలా బతుకీడుస్తా..
పలుకరించే వారు కరువయ్యారనో..
ప్రేమ చిలకరించేవారు దూరమయ్యారనో..
కనికరించేవాడు కానరాలేదనో నా ఏడుపు నాది..

ఈ రోజు మాఆవిడ నన్ను కొట్టుండొచ్చు
మాడిన దోశే నా మొహాన కొట్టుండొచ్చు
నా బాసు నన్ను తిట్టుండొచ్చు
జాక్‍పాట్ నా పక్కోడు పట్టుండొచ్చు

ఐనా ఇన్నిసార్లు నా ముందుకొచ్చావ్.
నా ఆలోచనలన్నీ పేపర్‍లా నమిలేయడమే తప్ప
పిచ్చోడా!.. ఇది బాగుందీ.. అది బాగోలేదూ..
ఏనాడైనా అన్నావా !! నాతో రెండు నిముషాలు మించి ఉన్నావా!!

ఏడుపంటే.. ఎంతలోకువ.. అది ఫ్రీగా దొరికిన పాలకోవా!!
నీ రుమాలు తీసి తుడువ్ చూద్దాం ..
తెర దుమ్మొదులుతుందేమో గానీ
నా రంగేమైనా మారుతుందా!! నా బాధ ఏమైనా తీరుతుందా!!

మరెందుకో ఆగి మరీ చూస్తావ్ తమాషా
నువ్వుండి చూపించు ఖుషీ గా హమేశా
ఎంతరాసినా నా రాత ఇంతేనా నీ..
బదులు రాకపోతే నేనైనా ఎంతెదురు చూస్తాను నేస్తమా!!

నాకేమైనా సాయం చేస్తావా
ఎదురొచ్చి నా పాత పోస్టులు తిరగేస్తావా
ఓ! నీకంత బద్దకమైతే వీలైనప్పుడే అరో-కొరో రాస్తా.
పనుల్లోపడి నా ఏడుపేదో నే ఏడుస్తా.

RTS Perm Link

9 responses so far

9 Responses to “నా ఏడుపేదో నేనేడుస్తా..”

  1. kanistaon 05 Nov 2012 at 8:12 PM

    జీవితంనుంచి బ‌తుకులోకి ప్రయాణ‌మా!

  2. padmarpitaon 05 Nov 2012 at 9:44 PM

    ఏడుస్తా ఏడుస్తానంటూ
    మీరేడుస్తూ మమ్ము నవ్విస్తూ
    ఏడుపులో నవ్వినట్లు నటిస్తూ
    ఏవరో ఓదారుస్తారని ఎదురుచూస్తూ
    ఎందుకు చెప్పండి ఈ కసరత్తు?
    హాయిగా నవ్వండి నేస్తం:-)

  3. మద్దిరాల శ్రీనివాసులుon 06 Nov 2012 at 3:50 AM

    very funny sir.-maddirala

  4. Jaganon 06 Nov 2012 at 4:25 AM

    వస్తా, నిన్నోదార్చడానికి
    ఏడుపేదైనా కానీ
    ఓదార్చడం నాకు సర్దా
    వస్తా, వస్తా చంచల్‌గూడనుంచి.

  5. SKYon 06 Nov 2012 at 9:59 AM

    జగనన్న మనసుబాట బ్లాగులో నా బుగ్గల్ నిమురుతాండ్రు..నే నేడవక ఎట్టుంటా మల్ల!! 🙂

  6. SKYon 06 Nov 2012 at 10:04 AM

    అమ్మా!.. పద్దూ చూడే!! ఊరికే నవ్వమంటుందీ..హూ.. హుహూ.. 🙂

  7. SKYon 06 Nov 2012 at 10:06 AM

    యాత్రే మిత్రమా.. యాతన.

  8. SKYon 06 Nov 2012 at 8:04 PM

    చాల thanks అండీ.. మీరన్నంతపనీ చేస్తే.. మళ్ళీ ఏడుపేగా!!

  9. Ravi Kumar EJSon 12 Dec 2012 at 7:37 PM

    Chala Bagundhi Sir…

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa