Nov 02 2012

కవిత్వం నా కళ్ళజోడు

అదిలేకపోతే అంతా మసక మసక
నింగి-నీరు నీలాలు కలసే చోటున సౌందర్యం బదులు
నెత్తుటిచుక్కలచారలా..బీభత్సం
నా ముందున్న మనిషి నను వెంటాడే నీడై
అభద్రతా భావనలోకి నెట్టుతాడు

అలికిన అక్షరాల్లా రెటినా నంటినట్టు
నాకంటికి నలకలై నకలై
ఎంత నలిపినా అడ్డం గానే కనిపిస్తాడు
ఎదుటి వారు సాటివారు-తోటివారు లా కాక
బోటిముద్దల్లా అగుపిస్తారు

ఒక నవ్వే నవ్వితే తిరిగి అదే అందేదేమో..
నొసలు ముడుచుకుని పెదాలు సాగితే
ఈ వ్యక్తీకరణ సభామర్యాదకు ఆమడని
నా భావంతో ఇమడక
అంతదూరమూ జారిపోతారు..

వారు మరుగయ్యాకా.. నా ముందు
ఓ జారుడు పదార్థమున్నట్టూ
అది వారిని వెనక్కి తేలేని
బర్ముడా త్రికోణం లో కూరేసినట్టూ అనుకుని
అడుగు కదపకుండా
ఆ ప్రశ్నార్థకం నవ్వుతో నిలబడి ఉంటాను

ఎవరైనా ఏదైనా చూపిస్తే అది కళ్ళ డాక్టరు
పరీక్షకోసం గలిబిలి చేసిన అక్షరాలేమోనని
ప్రహేళిక ను నింపే పిల్లాడిలా లోగుట్టును
రట్టు చేద్దామని విఫలయత్నం చేస్తాను

ఎట్టా చూసినా నా కంటికి కలకే
పుసుగు పట్టిన కళ్ళతో చూసే వాడికి
లోకం అంతా కంటకింపే
మారిన మార్పుని ఆకళించుకోలేని మనిషిని కదా

అన్నీ తెలుసనుకుని ఏమీతెలియకుండా ఉండక
అప్పుడప్పుడు కవిత్వం కళ్ళజోడుతో
లోకాన్ని చూస్తాను..

ఇప్పుడంతా.. నాకు తెల్లకాగితం..
కింద మాత్రం నా సంతకం.

RTS Perm Link

6 responses so far

6 Responses to “కవిత్వం నా కళ్ళజోడు”

  1. venkatreddyon 02 Nov 2012 at 8:09 PM

    adbhutham! nijamga kavithwam lekapothe jeevithame vundadu, brathuku maathrame migile paristhithe!

  2. SKYon 02 Nov 2012 at 8:28 PM

    nijam gaa nijam.

  3. padmarpitaon 02 Nov 2012 at 9:44 PM

    ఇంతందంగా అర్థవంతంగా ఒక్కటైనా నేను ఎప్పటికైనా రాయగలనా!!!!

  4. SKYon 02 Nov 2012 at 11:13 PM

    padmaarpita garu!.. you are popular Blogger. I am a poddeyragani pillakaaki. 🙂

  5. padmarpitaon 02 Nov 2012 at 11:38 PM

    ఇలా తిట్టారన్నమాట:-)

  6. మద్దిరాల శ్రీనివాసులుon 03 Nov 2012 at 7:13 PM

    కవిత మీకునెపుడు కళ్ళజోడేగాదు
    వ్రాయగోరు కవిత వస్తువులను
    లోన గాంచగల్గు లోతైన విద్యయున్
    రమయు మీకు్నిచ్చె రమ్యముగను
    మద్దిరాల పల్కు మనసునుండియు వచ్చు
    వాస్తవమ్మగు వాక్కు వమ్ముగాదు.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa