Oct 31 2012

తెలుగువెలుగు మూడో సంచిక వివరాలు-విశేషాలు

బాలల దినోత్సవ శుభాకాంక్షలతో..

దీపావళి తెలుగిళ్ళను వెలుగిళ్ళ గా మార్చాలని ఆకాంక్షిస్తూ రామోజీ ఎడిటోరియల్: ఇంటింటా తెలుగు దీపం
ఇందులో నాకు గుచ్చుకున్న మాట” తెలుగులో మాట్లాడుతుంటే అమ్మ, నాన్న, అక్క, అన్న, అమ్మమ్మ, తాతయ్య, ఇరుగుపొరుగు, మనసమాజం, సంస్కృతి గుర్తుంటాయి. లేకపోతే “మమ్మీ’లే మిగులుతాయి.
కథ: కొక్కొరో…క్కో కార్తీక్‍రాం అదిలాబాద్ యాసలో బాగ రాసిండు.
సిహెచ్ వెంకటేశ్వర్లు వేమన పద్య విశదీకరణ కొత్త శీర్షిక: నాటి మేటి తెలుగు పద్యం,ఏనాటికైనా లోకరీతి ఇదేకదా..అనేటట్టు.
పుట్టినరోజు శుభాకాంక్షల మేఘసందేశం అచ్చ తెలుగు సందేశాల వేదిక గా.. ఆకాంక్షల పూదోట గా ఈ పుట
ఇదే పేజీలో ఎత్తుకోండి హత్తుకుపోతారు.. అని వేసిన కవిత సందర్బోచితంగా ఉంది.
తెలుగు కేసరి దాసరి పేర ఆయన సినీ నేపధ్యం లో తెలుగు జీవితపు సంభాషణలు
భావ దీపావళి పుట్టుపూర్వోత్తరాలనుంచి సాహిత్యంలో భాగమెలా అయ్యిందనేది చెప్పేప్రయత్నం అనుకుంటా..శ్రీధర్ గారి బొమ్మ సత్యాకృష్ణుల గరుడవిహారం అదిరింది.. అందం గా అమరింది.
కథ: అమ్మ రాసింది సన్నిహిత్.. ఏం బొమ్మేశావ్ కవితమ్మా! భలే.
చిన్న పిల్లలు నడిపే కొన్ని పత్రికల వివరాలతో “చిట్టిచేతులు-మంచిరాతలు”
తెలుగు పై గొల్లపూడి మారుతీరావు మాట ” తల్లిదండ్రులూ.. తవసుప్రభాతం!
స్పూర్తి నందించే అపూర్వ విజయ గాధగా ” యూధులు భాషా యోధులు శైలేష్ నిమ్మగడ్డ అందించిన ఇజ్రాయిల్ విశేషాలు .. మనరాష్రంలో ఉన్న యూదు కుటుంబాల వివరాలూ.. జీవనం గుంటూరు ఈనాడు రిపోర్టర్ రమేష్ మాటల్లో
sp బాల సుబ్రహ్మణ్యం భాషాప్రేమ ” అమ్మపలుకు చల్లన”.
మన తెలుగు వాడు పైడిమర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ నే దేశం యావత్తూ జాతీయ ప్రతిజ్ఞ గా శిరసాధరిస్తుందని, స్మరిస్తుందని ఇప్పటి వరకూ తెలియక పోవడం .. ఓ గర్వకారణపు తోరణం కావాలని కట్టుకోనట్తేకదా! ప్రతిజ్ఞ అందించిన ప్రజ్ఞ చదివే బాధ్యత మనందరిదీ.. అందించింది వేణుప్రసాద్ ఈనాడు, విశాఖ
పద్యాలను వేల మంది స్కూలు పిల్లలతో వల్లెవేయిస్తున్న తెన్నేరు కు చెందిన దేవినేని జయశ్రీ మధుసూదనరావు దంపతుల మాటల్లో పద్య పఠన ప్రభావం వ్యక్తిత్వ నిర్మాణం లో అన్న కోణం ఎందరికో కనువిప్పు.
సాహితీవనం లో బాల ముత్యాలు పేర ముత్యాలసరాలు రాస్తున్న పిల్లలు నిజంగా గురజాడ అడుగుజాడలు.
కథ దేవుని బిడ్లు సడ్లపల్లె చిదంబర రెడ్డి మడకశిర యాస గోస.
మనకు స్వరం సుస్వరం పేర మన భాషోద్యన సమాఖ్య తొలి అధ్యక్షుడు సి. ధర్మారావు సూచనలు.
డా. సి. మృణాళిని గారు నీ యెంకమ్మా.. ఇదేం భాష! ద్వారా మనం మరుస్తున్న భాషా సంస్కారం గుర్తుచేసే ప్రయత్నం
కాలువ మల్లయ్య తెలుగు వనం తెలంగాణం లో ఈ ప్రాంత వాసుల తెలుగు వైభవాన్ని చవిచూపించారు.
అక్షరాలూ అప్సరసలే అంటూ షేక్ బడే సాహెబ్ తెలుగు లిపి లో మార్పులు చేర్పులూ(!) సూచిస్తున్నారు.
ఇక పుస్తకం మొత్తం లో నేను మైమరిపించే పేజీ:57 కొప్పర్తి కవిత్వం : ప్రాచీన స్మృతుల్లోంచి

జోలెపాలం మంగమ్మ గారు బ్రౌన్ దొర గురించి తెలుగుకు వెలుగు తెచ్చిన ఆంగ్లేయుడు
శరత్బాబు కరుణశ్రీ అత్మీయ సాహిత్య పరిచయం: టీపాయికి పువ్వందం-పాపాయికి నవ్వందం
ఆర్టిస్ట్ జావెద్ యానిమేషన్ కబుర్లు కదిలేబొమ్మా.. కబుర్లుచెప్పమ్మా…!
పాటల రసరాజు బాధ: రక్కెసపొదల్లో రసభాష
విజయరాణి కథ : స్పందన
పద్మశ్రీ శోభానాయుడు, పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్, కాళీపట్నం రామారావు భాషాంతరంగాలు
ఆచార్య రవ్వా శ్రీహరి వాడుకలో ఒప్పులూ, వ్యాకరణం లో తప్పులూ
ఎస్.ఆర్ భల్లం ఈ గాలీ.. ఈ నేల..!
డా. పులిచెర్ల సాంబశివరావు కథ కూర్చున్న కొమ్మ.

విశ్రాంత ఉపాధ్యాయులు ఎన్నవెళ్ళి రాజమౌళి వుద్యోగ విరమణ తరువాత స్కూళ్ళల్లో కథలు పాటలు, పద్యాలు ద్వారా బాషను నీతిని నేర్పే పద్దతి చూపారు : బందీలవుతున్న భావివెలుగులు శీర్షికన.
పొత్తపు గుడి (లైబ్రరీ) విశేషాలు సన్నిధానం నరసింహశర్మ మాటల్లో
పావులూరి మల్లన్న పద్య గణితం గురించి.. ఈనాడు పి. శంకర్రావు రాసిన ” ఒకడు లెక్కల కవి.
కె. సురేష్ మంచిపుస్తకం పబ్లికేషన్స్ ట్రస్టీ మాటల్లో ఆబాలగోపాల సాహిత్యం
వింజమూరి అచ్యుతరామయ్య కవిత: మంత్రపుష్పం
మధురాంతకం రాజారాం కథ: కమ్మతెమ్మెర
పదపంచాయితీ
పుస్తక సమీక్ష , తులాభారం తెలుగులో చదివితే నేరమా..! ప్రకాశం జిల్లాలో పరభాషా లో చదువు బుర్రకెక్కక ఉసురు తీసుకున్న కథనం. . ఇది మన తప్పులకి ముగింపు కావాలని.. ఈ సంచిక ఉద్దేశమేమో..
ఈ సంచిక ముఖ చిత్రం చాల నిండుగా ఉంది కదూ.. మన పండుగ లా..
ఇది నా ఘోషేనా.. కొని చదువుతున్నారా!!

RTS Perm Link

4 responses so far

4 Responses to “తెలుగువెలుగు మూడో సంచిక వివరాలు-విశేషాలు”

 1. kanistaon 31 Oct 2012 at 6:10 PM

  కాదు మీది న‌ర‌ఘోష‌
  మీది క‌వ్వించే క‌వితాఘోష‌
  సంద‌ర్భస‌హిత ప్రవాహం మీభాష‌

 2. V.V.Satyanarayana Settyon 01 Nov 2012 at 6:17 PM

  IF THERE IS E-Mail PROVISION, WE CAN SEND THIS REVIEW TO MANY OTHERS.
  —————-V.V.Satyanarayana Setty

 3. Venkat Ramaiahon 14 Nov 2012 at 12:38 AM

  ఈ నెల తెలుగు వెలుగు పత్రికలో ఇంచుమించుగా అంతరించిపోయిన స్థితిలో ఉన్న హెబ్రూ
  భాషాభివృద్ధికోసం ప్రపంచ వ్యాప్తంగా చెదిరిపోయి వివిధ దేశాలకు వలస వెళ్ళిపోయిన
  యూదు జాతీయులు చేసిన కృషి గురించి ఒక వ్యాసం ప్రచురించబడింది. అందులో యెహుదా
  అనే ఆయన చేసిన కృషి గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు. అప్పటికి హెబ్రూ
  భాష పరిస్థితి, ఆభాషకున్నపరిమితులూ, భాషలో లేని పదాలను సమకూర్చుకున్న వైనం,
  ఉన్న పదాలను విస్తరించుకున్న పద్ధతి చాలా చక్కగా వివరించారు. ప్రపంచమంతా
  చెదిరిపోయిన యూదు జాతీయులంతా ఒక చోటికి చేరుకోవడంలో వారందరిలోనూ ఉన్న భాషపై
  మమకారం ఎంత ప్రభావాన్ని చూపిందో ఆ వ్యాసం చదివితే తెలుస్తుంది.
  తెలుగువారం పదికోట్ల మంది ఉండీ, అందరూ ఒకే చోట ఉండీ కూడా మన భాషను
  పరిరక్షించుకోలేని మనం వాళ్ళముందు ఎంత? వారిలో ఉన్న ఆకామ్క్షలో పదో వంతు ఉన్నా
  మనం మన భాషను మరింత పరిపుష్టంగా తీర్చి దిద్దుకోవచ్చును. అదే పత్రికలో
  ప్రఖ్యాత గాయకుడు శ్రీ బాలసుబ్రమణ్యం గారు చెప్పినట్లు భవిషత్తులో ఏదో
  తవ్వకాల్లో దొరికిన రాతి పలకలమీద కనిపించిన అక్షరాలను చూసి “ఇవి తెలుగు
  అక్షరాలు” అను భావితరాల వారి పిల్లలకు పరిచయం చేయాల్సి వస్తుంది.

  అదే పత్రికలో ఒక విశ్రాంత పోస్టల్ ఉద్యోగి (పేరు భాషా గారు అనుకుంటాను) భాష
  అంతరించిపోతున్న తీరు వివరిస్తూ ఉపయోగంలేని అక్షరాలూ కొన్నింటిని గురించి
  చెబుతూ అవసరంలేని అక్షరాలను తొలగించడం మంచిది అని సెలవిచ్చారు. ఇప్పటికే కొన
  ఊపిరితో కొట్టుకుంటున్నదానికి వాతలు పెట్టే ఆలోచన అది. ఇతర భాషలతో పోల్చుకుని
  మనకి అవసరం లేదని అలా తొలగించేసుకుంటూ పొతే చివరికి మన భాష మూలాలు కూడా
  తొలగిపోయే ప్రమాదం ఉంది. వారి సలహా ఎంతవరకూ సబబో వారికే తెలియాలి.

 4. Sailesh Nimmagaddaon 15 Nov 2012 at 2:01 PM

  వెంకట రామయ్య గారు… పత్రికలోని వ్యాసాలపై మీ విశ్లేషణకు కృతజ్ఞతలు. భాషాభివృద్ధి కోణంలో యూదుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa