Oct 29 2012

మనసు ’కీ’ whole

చూస్తాం.. లోకం.. ఆ క్షణమంతా మనదే..
లోకమా క్షణమా ఏమో.

నచ్చిన రంగులుంటాయ్.. మనల్ని కావాలంటాయ్
రంగవ్వాలా! నచ్చాలా!! ఏమో.

వెచ్చని ఆలోచనలుంటాయ్ లోనికి రమ్మంటాయ్
ఆలోచనలనా! వెచ్చదనాన్నా! ఏమో.

చిక్కని జవాబులుంటాయ్ కనుక్కోమంటాయ్
కనుక్కోవాలా! అడగాలా! ఏమో.

విప్పని ముడులుంటాయ్ చేయి చేసుకోమంటాయ్
ముడులనా .. వాటి జడలనా ఏమో.

కొన్ని కోరికలుంటాయ్

చూడాలని.. వినాలని .. ఆఘ్రాణించాలని.. స్పృశించాలని
రుచిచూడాలని.. ప్రేమించాలని ..
కోరాలా!! కోరపీకాలా ! ఏమో.

పుట్టినప్పుడు ప్రతీదీ అందంగానే ఉంటుంది.. పసిపాపలా.
ఆ క్షణం లో అదే లోకం..
లోకం లోకి అందమైన దాన్ని వదిలేయ్.. ఇంకేంకావాలి!

నీకు నచ్చినట్టు రంగరించు..
ఇచ్చేయ్..
నీ రంగులతో లోకం నింపు ఇంకేంకావాలి!

లోనికి వచ్చిన ఆలోచనల వెచ్చదనాన్ని పంచు
జవాబు అడుగు..
దానికదే కనుక్కుంటుంది ప్రశ్నని

జడపట్టుకో
ముడి పట్టుబడిపోతుంది
తాడో-పేడో తేలిపోతుంది

కోరికలూ.. మీ మూలాలు వేరు
లోనికి చూస్తావా.. బయటదారులు కనిపిస్తాయి.
మనసుకి మార్గాలుంటాయి.. గొళ్ళాలుంటాయ్
తెరిస్తే బయటవాటిని లోపలే చూపిస్తాయి
బయటవెతికావో నిను లోపలపెట్టి చీకటి పాల్చేస్తాయి.

చీకటిని నీ వివేకంతో కాల్చేయ్..
మనసంతా నీ ప్రపంచమౌతుంది..
ఈ ప్రపంచానికే నీమీద మనసౌతుంది.
ఇంకేంకావాలి!!!!!!!!

(తనను వెతకొద్దంటూ..అందరికీ దొరికిపోతున్న .. ఓ బ్లాగర్ కి…ప్రేమతో. )

RTS Perm Link

4 responses so far

4 Responses to “మనసు ’కీ’ whole”

  1. padmarpitaon 30 Oct 2012 at 12:58 AM

    ప్రశ్నించుకుని సమాధాన పరుచుకుని, మీ మనస్సుని అదుపులో కూడా మీరే పెట్టుకుంటే ఏమంటాం చెప్పండి……బహుబాగు అనడంతప్ప:-)

  2. vijayalakshmion 30 Oct 2012 at 4:40 PM

    puttinappudu pratidi andanga vuntundi mee kavithalaga………awesome sir.

  3. మద్దిరాల శ్రీనివాసులుon 03 Nov 2012 at 5:45 AM

    కనబడుచుండె శీర్షికన కమ్మని మీ కవితందలి హావభావముల్
    మనసును గూర్చి చక్కగను మల్చిన తీరది యధ్బుతంబులే
    కనగను మానసంబు గను కమ్మని దృశ్యపు ఛాయలన్నిటిన్
    కనులకు గట్టినట్లు మనకందగ జేసె సతీషు కలంబు గొప్పగన్
    మద్దిరాల శ్రీనివాసులు, 9010619066

  4. SKYon 03 Nov 2012 at 10:11 AM

    శ్రీనివాసులు గారూ!.. పర్వతాలు ఎక్కించారు.. పరవళ్ళు తొక్కిస్తున్నారు నన్ను. మీ ప్ర్రోత్సాహం నా బాధ్యతను మరింత పెంచుతుంది.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa