Oct 27 2012

ఇదేం న్యాయం దేవుడా?

 

రాసిందే రాయడానికి తలదించట్లేదు నేను
ఎప్పటి లానే.. తలవంచే రాస్తున్నా..
చేసిన తప్పు చేయడం నీకు తప్పనపుడు
రాసిన రాతే రాయడం నా తప్పెలా అవుతుంది!
అడిగిన ప్రశ్నే అడగడం నాకు తప్పదులా ఉంది.

ఆరోజు వైష్ణవి.. ఈరోజు సాన్వి.. మధ్యలో తెలియనివి ఎన్ని!!
పేర్లేమైతేనేం తలతిక్క లెక్కలు నీవి
మొన్నేగా ఏదోకారణం చెప్పమంటే..
శివశంకర్ ను తీసుకుపోయావు
నా ప్రశ్నకు జవాబు చెప్పలేక తప్పుకు పోయావు

ఒక్క బొమ్మ లా ఇంకోటి చెయ్యడం వచ్చా నీకు
ఎవరిని చూసి మైమరచాలి ఈ వెతల్ని! కడుపు కోతల్ని!!
సైదుబాబు పాపం పండాలంటే 25 ఏళ్ళు నిండాలా!!
సాన్వి పాప 10 నెలలకే నీ ఇంట కొలువుండాలా?
మా కళ్ళన్నీ.. నీళ్ళతో నిండాలా!! ఇదేం న్యాయం దేవుడా?

నీ బండబడ.. నీకు తెలియదు.. ఇది మాకో అంటురోగం
చరిత్ర కాల్చిన మచ్చల్లో పశుత్వం పాఠాలు నేరుస్తుంది.
వెధవను మించిన వెధవల బడి మా లోకం
క్రియేటివ్ గా క్రీమేషన్ చేసే పోటీల్లో ఎవడికి వాడే సాటి
కిడ్నాపర్ ఎవడైతేనేం చంపడం తోనే ముగిసేది స్టోరీ

Marzipan పిల్లల బొమ్మల్ని దాచుకునే వాళ్ళనుంచి
కేకుల్లా చేసుకుని కొరుక్కు మింగే వాళ్ళ వరకూ కన్నతండ్రివి.
ఎందరి ఇష్టాలని నువ్వు చూస్తావ్.. ఎవ్వరి మాట కాదంటావ్!!

పక్కోడూ బాగుండాలనుకున్నామా. .
రేపటి రోజు వార్తలకు ఈ రోజే రక్తపు రంగుపూస్తావ్
పసిమొగ్గల్ని తుంచేసి..తల్లితీగకు కడుపు కోస్తావ్
తలతిక్క లెక్కలు నీవి.ఇదేం న్యాయం దేవుడా?
ఎందుకు మమ్మల్ని పరీక్షిస్తావ్?

[శివశంకర్ మా ఆఫీసు కురాడి పిల్లాడు.. మానసికంగా ఎదుగుదల లేకుండానే.. నెలల వయసులో తల నిలపలేని ఇబ్బంది పడుతుంటే..ఏమీ చేయలేక కలత మనసు తో రాసుకున్నా24.8.12 న : ఏదో కారణం..  అబ్బాయి పోయి వారమైనా కాలేదు..]

RTS Perm Link

6 responses so far

6 Responses to “ఇదేం న్యాయం దేవుడా?”

 1. saarvaboumaon 27 Oct 2012 at 11:07 PM

  ఎవరయ్యా చెప్పింది కాళ్లు చేతులు నరికే కటిన శిక్షలు వద్దని,మనుషులలో రాఖ్షసులు ఉన్నంత కాలం ఈ శిక్షలు ఉండి తీరాలి.బ్రతికున్న రాఖ్షసులకు భయం కలిగేంతగా అవి ఉండాలి.

 2. Madhuon 27 Oct 2012 at 11:49 PM

  Baruvenkkina hrudayalu, alupekkina nayanalu..

 3. padmarpitaon 28 Oct 2012 at 2:49 AM

  బరువెక్కిన హృదయంతో
  ఏం చేయలేని నిస్సహాయతతో….

 4. SKYon 28 Oct 2012 at 6:50 AM

  what can we do!…
  ayyO anaDaM tappa!

 5. మద్దిరాల శ్రీనివాసులుon 29 Oct 2012 at 5:12 AM

  “సాన్వి” గురించిన వేదన ఇంతమంది గుండెల్ని పిండేస్తుంటే, ఆ వెధవలకు కనీసం గుండైనా వుందా? అనిపిస్తుంది. భరించలేని ఆ వేదన భారాన్ని మీరు కవితాశ్రుల రూపంలో కొంతైనాతగ్గించుకున్నారు.సతీష్ గారూ. …. మద్దిరాల శ్రీనివాసులు, త్రిపురాంతకం

 6. vijayalakshmion 30 Oct 2012 at 4:46 PM

  Mee sahrudayaniki na Joharlu Satishgaru.Hats off.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa