Oct 20 2012

కొండమల్లీ! నవ్వు.

మేం మరచిన మంత్రమేదో నీకు తెలిసినట్టుంది
రబ్బరు నవ్వుల్ని మోసే రంగుల లోకంలోకి
చలువ గదుల్లో పూయని వేసవి మల్లెల్ని
ఎలా తెచ్చావు నా ముందుకు ఓ కొండమల్లీ

నీ చెక్కిలి చేరిన మునివేళ్ళ గిలిగింతల్లో
ఏంచూస్తున్నావో! మురిసి చిన్నోడి కేరింతలలో!!
ఏం చదివితే ఏం నేర్చితే తిరిగి వచ్చేది ఈ తేజం!
తప్పిపోయిన మా పసి తనం నీ చెంతన వింతగా!!

గంజి నీళ్ళ బలమో.. తాటి ముంజల గుంజు వలనో..
బుట్ట తేనె తీపిదనమా! ఇప్పపూల గొప్పదనమా
మట్టి కుండల వన్నమా! కంద దుంపల బలమా
తప్పిపోయిన మా పసి తనం నీ చెంతన వింతగా!!

నిన్ను వెతికితేలేకా “సొచ్చం గా” నవ్వలేక
ఇచ్చిపుచ్చుకోవడానికి ఇంకేం లేక
పంచుకుంటున్నాం ఒకరికొకరం

రెండు నిలువుచుక్కల పక్క ఓ చంద్రవంక 🙂

RTS Perm Link

2 responses so far

2 Responses to “కొండమల్లీ! నవ్వు.”

  1. parimalamon 20 Oct 2012 at 9:08 PM

    అద్భుతంగా ఉందండీ….ముఖ్యంగా మొదటిపేరా మరియు చివరిపంక్తి మరీనూ.

  2. appajion 31 Oct 2012 at 10:38 PM

    🙂

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa