Oct 18 2012

బేగెల్లి రావె ఓ సరకారుబస్సూ

సక్కనోడు ఎదురుసూసేయేలైంది ఓ సరుకారు బస్సూ
సరుకెట్టాను సేయి మారనీకుందీ..ఓ సరుకారు బస్సూ
సలిమల్లిన ఏలలో ఓ సరకారుబస్సూ
ఈ ఎదురుసూపు నాకేల ఓ సరకారుబస్సూ

అమ్మబోయినకాడ అడవె మేలైనాది
కుట్టు నెప్పుల ఏల్లు పుట్టు సలపరమౌతేను
మావసరసమె నాకు మెత్తననిపించేను

బెట్టు సూపినా రేతిరి పనిబాయలేక
మాపటికి వస్తడో మావ బయలెల్లినాడో
సుక్కకై పోయాడో.. సుక్కెనక పోతిడో

సూడరాకాపాయె..ఈయాల్న బస్తి పాల్పడితినే
ఉసూరంటు వచ్చినా మాయదారూరూ
బేగెల్లి రావె ఓ సరకారుబస్సూ

ఏడున్నడో నా మావ ఓ సరకారుబస్సూ
ఈయాల మావతో మరులుగొనకాపోతె
మొయ్యాల మాపైన కుట్టునెప్పుల సలుపు
ఏడున్నడో నా మావ ఓ సరకారుబస్సూ

బేగెల్లి రావె ఓ సరకారుబస్సూ
మావపై మల్లి మనసైనాది సరకారుబస్సూ
బేగెల్లి రావె ఓ సరకారుబస్సూ

RTS Perm Link

2 responses so far

2 Responses to “బేగెల్లి రావె ఓ సరకారుబస్సూ”

  1. padmarpitaon 18 Oct 2012 at 8:16 PM

    ఇలా కూడా రాసి మెప్పించగలరన్నమాట:-) బాగు బాగు!

  2. anilon 23 Oct 2012 at 12:15 PM

    ఒక సున్నిత సమస్యని ఉదహరించడం అభినందనీయం బాగుంది

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa