Oct 16 2012

బకెట్ లిస్ట్ ఐటమ్ 4

ఒట్టేశానో లేదో .. కట్టినోడిమీద
ఎప్పుడు పగిలేనో నా ఉట్టి..
పువ్వులా రాలే కోరిక జాబితాలో మొదటిది.–
పసిపూవులు వసిమాలే వేళ వెక్కిరించేది ఈ ఇఛ్ఛే

తడియారని తపనలతో తనువును తెల్లారదీయ
వగచిన వేళ — నా కలహప్రియ మూతివిరుపు చూసాకా
ఎల్లెల్లెల్లమని అనిపించుకోలేక ఒద్దనుకున్నా రెండవది.. చెరిపేసా గీతలాగ
నోరూరే మిఠాయి సీసా పై మూసేసిన మూతలాగ

పిల్లల పై చదువు బరువు ర్యాంకులకై వగుర్పులు
చూడలేక దిద్దితీర్చు తలపోటు– మూడు నాకెందుకని అనుకున్నా
వదిలేశా తాకట్టుకు లక్ష్మిని సరస్వతి తలకట్టుకై వడ్డీ లెక్కన
నాకేమి తెలుసో (తెలియదో) తెలిస్తే పిల్లల ముందెంత అలుసు మరి

పురుషలక్షణం ఇప్పుడు పురుషులదే కానప్పుడు
వ్యాపారానికి రొక్కం నా వద్ద లేనప్పుడు
రెంటికి చెడ్డరేవడి బతుకంతా ఇంతే అనుకున్నప్పుడు
రామకోటో.. సొంతపైత్యమో రాద్దామని —

మాటవినని మనసుకోసం నెరవేర్చిన ఒక్కపని
పోయేలోగా అయ్యేవి ఎన్నున్నా లేకున్నా
కన్న కలలకు రంగులద్దుదామని నెరవేర్చుకున్నా
బకెట్ లిస్ట్ లో ఒక పని.. వీలున్నప్పుడల్లా రాద్దామని..

ఓ బ్లాగు ను నాకోసం సృష్టించుకున్నా.
ఎవరు చదివినా లేకున్నా .. కామెంటని నేస్తాలెందరున్నా
నన్ను నన్ను గా గుర్తించే ఏ ఒక్కరికోసమో రాస్తున్నా.

RTS Perm Link

6 responses so far

6 Responses to “బకెట్ లిస్ట్ ఐటమ్ 4”

  1. padmarpitaon 17 Oct 2012 at 1:17 AM

    అంటే…ఆ ఒక్కరిలో మేము లేమనేగా:-(
    ఏమనుకున్నా..నచ్చితే కమేంట్ పెడతాను:-)
    తిట్టినా కోపం వచ్చినా మీకు!

  2. SKYon 17 Oct 2012 at 10:08 AM

    ఆగాగు కలువకానుకా! హహహహ హా
    ఏమంటివి ఏమంటివీ !! కవిత నెపమున మీకిందు నిలువ మా మనసున విలువ లేదందువ? హ ఎంతమాట ఎంతమా.ట..
    ఇది ఆత్మ పరీక్ష కాని మిత్ర పరీక్ష కాదే , కాదు కాకూడదు, ఇది వ్యాఖ్యా మూల్య పరీక్ష ఏ యందువ,కవనవనమున మన స్పర్థ ఎట్టిది? అతి ఆహ్లాదకరమగు మన బ్లాగ్లోకపు స్నేహమెట్టిది!! నీ కామెంటు తో నా నెత్తిన మొట్టితివికదా! హహహ ఆ ఒక్కరూ నీవే కావేల!! నాతో వేళాకోలమేల ఓ బేలబాలా!!
    మరి ఐటమ్ 5 ఏమిటో అడుగవేల!!

  3. padmarpitaon 18 Oct 2012 at 8:13 PM

    అడిగితే అందరూ చెప్తారు అడగకుండా చెప్పేవారే అసలైన నేస్తాలు:-) ఆలస్యమేల చెప్పండి ఆ అయిదో ఐటం ముచ్చట:-)

  4. SKYon 18 Oct 2012 at 8:30 PM

    mee kavita.. naa kavitaaaavyakhyaanaM la kalagalupu… oka sanchika avvalani….. saradaa…

  5. padmarpitaon 19 Oct 2012 at 11:13 PM

    🙂

  6. vijayalakshmion 30 Oct 2012 at 4:55 PM

    Nijanga nenu velugu book chadavadam na luckga anukuntunnanu mi lanti vari kavithalu chadive adrustam kaligindi.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa