Oct 12 2012

రాయడం అసంకల్పితం

తప్పనిసరి స్పందనలు కొన్నుంటాయ్

మెలకువ వస్తే కళ్ళు తెరచుకున్నట్టు
మెళకువ నేర్చితే నైపుణ్యం పెరిగినట్టు
చల్లదనానికి ఒళ్ళు ఝల్లుమన్నట్టు
మంచితనానికి రూపంలేనట్టూ..

చూసినేర్వాల్సినవి కొన్నుంటాయ్

తరగతిగదిలో బోర్డుమీద అక్షరాలు
వలపులమదిలో దాగలేని భావాలు
అవసరాలను తీర్చే అనుకరణలు
వాటిని నేర్చే కారణాలు వాటి కారకాలు

ఎందుకు రాస్తున్నానంటే ఏంచెప్పను!!

తల్లి కడుపున పడడం అక్కడే ఉండడానికా!
మనం పుట్టడం ఏడుపు వినిపించడానికేనా!
మన చూపులో అనుభూతులో వాటి లోతులో
అనుగుకోడిపెట్టలా పొదిగపెట్టుకోవడానికా!

ఓ మాటైనా ఉండొద్దా! మనమధ్య
జట్టుకట్టుకోవడానికైనా…

RTS Perm Link

2 responses so far

2 Responses to “రాయడం అసంకల్పితం”

  1. padmarpitaon 12 Oct 2012 at 7:48 PM

    మరి అసంకల్పిత ప్రతీకారచర్యల మాటేవిటో మహానుభావా:-)

  2. SKYon 12 Oct 2012 at 8:11 PM

    mee samaadhaanaaley..
    🙂

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa