Oct 11 2012

నాకే గనక చేతనైతే..

మీ కోసం.

పసిపిల్లల పిప్పర్మెంట్ నౌతా
తీయతీయగ కరిగిపోతా

స్కూలు పిల్లల బ్యాగు నౌతా
పుస్తకాలను మోసిపెడతా

కన్నెపిల్లల కోరికౌతా
కన్నవారి కానుకౌతా

మగపిల్లల మీసమౌతా
తెలుగువాని రోషమౌతా

యుద్ధవీరుని గన్నునౌతా
భరతమాతవెన్నునౌతా

మరుమల్లెల దండనౌతా
దేశభక్తుని దండమౌతా

ఆప్తమిత్రుని దరహాసమౌతా
అనాధకు విలాసమౌతా

ఆర్తురాలికి అన్ననౌతా
నిరుపేదకు అన్నమౌతా

శ్రమజీవికి పాన్పునౌతా
నిండుచూలాలి కాన్పునౌతా

ముసలిఅవ్వకు చేయూతనౌతా
అవసరమైతే కొడుకు నౌతా.

నాకే గనక చేతనైతే..
ఓ సుబ్బారావు నా రూమ్ మేట్ (MBA కాకినాడ ఐడియల్ కాలేజీ 1996-98లో) సరదాగా ఈ పదగుత్తిని నా నెత్తినరుద్ది ఆశువుగా 10 లైన్లు చెప్పమన్నాడు. చెప్పానో, రాశానో గుర్తులేదు కానీ 24th November 96 రోజు న రాసినట్టు.. నా పాత పుస్తకాల లో దొరికింది. పాతదేదైనా అపురూపమేకదా!!

RTS Perm Link

6 responses so far

6 Responses to “నాకే గనక చేతనైతే..”

 1. padmarpitaon 16 Oct 2012 at 12:47 AM

  మీ అపూర్వమైన దీన్ని లేటుగా చూసాను…భలే నచ్చేసిందిగా

 2. SKYon 16 Oct 2012 at 8:14 AM

  Thank you friend. Adi poorvamainadE.. mee spaMdanatO.. paripoorNamaiMdi.

 3. kaasirajuon 30 Oct 2012 at 3:28 PM

  మగపిల్లల మీసమౌతా
  తెలుగువాని రోషమౌతా

 4. vijayalakshmion 30 Oct 2012 at 5:00 PM

  Marvellous sir,really good.

 5. SKYon 30 Oct 2012 at 5:05 PM

  ఊ.. తిప్పు కాశీ.. మీసం. 🙂

 6. SKYon 30 Oct 2012 at 5:08 PM

  మీ స్పందన వెల్లువలో తడిసి ముద్దౌతున్నాను. . సంతోషం విజయలక్ష్మి గారూ.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa