Oct 03 2012

ఏదో కాంతి నాలో..

ఏదో కాంతి నాలో ఊరెల్తున్నందుకా!!
సహచరి ఎందుకో అంత ఆనందమని ఎద్దేవా చేసేటంత
ఏ బంధం మిగిలివుంది అక్కడ అమ్మతప్ప
గతం వీధి దీపాల్లా అనుభూతుల నీడను కుదుపుతోంది ఆడుగుల్లో

ఊరుచేరిన నడకల్లో చూపు తాకి తేరువ జారిపోతున్నట్టు
పారజూసే పరిచయాలు పలుకరించాలా వద్దా అన్నట్టు
ఈల పాట కై చుట్టిన పెదాలు ప్రక్కలు పట్టించుకోనట్టు
చేరే అడుగుల్లో వయసుని దూరం తగ్గిస్తున్నట్టు

వీధి మలుపు తలపులతో మెలితిరుగుతున్నట్టు
గుమ్మం ఎదురుచూపులో అమ్మకు నా బాల్యాన్ని పంచుతున్నట్టు
ఏ పువ్వైనా తోటలో ఇంత వికసిస్తుందా
మింటివెలుగు నవ్వులతో ఆశ్శీస్సులు కురిపిస్తున్నట్టు.
నా కంటిముందు అదే కాంతి నను మళ్ళీ కన్నట్టు కనుగున్నట్టూ.

RTS Perm Link

8 responses so far

8 Responses to “ఏదో కాంతి నాలో..”

  1. SKYon 03 Oct 2012 at 8:05 PM

    going home tpgudem tomorrow.

  2. BVV Prasadon 03 Oct 2012 at 8:21 PM

    ఆహ్లాదంగా, ఆర్ద్రంగా ఉంది మీ కవిత..

  3. padmarpitaon 03 Oct 2012 at 11:46 PM

    ఇంతబాగా ఆర్ద్రతగా ఎలారాయగలుగుతారో!!!

  4. lakshmion 05 Oct 2012 at 8:41 PM

    నేను ఇంటికెళ్లే రోజు గుర్తొచ్చింది టీచర్ మీకవిత చదివాక.

  5. murtyon 07 Oct 2012 at 11:42 AM

    neneppudu intikeltunna ika ee kavitha gurtostune vuntundhi. antha manchi feel vundhi. meerentha busyga vunna maa kosam ilantivi marikonni rastarani aasistu…

  6. Madhuon 10 Oct 2012 at 8:58 PM

    Sateesh garu idi chadivaka marala maa vuru velli aa gnapakalanu dosili tho erukovalani undi..adbhutamandi..

  7. sandhyaon 04 Nov 2015 at 12:12 PM

    How Touchy poem It was..It Gently touched Everyone’s heart n make them recollect abt their sweet memories..Kudos Satish

  8. YasaswiSateeshon 04 Nov 2015 at 1:28 PM

    వదినా! హ్యాపీ.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa