Sep 26 2012

పిచ్చుకా! ఓ పిచ్చుకా!!

ఎన్ని కథలు విన్నాం అన్నం ముద్దల మధ్య
వసారాలో వరికంకిలనెక్కి
ఎన్ని పెరుగన్నం ముద్దలు తినిపించావ్
కుండ మూతలో పోసిన నీళ్లు నువ్ తాగినప్పుడల్లా
కొట్టిన కేరింతల్లో పులకరింతలు

నువ్ తుర్రుమన్నప్పుడు నే కేర్ మన్నానో
నే కేర్ మన్నప్పుడు నువ్ తుర్రుమన్నావో
నువ్వెప్పుడు ఎక్కడ ఉంటావో
గాలి లేని గదుల్లో ఎలా ఎగిరావో
ఫాను కిర్రు ఆగితే కిటికీ లో నువ్వే
కుదురులేనిపిట్టా నీ పేరే తుందురు పిచ్చుక

అవసరాల వారి పొట్టిపిచ్చుకవో
ఆస్కార్‍వైల్డ్ హ్యాపీప్రిన్స్ నేస్తానివో
ఎన్నికథల్లో తిప్పావు నన్ను!! అందమైన తలపుల్లో
నువ్ కనిపించని ఆత్రానివి
ఒకటిరెండు కబుర్లు నీవి నలుగురితో చెప్పుకోనా


౧.

అనగనగా ఒక రైతిల్లు తడుస్తూ చలికాలపు రాత్రివేళ
కిటికీ లో పిచ్చుక జంటలు జడుస్తూ
జాలిగుండె రైతన్న గడ్డి పరచి మిమ్ము పిలిచి
ఎన్ని చేసినా మీరు లోపలికి రారాయే గింజలేసినా తినరాయే

ఇంతలోన వెలిగిందీ ఆలోచన తాను కూడ పక్షైతే దొరికెనా ఓ దారి అని
అర్థంకాని తనపు ఈ సందు పూడేది అయినా తెలిసింది ఓ దేవ రహస్యం
దేవుడెందుకు మానవుడై మన మధ్యకు వస్తాడో
మనిషి అర్థం మనిషిరూపంలో ఉన్నవాడికైనా తెలుస్తుందేమోయని


అనగనగా ఓ బుర్రు పిచ్చుక పడింది మనిషి ఉచ్చులో
ఏమిచేస్తాడో చేసింది వాకబు .. తిండికి సిద్ధం అన్నాడు
వేలేడు లేని పిట్టను నేను. ఆకలి తీరే తీరు లేదు
వదులితే చెబ్తా.. జీవిత సత్యాలు చేతిలో ఒకటి చెట్టున రెండు
అంటూ చెప్పింది సూత్రం ఒకటి:

మనకు నచ్చింది పోయినా
వెళ్ళిపోయినా పోనీ మర్చిపో ఏదో ఓ రోజు ప్రతీదీ పోయేదే
మరి వదలడా అంత చెప్పాకా!! మంచి మాట ఒక బ్రతుకు విలువ
ఎగిరి పిట్ట అరిచింది అసాధ్యపు పనులౌతాయన్న అసత్యాన్ని నమ్మకు..
చెట్టుమీద వాలి అంది నను చంపితే దొరికేది మణుగుడు బంగారం కడుపులో మరి
నిరాశతో అడిగాడు మూడో సూత్రం ముందు చెప్పమని..

కిచ కిచలాడిన పిచ్చుక ఇప్పుడు దెప్పింది
మొదటి రెండూ మరచినోడికి
మూడోది ఎలా ఉపయోగమని!!
పిడికెడు లేని పిట్టపొట్టలో
మణుగుడు పుత్తడి ఉండేదెలా??
చేతిలో లేని పిట్ట ఎక్కడుంటే ఏం!!
పోతే పోనీ.. మనదేదీ పోలేదుగా!!

3
మూడోదీ చదవడమెందుకు!!
యూ ట్యూబ్ లో చూస్తే పోలా!!

RTS Perm Link

6 responses so far

6 Responses to “పిచ్చుకా! ఓ పిచ్చుకా!!”

 1. padmarpitaon 26 Sep 2012 at 8:51 PM

  భలేగా నచ్చేసాయిగా..పిచ్చుకలు… మీరు రాసిన పదాలు 🙂

 2. SKYon 26 Sep 2012 at 9:34 PM

  మీకు నచ్చడం కన్నానాకెక్కువ ఆనందం ఏముంది చెప్పండి!!
  bio diversity summit అయ్యేలోగా నా బుర్ర ఏ యే జీవాల చుట్టూ తిరుగుతాదో!! 🙂

 3. murtyon 27 Sep 2012 at 7:05 PM

  Hi sir, please write one more like this about hares.your writings are so good.

 4. A.Bhaskar(EJS Student)on 27 Sep 2012 at 7:09 PM

  A nice video. Patience should be there for every man. We should not discourage people enthusiasm.

 5. Ravi Kumar Ejson 27 Sep 2012 at 7:09 PM

  Exllent Video Sir…

 6. BVV Prasadon 28 Sep 2012 at 11:33 AM

  మీ కవిత పిచ్చుక మీద మళ్ళీ బెంగ పుట్టించింది.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa