Sep 22 2012

హాయి చెయ్యి

(పాత పోస్టే.. కానీ shakehand ఎన్నిసార్లు ఇచ్చినా తప్పు కాదుగా:)

మనోడికి మంచిరోజులోచ్చినా
పొరుగువాడు పొరపాటుగా ఏదైనా పోగొట్టుకున్నా
ఇంటికొచ్చినవాడు.. ఓటు కావాలన్నా నోటు కావాలన్నా
మన పిల్లవాడు బాగుండాలని మనసనుకున్నా
గుప్పెడంత మనసు గుప్పెట్లోకి వస్తుంది.
మూసిన వేళ్లు తెరిచేటట్టు నెత్తురు పోటెత్తుతుంది.

అభిమానం అవసరం నాడిని ఆడిస్తాయి.
అసంకల్పితంగా మన చేతిని ముందుకు చాస్తాం
ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటాం
దాన్నే కరచాలనం అంటాం.

చేయి చేయి కలపడం చిన్న పనేం కాదు
ఎదుటి మనిషి ఎవరైనా ఎంతటివారైనా
హాయినవ్వు రువ్వుతూ పెదవి పేరు పలుకుతూ
కన్ను కన్ను కలుపుతూ మనసు ముందుకు ఉరకాలి

కరచాలన అంతరార్ధం సామజిక సమరసత

ఇలా అనుకున్నామని అంతా గొప్పగా ఉంటే ..మంచిదే
చేయ్యివ్వడం అంటే మాట తప్పడమన్న అర్ధమూ ఉంది
లోకం పోకడలో చెయ్యాడింపుల ఉపయోగం చిలవలు పలవలు
మంచి చెడులు రెండూ ఉంటాయి వాడుకలో వలువంత అవసరం విలువలు

నిలబడలేనప్పుడు నిలకడలేనప్పుడూ ఊరికే touch లోకి వచ్చేయకు

ఇచ్చేవాడి గౌరవాన్ని పెంచేలా ఉండాలి అందుకునే చేయి
ఆ సందర్భంలో ఇద్దరూ సమానమనే ఒప్పంద పత్రం నీ ముంజేయి
పోటీ పనుల్లో పనిపోటీల్లో క్రీడాస్పూర్తిని తెలియజేయి
విశ్వమానవ స్నేహసంకేతం ఈ కరచాలనం

చెప్పేయ్ నాకు నీ చేత్తో వెళ్ళక తప్పదని
మునుపు ఇచ్చిందే తెచ్చి బదులిచ్చానని
అద్దంలో మనిషిలా నువ్వు నేను, నేను నువ్వు అయ్యేపని
చేయిచాచి ఇవ్వజూపి మనసు కలిపే పని హాయిగొలిపే పని

పలుకరింత, పలువరింత;వీడుకోలు, వేడుకోలు
అభినందన, అభిశంసన ; సమర్ధన, సముద్ధరణ
సందర్భాలు సవాలక్ష అన్నిటికీ ఒకే లెక్క
చేయి చేయి కలుపు అదే నీ గెలుపు

నువ్వేం చెయ్యగలవో అదే చేయి నీ చెయ్యి ప్రేమగా నాకు ఇచ్చేయ్

వేయి మాటలు చెప్పలేనిది చేతి చనువు చెబుతుంది
వందమంది చూపలేనిది చేతి అరలో దాగుంది
పెదవి పెగలనివ్వనిది గుప్పెట గుడిలో ఉంది
కంటి చూపు లేకున్నా శాంతి కాంతి పంచుతుంది

ఎదురెదురు మనసులు మధ్య సందిగ్ధతలు ఎన్నున్నా
స్పర్సతో నిస్త్రాణ నడుం విరిగి, శక్తి మార్పిడి అవుతుంది
తొలకరి చినుకుల వలపులలో ఆమని చిగురించినట్టు
ఏనాడో ఇంకిన జల పైకి ఉబికి వచ్చినట్టు

చేయి చేయి కలపడమంటే ఏకత్వం ఐక్యమత్యం కావడం

కవళిక చెప్పని కథలన్నీ చేయితాకి చెబుతుంది
ఇచ్చే తీరునిబట్టీ మనిషి జోరును పట్టీ
గట్టిగా ఇస్తే బండోడని వదలకపోతే మొండోడని
వేళ్లను మాత్రం అందిస్తే భద్రతలేమి అని ‘చచ్చిన చేప‘ చేతి స్పర్శకు చేవలేదని

ఇలా పలురకాలు కరచాలనం ఇంద్రధనసు రంగుల్లా

ఆత్మీయ కరచాలనం అన్నింట్లో అదే రాజు
అందుకున్నా పొందినా పొంగిపోరలేది ఆనందం
చేయి పట్టి నొక్కగానే నాలుక సన్నాయిరాగం పలుకుతుంది
స్పర్శ విద్యుత్తై తాకి వెచ్చదనం ఒళ్ళంతా పాకుతుంది

ఎన్నేళ్ళు గడిచినా వేళ్లతడి స్మృతి సంగీతమై మోగుతుంది
తీయటి తలుపుల్లో తనువు తీగల్లె ఊగుతుంది

అందుకునే ఆప్తునికి ఆస్వాదన స్వానుభవం
తడి ఉంటేనే ఈ యోగం ఎవరికైనా సంభవం

RTS Perm Link

5 responses so far

5 Responses to “హాయి చెయ్యి”

 1. padmarpitaon 27 Sep 2012 at 12:03 AM

  మీరందించిన చేయి భలేబాగానచ్చింది….వీడమాకండి:-)

 2. BVV Prasadon 28 Sep 2012 at 11:38 AM

  మీ కవితలు చదువుతుంటే స్వచ్చమైన సెలయేటిని చూస్తున్నట్టు ప్రశాంతంగా ఉంది. భావం, భాష, శిల్పం మూడూ ఒకదానిలో ఒకటి కలిసి ప్రవహిస్తున్నాయి.

 3. SKYon 28 Sep 2012 at 1:28 PM

  అమ్మ కూడా మెచ్చుకుంది ప్రసాద్ గారూ.

 4. Ganesh Beharaon 29 Sep 2012 at 6:47 PM

  sir mee kavithalu chadthunte naku kuda rayalanipisthundhi, chala bagunnai,

 5. lakshmion 05 Oct 2012 at 8:51 PM

  దీన్ని మళ్లీ మళ్లీ పోస్ట్ చేశా అని చెప్పక్కర్లేదండీ. ఈ చేయి ఎన్నిసార్లు ఇచ్చినా బాగానే ఉంటుంది. పదాల పొందికలో మీకు మీరే సాటి.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa