Sep 21 2012

ఆధునిక స్వేచ్చ

నీకు నచ్చింది చేయడమంటే.. విప్పుకు తిరగడమా!
వచ్చింది చెప్పమంటే.. తలపుల్లో తప్పుల చిట్టా అప్పచెప్పడమా!!

మూలాలు మరచిన మూర్ఖత్వం ఇప్పుడో నాగరికత
కాలాలు మారినా మారని క్రౌర్యం ఈనాటి ఆధునికత

ప్రకృతి ఆరాధన ఇప్పుడో అపవిత్రం
సున్నిత మనస్థత్వం ఓ స్మృతి శకలం
ప్రతీకల్లో కవినీ, కవితలనీ వెతుక్కోవడం గగన సదృశం

అభివ్యక్తి, ఆడతనం నలిగిన రోజుల్లో
అవ్యక్తవేదనా అంతర్మధనం మొరటు శృంగారం

కట్టుబాట్లను తెంచేది కవిత్వమన్న భ్రాంతి ప్లేటో కాలానిది
భావోద్వేగ బంధనాల నుండి బయల్పడడమే ఇప్పటి వ్యక్తీకరణ

భాషను కాదు.. మనసును సంస్కరించుకోవాలి
మనిషితనాన్ని మనమధ్య మిగుల్చు కోవాలి.
తడితనం ఆవిరయ్యాకా మిగిలేది..
విశ్వమంతా.. స్వేచ్చే..
పొడారిన శూన్యమే

RTS Perm Link

2 responses so far

2 Responses to “ఆధునిక స్వేచ్చ”

  1. padmarpitaon 21 Sep 2012 at 10:53 PM

    తడితనం ఆవిరయ్యాకా మిగిలేది..
    విశ్వమంతా.. స్వేచ్చే..
    పొడారిన శూన్యమే
    Superb lines….

  2. kanistaon 22 Sep 2012 at 5:24 PM

    శూన్యమైన మెదడుకి శూన్యం అంటే తెలీదు
    స్వేచ్ఛాజీవికి స్వేచ్ఛ అంటే తెలీదు…
    అందుకోవాలనే ప్రయత్నంలో కాలం జారిపోతూనే ఉంది….
    తీరా అందుకున్నాం…అనుకునే సరికి జీవం శూన్యం అవుతుంది…
    చంద్రునిపై మచ్చలా ప్రతీ జీవితంలో ఓ చిన్న ఉచ్ఛ…
    ప్రక్షిప్త పూర్వక స్వేచ్ఛపై ఓ మోస్తారు చర్చ…
    ఇంతలో ఈశ్వరేచ్ఛ… అదే స్వేచ్ఛ…

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa