Sep 07 2012

సైదుబాబూ! ప్రేమకు మచ్చ నీ ఊసు

ఏడుపొస్తుంది సైదుబాబూ!
నీ చావు తెలివితేటలకి.. బతకటం నేరవా!
బలవంతపు చావులోన నీవలపు బలిపశువా!!

ఆరు సెప్టెంబరు పేపరులో శివకాశీ చావుల హోరు.
రక్షించబోయి ఆర్తుల్ని.. చనిపోయారట పాపం తెగువచూపి కొందరు.
చావంటే అదిరా…

భగవంతుడి కొలువులోన.. ఛ ఛ.. రాలేనివాడి మాటెందుకు!!
మనుషులనే జాతిలోన దయాళువుకే విలువరా.

నిర్దయుడా! ప్రేమంటే ఏమిటో..
దారులు వేరై విడివడినా.. కలసిమోగే గుండెల సమశ్రుతి నడుగు
ఎదురీతలో తడబడినా బతుకు నావ నడిపించే విడిజంటలనడుగు

ప్రేమంటే ఏమిటో..
చితిమంటల నివురుకింద దేవులాడ దొరికిన అస్థిక
చేరినచేతిలో చిందిన కన్నీటి గంగ నడుగు

పగతోడుగా నువు చిదిమితే దీపం ఆరిన ఇంటిలో..
నువు గుచ్చిన గునపం..అది చీల్చిన కడుపున సుళ్ళుతిరిగే వేదన
కారుణ్యం నేర్పలేని నీ చదువెందుకు చావెందుకు

నువు చేసిన దారుణానికి ప్రేమకాదు కారణం
ప్రేమిస్తే.. మనసిస్తాం జీవిస్తాం .. మనిషిగ చస్తాం

ప్రేమంటే..
తనకు తానుగా జీవితానికి అర్పించే నివేదన
బతుకు బాట్ల పంచుకునే ఆవేదన
మనిషితనాన్ని ప్రోదిచేసే అత్మశోధన
బతికి బ్రతికించుకోవడానికై సాధన
పూసే పువ్వులో, విరిసే నవ్వులో
జీవన సౌందర్యాన్ని దర్శించే ఆరాధన

అనుకున్నవన్నీ జరిగితే అది జీవితమే కాదు.
ప్రేమించే మనసుంటే అలోచనలు అణ్వాయుధాలు గా ఎన్నటికీ మారవు.
ఆమాత్రం తెలుసుంటే..ఇన్ని గుండెలవిసేవి కావు
మాయదారి కసి ముసుగా! ప్రేమకు మచ్చ నీ ఊసు
అది సాటి మనిషి నమ్మకాన్ని కాల్చే కార్చిచ్చు

http://telugu.webdunia.com/newsworld/news/apnews/1209/06/1120906026_1.htm

RTS Perm Link

3 responses so far

3 Responses to “సైదుబాబూ! ప్రేమకు మచ్చ నీ ఊసు”

  1. kanistakaamkshaon 07 Sep 2012 at 4:23 PM

    మ‌నిషిని మ‌నిషిగా ప్రేమించిన వాడికే తెలుస్తుంది ప్రేమంటే
    ప్రేమించిన వ్యక్తి దూర‌మైతే గుండె చెరువౌతుంది…
    శాశ్వతంగా దూర‌మైతే ఆ అల‌సిన గుండె బ‌ద్దలౌతుంది…

    అస‌లు ప్రేమ‌కెందుకింత విలువ‌
    దానికున్న శృంఖ‌ల‌మైన స్వేచ్ఛే దాని ఐశ్వర్యం

    ప్రేమ‌కు స్వేచ్ఛే ఇంధ‌నం
    నిర్బంధం దానికి చెర‌సాల‌…

    ఇది తెలుసుకున్నవాడు ప్రేమ‌ న‌వాబు
    అపార్ధం చేసుకున్నాడు ఈ సైదుబాబు

  2. SKYon 07 Sep 2012 at 4:59 PM

    సుమన్ గారంటే మా చైర్మన్ (రామోజీరావు)గారికి చాల ఇష్టం. ఎలాతట్టుకుంటున్నారో.. గుండెకోతని. మా మనసులు మనుషుల్లో లేవిప్పుడు.

  3. padmarpitaon 10 Sep 2012 at 6:21 PM

    ప్రేమించే మనసుంటే అలోచనలు అణ్వాయుధాలుగా ఎన్నటికీ మారవు.
    great line….

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa