Sep 04 2012

నువ్వే.. నాగురువంటే..

నువ్వే.. నాగురువంటే.. కోసి ఇమ్మని అన్నాడంట వేలు..
ఈ కాలం లో ఎవడైనా వింటాడా!!
నా వేలు నీకిస్తాను, చేయిపట్టు అంటాడా!!
వినడం ఎందుకు!!.. జీవితకాల వేదనకా!!

గురువంటే.. చెప్పొచ్చు మంచిగా ఎన్నైనా
మరి అడగొచ్చా ఎదురేదైనా.. అని అడిగారా ఎవరైనా!!
ఏకలవ్యుడి నుండి కాసబియాంకా వరకూ..
విని చెడిపోయిన వారే తడవ తడవకూ

శిష్య లక్షణం అనన్య సాధ్యత్వమే గానీ అంగుష్ట సమర్పయామి కాదే..
కావల్సింది పొందటం కాక వీడనిది కోసి ఇవ్వడం ఎలా ఒప్పు!!
ఆర్తి, అద్యవసాయం ఉన్నవాడెవ్వడూ తనకొమ్మ తాను నరుక్కోడు
గట్టిపూనిక ఉన్నవానికి ధ్యాస, శ్వాస విద్య మీద కాక గురువు మీదా!!

అసలు విషయం అదికాదు..నేర్చేవాడికి ఉండాలి బాగుపడే అలవాటు
విద్యనేర్పెదెవరైనా అందుకో ఆదరంగా; శత్ర్రు శిక్షకుడి పై నీకెలా గురి!!
అసూయాగ్రస్తుడి శిక్షణ అనసూయగ మారుస్తుందా!
ఉపదేశం పొందలేక వేలిస్తే.. పడిన కష్టం తిరిగి వస్తుందా!!

వంచలేక విరిచే గురువులు ఈనాడూ కొదవ కాదు
కళ్ళు తెరచి చడవడం రావాలి పుస్తకాల్ని కాదు మనుషుల్ని
బాధల్ని చూడగల్గడం ఎదురొడ్దడం కావాలి
దార్శనికతతో ఉత్తేజితం అవ్వడం తెలియాలి

నానావిధ చరాచరాల సంబంధాలను చూడగల్గాలి
హాని చేసుకోకతప్పనప్పుడు అతితక్కువ తప్పుల దారిలో నడవాలి
ప్రశ్న అడగడం రాని శిష్యుడు వేలేం ఖర్మ తలెవరిదైనా కోసేస్తాడు
లోకమర్యాదకు తలవంచేవాడు ఇంతకన్నా ఏంచేస్తాడు!!

త్యాగధనుల జాబితాలో పేరుకోసం ప్రాకులాట తప్ప
మట్టిలోన కలసిన మనస్సాక్షులు కధల్లోనే గొప్ప.

RTS Perm Link

7 responses so far

7 Responses to “నువ్వే.. నాగురువంటే..”

 1. srinivasa raoon 05 Sep 2012 at 10:09 AM

  ఎంతోకాలం తర్వాత ఇంతటి బావావేశంకలిగిన కలిగి వున్నవారిని గూర్చి తెలుసుకుంటున్నాను. మీ వంటి వారుంటే తెలుగు ఎప్పటికీ వెలుగుతునే వుంటుంది

 2. SKYon 05 Sep 2012 at 10:22 AM

  తెలుగు వెలుగుల దీపావళి అందాల తో మన నరాలూ, ముందు తరాలూ ఉర్రూతలూగాలి.మప్పిదాలు.

 3. Manoharion 05 Sep 2012 at 10:58 AM

  Nice interpretation of history. On Teacher’s day, the message delivered through your poem is very apt and timely. In the present context, it is still relevant as such Gurus still exist.

 4. SKYon 05 Sep 2012 at 11:32 AM

  Thankyou Manohari. we rquire jagatgurus: the persons who can receive knowledge from the whole world.

 5. kanistaon 06 Sep 2012 at 5:11 PM

  అర్జునుడి ఆకృతైన‌ ద్రోణుడే కాదు గురువంటే
  బ‌లి బ‌ల‌వ‌న్మర‌ణాన్ని నిరోధించేందుకు నేత్రత్యాగం చేసిన‌ శుక్రాచార్యుడూ గురువే
  శిష్యురాలి కోరిక పై భీష్ముడితో యుద్ధం చేసి ఓడిన‌ ప‌రశరాముడూ గురువే
  మంచి చేసేందుకు చేసిన ప్రతీ ప్రయ‌త్నంలోనూ గురువు ఓడిపోయాడు…
  అస‌లు గురువు ఎప్పుడు గెలిచాడ‌ని ? శిష్యుడి వ‌ల్ల గురువుకి ఒరిగిందేమిటి? కోల్పోడం త‌ప్ప…

  శిష్యుడి కోసం ఏకాక్షుడ‌య్యాడు శుక్రాచార్యుడు…
  త‌ప‌ఫ‌లాన్ని కోల్పోయాడు ప‌రశ రాముడు…
  శిష్యుడి హితాన్ని కోరినందుకు ఆ శిష్యుని చేతిలోనే మ‌ర‌ణించాడు ద్రోణుడు

  శిష్యుడి బాగుకోసం, శిష్యుడి విజ‌యం కోసం, శిష్యుడి కీర్తి కోసం… చేశాడు గురువు ఇవ‌న్నీ
  శిష్యుడికి విద్య నేర్పించ‌డమే కాదు.. తాను ఉప‌దేశించిన అస్త్రాన్ని త‌న‌మీదే ప్రయోగిస్తున్నా
  శిష్యుడి శౌర్యాన్ని, ధై ర్యాన్ని చూసి ఆనందించాడు గురువు..

  త‌త్ఫలితం
  శిష్యుడికి కీర్తి… గురువుకి ముక్తి…
  శిష్యుడికి విజ‌య ప్రస్థానం… గురువుకి మ‌హా ప్రస్థానం

  ఇది నీత‌ప్పూ నాతప్పూ కాదంటాడు గురువు… అందుకే అత‌ను గురువు
  గురువుకి స్థాయి శిష్యుడి వ‌ల్ల రాదు, రాబోదు….
  గురువు స్థాయిని గురువే అంచ‌నా వేయ‌గ‌ల‌డు
  అందుకే దేవ‌గురువైన బ‌హ‌స్పతితో స‌మాన స్థాయి శుక్రాచార్యుడిది…
  పోనీ పోల్చి చూడ‌రాదూ ఇద్దరు శిష్యప‌ర‌మాణువుల్ని ఈవిధంగా
  సాధ్యం కాదు నీకు ముల్లోకాల్ గాలించినా, లేదు సాధిస్తానంటావా ఆ సాధించేక్రమంలో నీవైపోతావు ఓ గురువు…..

 6. SKYon 06 Sep 2012 at 5:50 PM

  కనిష్టా!.. ఎంత నిష్టగా రాశారు..కవనం కదిలించినందుకు.. మీరు కదిలినందుకు.. ధన్యుడ్ని.

 7. kavithaon 06 Sep 2012 at 8:11 PM

  కవితల్లో భావోద్వేగం కదిలించింది.ముగింపు వరుసలు బావున్నాయి

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa