Aug 29 2012

సాగిపో..

బాల భానుని లేత కిరణం దేహానికి వెచ్చదనాన్ని ఇచ్చి
మనసును తాకక పోతే అది వేకువ కాదు.

చీకటి పరచిన దుప్పటి మెలకువ తో తొలగినంతనే
నిద్రా లోకపు విహారాలకి ముగింపు కాదు.

రోజంటే పగలూ రాత్రి కలయిక కాదు
బ్రతుకంటే గుదిగుచ్చిన రోజుల పనుల చిట్టా కారాదు.

ప్రభాతపు తొలి వీక్షణం లోంచే కలలు
వెలుగు రేకల్ని ముద్దాడాలి

రాత్రైనా, పగలైనా కలల్ని వెలిగించుకోవడం
నింగికీ, నేలకు నడుమ మేఘం లా
నిప్పునీ, నీరునీ గాలితో కౌగలించుకోవడం.
కాలం తో కరిగిపోయేవరకూ కదిలిపోవడం.

ఏదైనా ఒక రోజు మెరుపు మెరుస్తుంది.
పిడుగులు కురుస్తాయి జీవితం తడుస్తుంది

వడగాలై దెబ్బకు విసిరేస్తుంది
ఓ అవకాశం అందలమెక్కిస్తుంది.

ఒక ఆశని లోకం జారవిడుస్తుంది.
నిన్ను ఈ ప్రపంచం ఏమారుస్తుంది

ఒక్క క్షణం ఆగామా!!
నిరాశల నిట్టూర్పుల లోగిలి లో
నీ బతుకు నడి సంద్రపు లోతుని కొలిపిస్తుంది

ఎదురీతకు సిద్ధపడితే
విస్తరించిన సాగరాన్ని చీల్చుకుంటూ
వడివడిగా సాగే ఓడను తలపిస్తుంది.

RTS Perm Link

6 responses so far

6 Responses to “సాగిపో..”

  1. padmarpitaon 29 Aug 2012 at 9:21 PM

    చాలాబాగుంది

  2. SKYon 30 Aug 2012 at 5:33 PM

    ప్రతి అక్షరం ఆణిముత్యంలా అగుపిస్తుంటే…
    … ధన్యుడ నైతిని…
    అన్నిటి కిది కడసారి జన్మము..{ఇంత అనందం కలిగాకా}
    సత్యంబిక పుట్టుట సున్నా ..
    🙂

  3. kanistaon 01 Sep 2012 at 2:05 PM

    రేయి, ప‌గ‌లు మ‌ర‌చి
    నిట్టూర్పుల సుమ‌ఝ‌రిలో త‌డ‌చి
    స్వయః సాంత్వనాభిలోకంలో త‌ర‌చి త‌ర‌చి
    విహ‌రించా నే మైమ‌ర‌చి

  4. meraj fathimaon 02 Sep 2012 at 8:39 AM

    satesh garu kavitha bagundi.

  5. SKYon 02 Sep 2012 at 11:52 AM

    నా… నేను…. మీ అభినందన తో …నాలో… అంతరాన…ఆనందిస్తున్నాను..

  6. Madhuon 09 Sep 2012 at 6:08 PM

    Sir mee kavithalu super..

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa