Apr 04 2009

జీవన యానం .. రైలు ప్రయాణం

 

train-tracks

 

ఇష్టం లేని ప్రయాణాన్ని కష్టంగా చేయించడానికి రైలోస్తుంది స్టేషన్లోకి ..

పెదాల పట్టాలను బిగబెట్టి…వేగమంత వేవిళ్ళతో.. ప్రసవార్ధమై ముక్కుతున్న పూర్ణ గర్భిణిలా .. ఇష్టం లేని …
అనుబంధం ఏ నాటిదైనా ఆగేది ఐదు క్షణాలంటూ.. రేకెత్తిన ఆలోచనలనూ.. రైలెక్కించడానికి .. ఇష్టం లేని ..


నాకు ఊరు వోదలలాలంటే.. తల్లి ని వదిలే చంటోడి కున్నంత బాధ ..
నా ఏడుపు కేక కోసం ఆనందం గా ఎదురు చూసిన తండ్రిలా .. నను పట్నం పంపే కిటికీ కరచాలనాల సంఘం ..
తెగవలసినదని తెలిసినా.. తోడొచ్చే తల్లి పేగులా ..చిన్న నాటి నుండి పెనవేసుకున్న స్నేహ బంధం ..
ముందుకు సాగే రైలు కి ఉన్న వెనక్కి తిరిగే చక్రల్లా.. నను సాగనంపుతాయి .


ఏడుపో రాగమో తెలియకుండానే.. రైలు.. నేను.. ముందుకు సాగుతాము.
కంపార్ట్ మెంట్ లైట్ల వెలుగు లో కదిలే కాలువ ఆగిన రైలనిపిస్తుంది
నాకది.. చెలియలికట్ట దాటీ – దాటని చెలి కంటి చెలమను తలపిస్తుంది.
దూరమౌతున్న ఊరులా పలచనౌతున్న సిమెంట్ బెంచీ సింహావలోకనాలు ..
ఎదురొచ్చే మరో రైలు రొద లో వులికిపాటు పడుతుంటాయి.
ఆ సమయానికి ముందు స్టేషన్ లో మైకో- గంటో అప్రమత్త మౌతుంది .,

 రైలింజను నిట్టూర్పులతో స్టేషను లో బెంచీ లన్నీ బరువు దిన్చుకున్టాయి.


ఇష్టం లేని పెనిమిటి తో కష్టం గా కాపురానికా అన్నట్లు ..
ఇష్టం లేని ప్రయాణాన్ని కష్టం గా చేయించడానికి .. రైల్లెల్తోంది .. చీకట్లోకి..

RTS Perm Link

8 responses so far

8 Responses to “జీవన యానం .. రైలు ప్రయాణం”

 1. పద్మకళon 05 Apr 2009 at 12:27 PM

  రైలు ప్రయాణం మీకెందుకంత కష్టమో నాకు తెలియదు కానీ,, నాకు తెలిసి ఒక కవికి రైలు ప్రయాణం చేసేటప్పుడు కిటికీ పక్కన కూర్చుంటే కలిగే భావావేశం వర్ణనాతీతం.
  మీ కవితలోని ప్రవాహం , అల్లిక చాలా బాగున్నాయి. ఆ అల్లిక చిక్కాలంటే
  దానికి కొంత సమయం పడుతుంది.అదే స్థానానికి పాఠకుడు చేరుకోవాలి. చలా బాగుంది.

 2. తాడేపల్లిon 05 Apr 2009 at 3:09 PM

  బాగా రాశారు. కానీ కవితలోని పాదాలు మఱీ పొడవుగా ఉన్నాయేమో !

  మీ బ్లాగు హెడర్ లోని పక్షిబొమ్మా, అదీ ఇదివఱకు చావాగారి బ్లాగుకి ఉండేది.

 3. SKYon 06 Apr 2009 at 11:04 AM

  పద్మకళ గారు.. వేన వేల మేలుపొద్దులు. చిన్నప్పుడు .. చదివినRip Van Winkle.. దీనికి ఆలంబన..
  tatak.. tatakk.. రైలు పట్టాల శబ్దం లో నా కవిత కలిసి పోతుంది. మీ కు నచ్చినందుకు.. మప్పిదాలు.

 4. కొత్తపాళీon 07 Apr 2009 at 1:17 AM

  very interesting

 5. SKYon 08 Apr 2009 at 2:24 PM

  నాకు పొడుగ్గా రాసే అలవాటండి.ఆక్షరం మనిషైనప్పుడు కవిత లో కామెంట్ కవిత రాసేను..
  మీరు అది చదివివుంటే.. ఆయ్య బాబోయ్ అంటారేమో…
  – స్కై

 6. bollojubabaon 09 Apr 2009 at 12:26 AM

  తల్లి ని వదిలే చంటోడి కున్నంత బాధ
  ఎదురు చూసిన తండ్రిలా
  కదిలే కాలువ ఆగిన రైలనిపిస్తుంది
  దూరమౌతున్న ఊరులా పలచనౌతున్న సిమెంట్ బెంచీ
  స్టేషను లో బెంచీ లన్నీ బరువు దిన్చుకున్టాయి.
  ఇష్టం లేని పెనిమిటి తో కష్టం గా కాపురానికా
  వేగమంత వేవిళ్ళతో

  ఇన్ని సిమిలీలే
  కడుపు నిండిపోయిందీవేళ

  చాలా బాగుంది.

 7. bujibabuon 13 Apr 2009 at 2:45 PM

  జీవితం ఓ రైలు ప్రయాణం అని మనకు అర్థం అయ్యేలోపు ఎన్నో జ్ఞాపకాలను దాటేసివుంటాం. అర్థం అయ్యాక ఏ రోజుకు ఆ రోజు ప్రయాణం ఎలా చేయాలి? ఎవరితో చేయాలి? వంటివి నేర్చుకుంటాం. ఇప్పుడు రైళ్లల్లో ల్యాప్‌టాప్‌ల నుంచి మెయిల్స్‌ చూసుకుంటూ… రిప్లై లిస్తున్నారు. ఈ బ్లాగింగ్‌ నిత్య జీవితంలో రైలు నుంచి పంపే మెయిల్స్‌ లాంటిదనిపిస్తోంది.
  మీ రైలు కవిత బాగుంది. కీపిట్‌ ఆప్‌.

 8. sandhyaon 01 Sep 2012 at 4:55 PM

  Poetry flow was mesmerizing…. I like it.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa