Aug 21 2012

ఈ క్షణం ఇలా ఆగి పోనీ

 

 

ఈ క్షణం ఇలా ఆగి పోనీ
రేగిన గాయాన్ని మాపే కాలం తో జతకట్టలేను
నన్ను తనలో పొదుగుకున్న రాత్రి కరిగిపొతున్న భయం
నీడ చూడాల్సిన వెలుగుజాడ లో నే కరగలేను

 

తెల్లవారితే జీవితం యాంత్రికం
నాలో నేను లేని రోజంతా పరిగెత్తలేను
నా నగ్నత్వాన్ని కప్పే నాగరికత ముసుగులో
కృత్రిమ శ్వాస తొ బతుకీడ్చలేను

 

ఈ క్షణం ఇలా ఆగి పోనీ
నన్ను నాలొ చూసుకునే అద్దం లాంటి రాత్రి
చీకటీ వాకిట్లోని  మసక వెలుతురే
నీకై తపించిన నా నన్నును నాకు దూరం చేస్తుందన్న దిగులు

 

గతం లోతుల్లో నేను నా లానే ఉండిఉంటా
నేను నువ్వైయ్యాకా విచ్చిన వెలుగులో నన్నే నేను పోగొట్టుకున్నా.
నిశీధి పంచే చల్లదనం వలపుల వెచ్చదనాన్ని ఏమార్చనీ
నేనంటూ మిగిలుండాలన్న నీ  వీడుకోలు వీలునామా
అనుక్షణం నీకై బతకాల్సిన బాధ్యత
ఎందుకింత కాంక్ష నీకు
జన్మ జన్మల బంధమా నువ్వే గెలవాలి కానీ
ఈ తిమిర సమరం లో ఈ ఒక్క క్షణం ఇలా ఆగి పోనీ
నన్ను నాలో నిలిచి పోనీ


RTS Perm Link

4 responses so far

4 Responses to “ఈ క్షణం ఇలా ఆగి పోనీ”

  1. Sateeshon 23 Aug 2012 at 9:43 AM

    నీవులేని జీవితంపై ఎలాంటి
    నిట్టూర్పులూ లేవు నాకు
    అని ముగిస్తే బాగుండేదేమో.. అనిపించింది. రాసిన తరువాత.

  2. padmarpitaon 25 Aug 2012 at 5:15 PM

    Beautiful feelings.

  3. కెక్యూబ్ వర్మon 25 Aug 2012 at 9:09 PM

    మీ అందమైన భావ చిత్రాలను ఇన్నాళ్ళు ఎలా మిస్సయ్యానో…
    పద్మార్పితగారి బ్లాగు ద్వారా ఇలా వచ్చి అతుక్కుపోయా…
    మీ కవితా హృదయానికి అభినందనలు సతీష్ గారు..

  4. Ahammadon 14 Oct 2012 at 1:50 AM

    Satheesh sir mee kavithamrutha maadhuryanni aalasyanganina aaswadinchinanduku chala santhosanga undi. meetho unnannallu satheesh sir maathrame thelusu. yasaswi parichayam ayyaka bhavakuditho bandhuthvam erpadindi.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa