Aug 04 2012

నేనై ..ప్రేమలవ్.. నిన్నుయు

 

ఉలి రాల్చిన శిలాక్షరాల రజను ను ఓ యుగాదిన పోగేస్తున్నాడొకడు.

తవ్వకాల పునాదుల్లోంచి అంతర్వాహినిని వెలికితీస్తున్నాడతడు.
ప్లవకాల ప్రవాహం లో కొట్టుకుపోతున్న ఆత్మబంధాన్ని ప్రోది చేసుకుంటున్నట్టుగా
తన దోసిలినిండా జవ జవ లాడే తెలుగుదనం జాలువారుతోంది.

నా ఉలి రాతల సమానర్థకమే మనసు బాషలోకి మారుతుంది.
సమీప గతం రాహుఛాయలా నా తలపుల్లోకి జారుతుంది.

ఆ ఉషోదయపు అన్వేషికి అందిన శకలాల కొన వెలుగుల్లో
చరిత్ర చెక్కిన శిల ముభావమై మసక బారుతోంది.

వాడి మాటల్లోని నిజం భాషను మించిన భావమై నిలుస్తోంది.

ముంగిలి రంగవల్లుల్లో ఆహ్వానాల తోరణం ఇంగ్లీషురూలైనట్టు ఆంధ్రత్వాన్ని హరించింది

రంగుల పేర్లు భాష మార్చు కున్నాయి. రంగును కలరావహించింది.
చెక్కిళ్ల పై ఎండిన చారలా చందమామ మూనై వలితిరిగాడు
అమ్మా నాన్న లకు లేని అస్థిత్వం జాబిల్లికెక్కడిది?

విద్యాలయాలు పిడిదీక్షాలయ్యాలవుతున్నప్పుడు కవితాపాఠం లాంటి చదువు కంఠోపాఠం అవ్వచ్చు గానీ హృదయగతమౌతుందా!
తినే అన్నం తాగే నీరు పీల్చే గాలి నడిపే వాహనం రాసే కలం, కాగితం మనసు భాష లోంచి రావడం ఇప్పుడో ప్రహసనం
మన మూలాల్లో మనమెంతన్నది ఒక ప్రహేళిక.

ఆసుపత్రుల్లో తువ్వాళ్లతో చిక్కులు లేవు కానీ
పోత పాల పెంపకాలలో పెట్టే పేర్లన్నీ పొల్లుపోనివే అజంతం గాఉండలేని నామం పొల్లుతో నేమవుతుంది.
సాధారణంగా జరిగే కామనే.. లోకం లో నిలవ్ నివ్వనివి ప్రేమ భావనలు
పొరపాటైనా కాకున్నా.. ప్రతి సారీ నిముష కాలమినిట్టే గడిపినట్టు
ఒకే ఒక అవగతం
జీవితం ఒక పాటైతే అది సాంగోపాంగమే

అర్థం కాని పదబంధాల గజిబిజి ని తీరికలేని తనంగా పోగెసిన వాడి కెంత గీర్వాణం!!!
వాడి దోసిలి నిండిన మల్లెల్ని మొనల్లా కన్ననాదెంత చత్వారం!!

RTS Perm Link

3 responses so far

3 Responses to “నేనై ..ప్రేమలవ్.. నిన్నుయు”

 1. nagasaion 07 Aug 2012 at 7:35 PM

  చాలా బాగుందండి. కవితను నేను ఇప్పటికే చూశా. దానికి మీరు తయారు చేసిన ఇమేజ్ ఇంకా బావుంది.

 2. Vysh@The Colourful Eyeson 31 Aug 2012 at 10:17 PM

  ippude chusanu mee comments.. alaane follow cheasnu me blog ni kuda chadivanu..
  chala bagundi..
  meeru chala baga kavitalu rasaru, rastunnaru.. meeru rastunna prati aksharam lo nuu manusu spandistunna bhavana artham avtundi…

  Impressed..

  🙂
  Vysh

 3. SKYon 01 Sep 2012 at 2:59 PM

  అందమైన కంటికి.. అన్నీ అందం గా కనిపిస్తాయి..
  కవితలో love, color, Ok, song, minute లాంటివి పొదిగిన విధానం వెనుక మీరు వెలికితీసిన ILOVE YOU ప్రేరణే.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa