Apr 04 2009

కొప్పర్తి గారి “అక్షరం మనిషైనప్పుడు..”

 

అక్షరాలు అచ్చం మనుషుల్లానే ఉంటాయి.

పేజీ నిండా ఉన్న అక్షరాల్ని చూస్తే జనసందోహం శిరస్సుల్లా అనిపిస్తాయి.

బారులు తీరిన అక్షరాలు ప్రార్ధన కోసం నిలబడ్డ బడి పిల్లల్నిగుర్తుకుతెస్తాయి.

నాలుగు అక్షరాల పదం నలుగురు మనుషులు బెంచీ మీద కూర్చున్నదృశ్యమౌతుంది.

పేరాగ్రాఫ్ సభ ఐతే శీర్షిక వేదిక అవుతుంది.

ఒక మనిషి ఒక అక్షరం ఐనప్పుడు జనసమూహం తరంగంగా సాగిపోవడం పాటౌతుంది.  

అక్షరాల్లో ఒంగిపోయిన తాత నడుముల్లాంటి అరసున్నాలుంటాయి.

తుపాకి ఎక్కుపెట్టిన సైనికుల్లాంటి దీర్ఘాక్షరాలుంటాయి.

ఒక ఇంటినే అంటిపెట్టుకునే భార్య భర్తల్లా ఒక అక్షరాన్నేఆశ్రయించే ఐత్వాలుంటాయి .

తనలాంటి మనుషుల్ని తొక్కిపెట్టే మనుషుల్లాంటి ద్విత్వాలుంటాయి. 

ళి – బిడ్డ నేతుకున్న స్త్రీ మూర్తిని గుర్తుకు తెస్తుంది.

ఠ – గర్భంలో బిడ్డను మో స్తున్నచూలలౌతుంది.

కొ – మత్స్య యంత్రాన్ని కొట్టబోతున్న అర్జునుడై నిలుస్తుంది.

అః – బంతుల్లాంటి కవల పిల్లల తల్లై సాక్షాత్కరిస్తుంది.

అక్షరాలు పదాలై.. పదాలు పంక్తులై.. సరళరేఖల్లాఁ పరచుకున్నపుడు .. .

పంక్తులు చిన్న రూపాల్లో దర్సితమౌతాయి.

వాటిల్లో కొన్ని మార్చురీ లో వరుసగా పడుకోపెట్టిన శవాల్లా ఉంటాయి

అంతరంగం లోతుల్లోకి దింపుతున్న మెట్లలా ఉంటాయి

ప్రపంచాన్ని between the lines చూసే కిటికీ ఊచల్లా ఉంటాయి

సూర్య కిరణాల ముక్కల్లా ఉంటాయి.

Running tracks లా ఉంటాయి.

పరిచిన పువ్వుల మాలల్లా ఉంటాయి.

అన్ని అక్షరాలు అక్షరాలు కావు ..

పలికేవి .. పగిలేవి..అడిగేవి.. అడుగులేసేవి అక్షరాలు

ఒక మనిషి ఒక అక్షరమైనపుడు దేశం పుస్తక మౌతుంది.

పుస్తకాలలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నవి అక్షర శకలాలే కాని అక్షరాలు కావు

అక్షర రూపాలే కాని అక్షరాలు కావు.

ప్రశ్నలతో..సమస్యలతో.. అవ్యక్తాలతో తలలన్నీ పేలిపోఁతున్నాయి.

తలకట్లు లేని మొండి అక్షరాలే పుస్తకమంతా సంచరిస్తున్నాయి.

 

 

 

 

RTS Perm Link

6 responses so far

6 Responses to “కొప్పర్తి గారి “అక్షరం మనిషైనప్పుడు..””

  1. నెటిజన్on 13 Apr 2009 at 3:43 PM

    బ్లాగుంది! 🙂

  2. సతీశ్on 19 Jul 2012 at 10:11 AM

    thanks. ఇది నా గురువు(కొప్పర్తి గారిది).

  3. vakulaon 01 Sep 2012 at 12:07 PM

    Satesh garu….

    Aksharanni manishiga me vuha adbutam … Aksharamlo manishini kusina meru AA Aksharamtone andari manasulo telugu velugulu nimpalani korukuntunaam…

    vakula chapara..

  4. kavithaon 10 Sep 2012 at 8:09 PM

    kopparthi gari kavitha chala baagundandi…

  5. P. Vijayalakshmipanditon 27 Jul 2017 at 10:31 AM

    మనుషులను అక్షర సమూహం తో పొల్చడం .” ఆక్షరం మనిషయితే పుస్తుకం ఒక దెశం ” గొప్ప‌ ఆలోచన /భావన . అన్ని దేశాల భాషలు కలిసిన పుస్తుకం మన ప్రపంచం ,అన్ని ప్రపంచాల భాషలు ( అక్షరాలు ) ఓ విశ్వం . మనిషి = అక్షరం . beautiful expression

  6. P. Vijayalakshmipanditon 27 Jul 2017 at 10:35 AM

    Kopparthi gaari Aksharam’ Manishyinapudu”Great & beautiful expression .

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa