Sep 19 2009

మా మంచి బహుమతి

mother_earth

ఘజల్ శ్రీనివాస్ గారి facebook discussion లో నా ప్రతి స్పందన

{Ghazalsrinivas Dr said: I want to give good gift to mother Earth..can you suggest a good gift pelase-urgent and direly needed}

నేలమ్మ కు ఇద్దామా శీనూ ఒక బహుమతి ..

బహుమతమై వర్ధిల్లని దీవించూ జగతి ని .

ఎందుకొచ్చిన అసహనం ఏమి బావుకుందామని ..

ఆడ ఈడ దాడు లేమి? ఓటి కుండ బతుకులాయె వేటగాళ్ళ తల్లీ.

నువ్ పంచిన  ప్రేమే నా కొంప ముంచింది..

మగ నలుసై విర్ర వీగి ఇంత వరకు తెచ్చింది .

కన్న పేగు తెగి పోయి కారుణ్యం కరిగి పోయి ..

మరణాని కే ఋణ మంటూ అనుబంధాలను కడతేర్చింది.

మంచోళ్ళకు నూక లేదు నేల మీద ..

ఎన్ని సార్లు ఈ ఓటమి నా తల్లీ .. ఓ చెల్లీ.

మోసపొయి ఒకసారి నువ్వు పోయి ఒకసారి

కన్నవారిని కొల్పోయి .. ఎన్ని సార్లు ఎన్ని సార్లు

ఎన్ని సార్లు ఈ ఘోరం..? ఎందు కింత కార్పణ్యం ?

కలిసి నీ నీడ లోన మసులుకున్నందుకా? కసి పట్టి కడతేర్చావు మళ్ళీ. మళ్ళీ.

నువ్ పంచిన మంచినే మేమంతా మరిచాము.

వంచనే మా మతమని నిరంతరం జపించాము

నీ బుద్దులు ఆ సుద్దులు నిలుపుకునిన మగవాడు కాడెపుడూ నీ బిడ్డకు  పగవాడు .

దీవించూ ఓ తల్లీ నీ సహనం రావాలని సమ్యమనం కావాలని

అదేలే మేమిచ్చే మా మంచి బహుమతి

# is it sounds like Ghajal!!

RTS Perm Link

One response so far

One Response to “మా మంచి బహుమతి”

  1. ashwinion 20 Sep 2009 at 8:48 PM

    good blog

    yru so much worrying abt such kind of posts and ghajals..its a waste of time

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa