Apr 18 2009

రాజకీయ గణం –

crazy-old-man

మంచి కవిత్వం రాయాలంటే భయమేస్తుంది..

మీరంతా ఎన్నికల పుట తప్ప ఇంకేమీ చూడరన్నది నా సాకు.

పద్యం రాయలేను.. రాజనీతి నా కావ్య వస్తువు కాదు..

గణాల గుణింతాలు రావు మరి నాకు.

నాకు తెలిసినవి.. అక్షర గణాలు కావు.. జన గణాలే..

ఎన్నికల రాజ్యం లో ఎక్కడ చూసినా ఈ గణ సమీకరణాలే..

కావ్య నిర్మాణానికి వేదాంగం లో ఛందస్సు లా రాజ్యంగం లో ఎన్నికల సదస్సులు..

ఎన్నికల రాజ్యం లో సదస్సే ఓ చందస్సు.. అది అర్ధం కాని గణాల కూర్పు నా కవిత లా…

వార్తా ప్రసారాల్లో నైనా.. యాత్రా ప్రచారాల్లోనైనా గణాలను గుదిగుచ్చి ఉంచడం పైనే చర్చ..

తారా తోరణాల రోడ్ షో ల లో.. జనగణాలు కవితావేశం లా వచ్చిపడుతున్నాయి.

అధికార గణ నాధుని పద్యాల్లో సమీకరించిన మాత్రలే ..గణ విభజన చెందుతున్నాయి అవి నిరసన గళాన్నే వినిపిస్తున్నాయి ..

మొన్నీ మధ్య తెలంగాణా ఛందస్సు లో చంద్ర గణం యతి మైత్రి కట్టింది..ప్ర్రాస నియమాల్ని ఉల్లంఘించి కామ్రేడ్  గణాలు.. అదేశాలయ్యాయి .

ఇది రాక్షస గణ మన్న రాజా.. నువ్ మరుస్తున్నావ్ మనది గ(ర)ణ తంత్ర వ్యవస్థ.

ఈ గోలంతా దేనికి.. నే చెప్పాల్సింది చెప్పి పోతాను.. అడగాల్సింది అడిగి పోతాను..

అసలు గణ మంటే ఓ గొర్రెల మంద.

కొండకోచో తోడేలు అందులో ఓ గురివింద.

మూడక్షరాలు కలిస్తే గణ మౌతున్నట్టే ముగ్గురు కలిస్తే రణగుణమౌతుంది.

గణాల్లో గురు లఘువులున్నట్టే తోడేళ్ళు గొర్రెలు ఉంటాయంటా..

గొర్రెలన్ని వోటేసి గెలిపించేది ఆ గణం లో గొర్రె నే.. పులితోలు కప్పి కత్తిచ్చి కూచో బెట్టిందీ .. తోడేళ్ళుతమని తినకుండా కాపాడమనంటా ..

మరి నువ్ గొర్రె వే గా.. నీ గుణ మేమయ్యింది? తోడేళ్ళ తో పాటు నక్కల్ని ఎందుకు మేపుతున్నావ్?

RTS Perm Link

2 responses so far

2 Responses to “రాజకీయ గణం –”

  1. raamuduon 18 Apr 2009 at 10:00 PM

    bhale bhale vaayinchaaru@@@@

  2. lucky skyon 19 Apr 2009 at 8:11 PM

    కాకపోతే మరేమిటండి..పదవి కోసం ఇన్ని వేషాలా.. అసలు హుందాగా ఉందా..మీరే చెప్పండి.. మనం కూడా గోర్రెల్లాగా.. ఎన్ని మాటలకని .. తలలు ఊపుతూవుంటాం..
    తిక్క లో ఉంటే తప్పు చెప్పను నేను.
    మప్పిదాలు

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa