Feb 08 2016

యశస్వి||వీరమల్లుడా! విజయోస్తు!!||

Published by at 7:52 PM under my social views

mallula

వేడంగి కాలువ గట్టున..
గోదారమ్మ నీరు తాగించి పెంచినందుకు
నీడనిచ్చే నిఖార్సైన వేపసెట్టు మాకాడు…

పాలకొల్లు మడిసేల గట్టమ్మట
సెంగున దూకే లేగదూడా..
పొద్దుగాల మంచుసూరీడూ
అవును.. ఆ పిల్లాగాని
రెండుకళ్ళల్లా మెరుస్తునే ఉంటాయ్

ఆడెప్పుడూ మొగాన్ని అద్దంలో సూసుకోడు!
ఎండన పడొచ్చినోడి గుండె తన నీడన నిండాక
ఎదరోడి ఆనందంలో సూసుకుంటాడు.

ఆడి సెరిత్ర జంగారెడ్డిగూడెం తలుస్తానే ఉంటాది
తన సావాసగాళ్ళకి సదువు, ఆపై బువ్వ రుసీ
అమ్మ సేతి మజ్జిగలా నిత్యం.. తొలుస్తానే ఉంటాది

ఉజ్జోగాన్ని ఇప్లవంలా సేసినోడు
ఎవడి పాపాన ఆడు పోతాడనుకునేటోడు కాదీడు
అ ‘ధర్మాన’ పోయే బాగోతాన్ని
తిరగేసిన గునపం మాదిరి కొబ్బరి కాయల్ని వలిసినట్టు వలిసేసాడు

సిక్కోలు కొండల్లో కన్నెధారకు గుండెను ఒడిసిపట్టి కాపాడినోడే
రోడెక్కితే గుద్ది సంపుతా మన్న ‘కిల్లి’కూతల్ని
కలం పిడికిలి బిగి చూపించి
కలుగు దాటని ఎలుకల్ని సేసి భయపెట్టినాడోనాడు.

అదాట్నఓదినం పాత్రికేయం వదిలేస్తే
ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి మోటూరి హనుమంతరావు అవార్డీకి
ఇదేం ఆలోచన అన్నారు జనమంతా
వాడికేంలోటు!!

నే విశ్వమానవుడి గుండెసప్పుడని
అన్నం పండే నేలన ఆకలి దప్పులుండరాదని
పాలకొల్లు గుండెల్లో ఇల్లు అల్లుకున్నాడు

అవయవదానం పై అవుట్ స్టాండింగ్ నువ్వే అని అవార్డ్ అన్నప్పుడు
ముక్కున వేసుకున్న వేలు జనం నోటిమీదకి వచ్చింది
విశ్వమానవవేదిక ఆశ్చర్యాలకీ వేదికైంది.

ఓ మల్లుడా! మా పిల్లగాడా! !
తన గర్వకారణాల తోరణాలకింద
ఈనాడు నిను తలుస్తానే ఉంటాది

వార్తాపాఠాలలో తప్పక సదవాల్సిన సుక్కపజ్జానివి
నీ తరువాతి తరం ఎలా దాటాలో తెలియక
నీ లంఘనాలన్నింటినీ కొలుస్తానే ఉంటాది

ఆకలేసినోడికి
అన్నమయ్యావు, అన్నయ్యావు
కన్నవారు వదిలేస్తే ..
పెద్దమ్మ, పెద్దయ్యలపాలిట కన్నయ్యయ్యావు

నడకరానివారికి సముద్రమంత మనసయ్యావు
చదువుకున్న సిన్నోళ్ళకు పనిబాట చూపావు

జయలక్ష్మికి పుట్టినోడికి
జ్ఞానాన్ని పెళ్ళాడేవోడికి
చైతన్యం రగిలినొడికి
జనం కోసం బతికేటోడికి, వోటమిలేదంటారు;

ఎండకాసే సూరీడే గొడుగుపడతాడంటారు
నువ్ నడిస్తే నీ ఎనకాలె జనం జీవితాల్ని మొదలెడతారు

అన్నింటా నీ మార్కు బలే సూపావు.. సురేశా!!
నీమాటే నీకీయాల అప్పజెప్పాల..
నీవల్లే ఓ మార్పు రావాల!!

నీటిని పాడుసేసే నీతిలేనొళ్లకు
బుద్దిసెప్పే పనుంది ముందుగాల
అందుకు నీతో పాటు అందరం కంకణం కట్టుకోవాల

ముక్కుకింద నవ్వు తరగని మొనగాడా!
నువ్వెండగట్టిన ఏరుసేపలూ తిమింగలాలు
వాటి జాతులింకా అంతరించిపోలేదు.

వాటిలో కొన్ని నీరుని ఏరుని
నేలన నిలబడి పాడు సేత్తున్నాయి.

గోదారమ్మను వైతరిణిని
తెలుగు నేలని నరకద్వారాన్ని చేసే కుట్రలో
సామాన్యుడ్ని సమిధను చేస్తున్నాయ్.

మునుగీతలో ఉన్న చైతన్యాన్ని గట్టెకించాలని
నువ్వెత్తిన జెండా రెపరెపలకై
ఎదురుచూస్తోంది గోదారమ్మ.

ఈ పుట్టినరోజున దీవెనలతో
ఇలా అక్షరాల అక్షింతలతో
నీ లక్ష్యాన్ని సుస్థిరం చేస్తున్నా.

వీరమల్లుడా! విజయోస్తు!!
గోదారమ్మను మనమే కాపాడుకోవాల.

=*8.2.2016* =

RTS Perm Link

2 responses so far

2 Responses to “యశస్వి||వీరమల్లుడా! విజయోస్తు!!||”

  1. anonon 09 Feb 2016 at 3:55 PM

    What is this? Bisket poetry

  2. YasaswiSateeshon 09 Feb 2016 at 4:13 PM

    అనోన్ గారూ! మీరు కామెంట్ చేసినందుకు ఆనందమే!.. ఇంతకీ మీకు బిస్కెట్లు ఇస్టమోలేదో చెప్పలేదు. అవితినని వారుంటారా!.. ఎంత నచ్చకపోతే ఎవరైనా ఇలా పెడతారు చెప్పండి. తెరవెనుక మీరున్నది బిస్కెట్లు తినాలనేనన్నమాట.. LOL మీరు బెంగళూరు వారైనా, బిన్నీమిల్స్ వారైనా కామెంటారు; అది చాలు 🙂

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa