Nov 19 2014

|| నాన్నొచ్చేదారి|| (My 200th Post in my blog)

Published by at 6:58 PM under my social views

dad.son-kiss

|| నాన్నొచ్చేదారి||

“స్కూల్ ఆటో వెళ్ళిపోయింది
కారేజీ పెట్టేలోగా..!” అర్థాంగి మాట
నూతి లాంటి వంటిల్లు దాటి
ఆ మనిషిని తడిపేసింది
చిన్నితండ్రి, పుస్తకాల సంచి ఇంటిలో కనపడనప్పుడు
అవగతమైంది ఏంచెయ్యాలో!

రెండు నిముషాల వ్యత్యాసంలో
ఎన్నెన్నిమార్పులు!
ఆగలేని పిల్లల బడి బండి..;
పప్పు..ఇంకాస్త ఉడికితే బాగుండుననుకునే
తల్లి మనసు;
ఆలస్యానికి తను కారణం కారాదనుకునే
భావిభారత పౌరుడు;
ఎదురీతకు సిద్దం చేసాయి మనకాలం వీరుడ్ని
కాలాన్ని కాదనలేని యుద్దం కదా ఈ జీవనం!!

శాంతి కపోతాలు ఆ పాఠాలతోటకి
గుంపులు గుంపులుగా
చేరుతున్న వేళ పరబ్రహ్మ స్వరూపాన్ని
ప్రసాదంలా ఎత్తుకుని
అంతర్వాహినీ లోకం లోనికి అడుగుపెట్టాడా తండ్రి

ఎవ్వరూలేని ఆ తరగతి గదిలో
ఒక్కడే అనేకమైనట్టు ఆ సిధ్ధార్థుడు
తండ్రి రాకను చూపులతోనే ఆలింగనం చేసుకుని
అడిగిన ప్రశ్న
“ఆలస్యం ఎందుకయ్యింది నాన్నా!”
రాత్రి నీకు వళ్ళు వెచ్చనైందిరా కన్నా!
అందుకే వంటలో మీ అమ్మ ప్రేమ ఎక్కువ కలిపింది
తట్టుకోలేక అది కుతకుతలాడింది..
ఏదో మాటల్ని వండబోయాడు అతడు.

“నేనడిగింది అదికాదు నాన్నా!
నువ్వు నే పడుకున్నాక ఇంటికొచ్చావు రాత్రి”
పెదాల్ని తాకిన బుగ్గ వెచ్చదనం
నిట్టూర్పుతో జతకట్టి గాల్లో కలిసిపోయింది

కాలాన్ని ఎక్కి
ముందుకు సాగే వీరుడు
యుధ్ధం ఎంతకాలం సాగేనో తెలియక
సతమతమౌతున్నాడు.

పసి మనసు మాత్రం
నిత్యం.. నాన్నొచ్చేదారిలో
దీపాలు వెలిగించి ఎదురుచూస్తూనే ఉంది.

=19.11.2014. 11.20 am=

RTS Perm Link

3 responses so far

3 Responses to “|| నాన్నొచ్చేదారి|| (My 200th Post in my blog)”

  1. raghavaon 19 Nov 2014 at 7:11 PM

    Roju eduruchustam

  2. Palla Kondala Raoon 19 Nov 2014 at 7:16 PM

    బిజీ గజి బిజి జీవితం లో గతి తప్పుతున్న మానవ సంబంధాలు 🙁

  3. YasaswiSateeshon 25 Nov 2014 at 8:04 PM

    thank you

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa