Aug 28 2014

యశస్వి|| ఆగస్టు 20.. స్పెషల్||

Published by at 3:37 PM under my social views

mus
—-
తిరుగుబోతు ఆడది
క్లియోపాత్రా కాదు..
ఇప్పటికీ ఉన్నదే
లింగభేదం మరిచి మరీ చరిస్తుంది
నీళ్లల్లో పెరుగుతుంది
జలకన్య కాదు
గుడ్డు నుంచి పుట్టుకొచ్చిదే
ఆకాశం కాదు
ఆటలో ఉన్న సొగసు
దాని పాటకు లేదు
అందుబాటులోనే తిరుగుతుంది
చేతికందదు
దురదెక్కువ దానికి
జాలీమ్ లోషన్ రాసుకోదు
గుచ్చి గుచ్చి అదీ..
మనకు అంటిస్తుంది..
సూది మందు లాంటి ముద్దు..
సరసమనుకునేవు
అప్సరసల కన్నా ఫాస్టు
పవిత్రత మంటగలపడానికి
గోకకుండా ఉండలేము సోదరా!
గోముగా నీపై వాలి నప్పుడు.. కాసుకో!!
ఆపై తట్టుకోవడం వల్లకాని పని
బతుకు బస్టాండు కాదురా!
బెడ్రూమ్ అయిపొతుంది..
మొదటి ముద్దుకే నీలో మార్పు ..
చలి, జ్వరం.. అన్నీ ఆ లక్షణాలే!
దీని పొడ గిట్టని పల్లెటూరి వారు
వేపాకు పొగేస్తారు
పట్నం వారు కరెంటు ధూపం దీపం వెలిగిస్తారు
అన్నంత మాత్రాన అది దెయ్యాల జాతి కాదు
అలాగని నిన్నొదిలీ పోదు
రింగ రింగ.. తిరుగుతుంది పాడుతూ నీ చుట్టూ..
పరదేశీ ఐటమ్ భామ కాదు
పేరు విని పొరబడకు…. అనాఫిలస్
క్యూలెక్స్ ఎడిస్‌ ఈజిప్టి, మాన్సోనియా దీని చెల్లెళ్ళు
దోమ.. దీని తెలుగు పేరు
ఈ రోజు దోమరోజు..
మనుషులను చంపడంలో ఇది హంగెరీ రాణి* (Elizabeth Báthory)
850,000 మందీ ఏటా
లోకమంతటా.. అంటే చిన్నమాటా!!
=19.8.2014=

RTS Perm Link

2 responses so far

2 Responses to “యశస్వి|| ఆగస్టు 20.. స్పెషల్||”

  1. కపిలరాంకుమార్on 26 Nov 2014 at 4:16 PM

    యశస్వీ……ఇది నేను బ్లాగ్‌లోంచి ఫేస్‌బుక్‌లోకి షేర్ చేసుకున్నాను.

  2. YasaswiSateeshon 16 Dec 2014 at 10:04 AM

    thank you.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa