Apr 13 2009

అంతర్ముఖీ .. అంతర్జాల విముఖీ .. ( మౌన… మహిళా బ్లాగర్లకు విజ్ఞప్తి )

 

birds-nestఅమ్మల్లారా ! అక్కల్లారా ! మీ రెక్కడ. మీ రాక కై ఎదురుచూస్తున్నాం అనుదినం

ఆకాశంలో చుక్కల్లారా ! కిందికి పంపండి  మా వాళ్ళని.. రోహిణీ అరుంధతులు చాల్లేదా ! ఎదురుచూస్తున్నాం చకోరాల్లా .

మీరు లేని బ్లాగ్లోకం .. మా కేమి బాగోలేదు.. ఎవరి మీద కోపం.. మాపై చూపిస్తారు !

దివ్య సుగంధానుభవం దూరం చేసి దీపనిర్వాణగంధమా ! మాకిస్తారు !!

బళ్ళో కెళ్ళిన చెల్లెల్లా రా! దేవుని మెళ్ళో మాలల్లారా! ఆటలు పాటలు మానేస్తారా! బ్లాగ్ సన్నిధి లో స్వాంతన లేదా !

సూటిగ అడుగుతున్నా: నాచు రాతలపై జారినంత మాత్రాన మనం  నడవటం మానేస్తామా..! వసంతంలో పచ్చదనం మీ కంటికి కానరాదా! తుఫానులో గడ్దిపోచ ఏ పాఠం నేర్పింది?

బండ రాయి కాదుగ ఈ గుండె అందుకే ఈ పరితాపం.. ఆడో మగో తెలియని వారికోసమా ఈ కోపం..  

 గుండెలందు మంటలను నేనెందుకుదాచాలి..?  అనుకుంటాం అందరినీ ఆప్తమిత్రులేనని..

ఎవడి గోల వాడిది.. మగతనం ఎన్నడూ ఆడగేలిచెయ్యదే ! మగ బ్లాగు నడిపేది తాటకెందుకు కారాదు

బల్ల గుద్ది చెబుతున్నా.. నా మాట తప్పైతే ఆ మాయా మారీచులు అక్కా – చెళ్లెల్లేని  అగస్యభ్రాతలు తన పేరు ను దాచువారు .. నిరుపమాన గుణశీలురా ?

అందుకే ఈ అభ్యర్ధన: ప్రతి మంచి పని ముందు.. ఇబ్బందులు ఎదురవుతాయ్ ..

కూడలిలో నించుంటే.. కుక్కలెన్నో మొరుగుతాయ్.. ఇబ్బందులు దాటుకునే చినుకు చిప్పను చేరుతుంది.

అన్నీ మంచి ముత్యాలైతే.. జల్లెడింక ఎందుకంట .. ఆదమరచి ఉన్ననాడు ఈ జగమే ఓ ప్రమాదావని.

బ్లాగట మంటే వాగటం కాదు బతకటమే.. బ్లాగటమంటే.. మంచిని పంచడం.. బాగును కోరడం..

మొదలు పెట్టి ఆపరాదు ఏ పనినీ  ఉత్తములు.  

రాక్షస మాయలో పడకండి – రాసేదాన్ని కాలరాయకండి

బ్లాగ్సాగర మధనంలో అమృతమెంతో వలకాలి. అందుకే మీరు మేధను మరింత చిలకాలి

మీ రాతలు ఉర్రూతలు: మరు మల్లెల గుభాళింపులు ఆత్మీయతా పలకరింపులు

పట్టించు కోవద్దు యే పుల్ల విరుపులు.

చెడు మాటాడిన వినకు చెడు మాటకు నోరు విప్పకు చెడు నడతల ప్రతిఘటించుఇది నాకామోదం లేదనిపలు మార్లు ప్రతిధ్వనించు..

మంచిని పంచితేవంచనా ..అంతమాత్రాన మనం తలలు వంచేనా?

తపశ్చరణీ విపత్తరిణీ .. స్థైర్యం తో ముందు నడు .. ఆత్మానందాన్ని విడువకు ఎన్నడూ ..

గేలి చెసిన వారి పైకే సమాధానమై తిరిగిరా .

ఎవరో చెప్పినట్టు .. పిచ్చుకా.. కూలిన గూటిని.. రెచ్చి మరీ కడుతూ పో.. పిడుగదే విసుక్కుని పడటం మానును పో..

RTS Perm Link

10 responses so far

10 Responses to “అంతర్ముఖీ .. అంతర్జాల విముఖీ .. ( మౌన… మహిళా బ్లాగర్లకు విజ్ఞప్తి )”

 1. bujibabuon 13 Apr 2009 at 2:34 PM

  బ్లాగట మంటే వాగటం కాదు బతకటమే.. బ్లాగటమంటే.. మంచిని పంచడం.. బాగును కోరడం..
  బ్లాగింగ్‌ గురించి ఒక్కముక్కలో చక్కగా చెప్పారు.
  మానవ సంబంధాల్లో పలు రకాలుగా వున్నట్టే…
  బ్లాగింగ్‌లో కూడా వున్నట్టు కన్పిస్తుంది. మంచి విషయాలను మాట్లాడుకుని, సంతోషాలను పెంచుకుని, బాధలను తగ్గించుకోవటానికి స్నేహితులున్నట్టే… బ్లాగులు కొందరికి వేదికలు. బ్లాగింగ్‌లో మీ స్నేహాన్ని కోరుతూ….

 2. ?????2 lucky skyon 13 Apr 2009 at 4:16 PM

  చిరకాలం మన స్నేహం..వర్ధిల్లు.. బ్లాగ్లొకం అశ్శీస్సులతో .

 3. అరిపిరాలon 13 Apr 2009 at 4:22 PM

  విషయం గురించి చర్చించాల్సింది చాలా వున్నా.. నా వ్యాఖ్య చెప్పిన విధానం గురించే..!!

  “బళ్ళోకెళ్ళిన చెల్లెళ్ళు ఆటలు మానేస్తారా.!”, “బ్లాగటమంటే.. బాగును కోరడం”, “నాచు రాతలపై జారినంత మాత్రాన”, “రాసేదాన్ని కాలరాయకండి “, “కూడలి, జల్లెడ”లను చేర్చిన తీరు భలే వున్నాయి. చాలా బాగుంది.

 4. Sateeshon 13 Apr 2009 at 4:55 PM

  ఇందులో నా పాత్ర పరిమితం. కొప్పర్తి గారు (నా అభిమాన కవి) నాకు ఏనాడో మార్గనిర్దేశం చేసారు..

  రాస్తే తడి ఆరని అక్షరాలే రాయాలి.
  ఆక్షరాలలోని తడి ని పీల్చి .. కళ్ళు సజలాలవ్వాలి.
  రాయాలి.. నిరంతరం రాయాలి. గుండె లవిసిపోయేలా రాయాలి.
  ఎప్పుదో ఉద్భవించే ఒక శాశ్వత వాక్యం కోసం రాయాలి.
  రాయడం గంధం రాయడం ఒక్కటి కాదు..
  రాసే దానిని ఎవ్వరూ కాల రాయలేరు “

 5. పద్మకళon 13 Apr 2009 at 5:15 PM

  మీ తపన అభిలషనీయం.

 6. krishna rao jallipallion 13 Apr 2009 at 8:01 PM

  ఆడో మగో తెలియని వారికోసమా ఈ కోపం….. కరెక్టుగా చెప్పారు. అవును నిజం… ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివి , పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్న వారు మహిళా బ్లాగర్లని అనరాని మాటలనడం .. అదీ పిరికిగా ముసుగులో ఉంటూ… కరక్టే ఆడ మగా కాని జాతే మరి.

 7. ?????2 lucky skyon 14 Apr 2009 at 9:56 AM

  రావ్ గారు.. నన్ను invove చెయ్యకండి.( సరదాగా..)

  మీ కోపం నాకు అర్ధం అయ్యింది. మనం అతి గా స్పందించాలా..
  మనం అధికార పక్షం లో majarity లో వున్నాము. చీకట్లో ఉన్నవాడు ఎవరైనా సైతానే . అందుకే వెలుగులో ఉందామంటున్నాను..

 8. సుజాతon 14 Apr 2009 at 11:19 AM

  సతీష్ గారు,నమస్కారం.
  ఇవాళే మీ బ్లాగు చూస్తున్నాను. ఇక్కడ మీ భావాలు చాలా ఉత్తేజకరంగా ఉన్నాయి. ఒక్క విషయం చెప్దామనుకుంటున్నానండీ! మీరు ఏ మహిళా బ్లాగుల నుద్దేశించి ఈ పోస్టు రాసారో అర్థం కాలేదు. మహిళా బ్లాగర్ల మీద అసభ్య రాతలు(పురుష బ్లాగర్ల మీద కూడా రాశారనుకోండి.కానీ మహిళల సున్నిత మనస్థత్వం వల్ల దెబ్బ గట్టిగా వారికే తగిలింది)కొన్ని బ్లాగుల్లో మొదలైన నేపథ్యంలో బ్లాగు మూత పడింది ఒకరిదే! ఆమె కూడా త్వరలోనే తేరుకుని మరొక బ్లాగుని ప్రారంభించి కొనసాగిస్తున్నారు. మరొక బ్లాగరు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఆమె త్వరలోనే తిరిగి రాస్తారు.”ఇది నా వ్యక్తిగత కారణాల వల్ల తీసుకుంటున్న చిన్ని విరామం మాత్రమే” అని చెప్పారు కూడా!

  “చీకట్లో ఉన్నవాడు సైతానే” ఇది బాగా చెప్పారు ఎఫెక్టివ్ గా!

  ఈ గొడవలకు ముందు వివిధ కారణాల వల్ల బ్లాగులు మూసిన వారికి వీటితో సంబంధం లేదు.

  మరిన్ని మంచి టపాలు మీ నుంచి ఆశిస్తున్నాను.

 9. ?????2 lucky skyon 14 Apr 2009 at 11:59 AM

  సుజాత గారు.. నా ప్రయోజనం సార్వజనీనం కావాలని ఆకాంక్షించండి.
  ఇది దీప్తిధార లో, e-తెలుగు సమావేశం లో జరిగిన చర్చాఫలితమే.
  ఏ కారణం చేతైనా ఒక్కరికైనా స్పూర్తి దాయకం గా ఉండాలన్నదే నా రాతల గురి. ఆకారణం గా ఎవ్వరూ మడమ తిప్పలేదన్నారు. సంతోషం. మనసు దిరెశెన అంత సున్నితం గా ఉనా నిశ్చయాలు వజ్ర సంకల్పాలవ్వాలి. ఎవరన్నది కాదు. ఎవరూ అల్ప కారణాలకు వెనుతిరగకూడరాదన్నదే.. ..ఇది చెడు ముందు తలవంచటమేగా.. మనం చూస్తూ ఊరుకోవటమేనా .! ఐనా ఇదంతా నా బిడ్డ కు నడవడిక నేర్పటం లో భాగం గా నే చేస్తున్నాను.వాడు ఎప్పుడు ఎదుగుతాడో..
  మన ఈ రాతలే .. .మార్గ దర్శకాలవ్వాలి .
  నిజమైన కవిత్వం నిరంతర సత్యం..
  సత్యం విశ్వైక జీవన స్రవంతి అని బోయి భీమన్న అంటారు. దేశాన్ని బట్టి పేరూ, కాలాన్ని బట్టి రంగూ, వేగాన్ని బత్తి గుణమూ ఏర్పడవచ్చు .
  సత్యం ఆకాశం ..నక్షత్రాలు కవితలు.. అవి.. భూమి కి నిత్య సత్యాలు..

 10. b.narendrababuon 20 Mar 2010 at 1:29 PM

  mee bhavajalam bagundhi

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa