Jul 04 2013

||నన్ను చదివే ఆ కళ్ళకు..

Published by at 2:29 PM under my social views

ఇంటికొస్తానో.. లేదో..
ఆపాదమస్తకం అవలోకనాలింగనాలు

ఖాళీ చేతుల్ని తడిమిన
రెండు జతల కళ్ళు..
దిగులుగా వాలిపోతాయి..

అంకురాన్ని మొలకెత్తించిన దర్పం ఆమెది..
క్షమయా ధరిత్రీ అని
ఆ క్షణం మరుస్తుంది.

ప్రేమని పిల్లల పాలు చేసిన మమకారం
ఏకపక్ష నిర్ణయంతో
సామరస్యాన్ని ఏమారుస్తుంది.

మూడుగుళ్ళాటలో
ఇల్లు న్యాయస్థానం అవ్వడం
నే దోషినవ్వడం.. రూఢీ అవుతుంది.

అభ్యంగన స్నానాలలో తడిసి మెరిసాక..
శిక్షకు తలవంచి.. చూపులంటిన కాళ్ళూ
నాలిక కరచుకొన్న చెప్పులు..

గుమ్మం పహారాలో
మరచినది మోసుకు రావడానికి..
బజారున పడతాయి

డబ్బుల తోలుతిత్తి నాకన్నా నయం
సన్నబడడానికి
కష్టంగానైనా..ఆరాటపడుతుంది

తలవంచక తప్పని నాకు
సివంగి..వేటాడి తెస్తే..
విందారగించే మృగరాజులా
ఆ దర్పం ఎందుకో!!

కాఫీ కప్పు అడగకుండా అందుకునే నా ఆనందం
తనకెన్ని సింహావలోకనాలకైనా..
అంతుచిక్కదు.

పశు ప్రవృత్తి నుంచి ఇంకా బయటపడని
మగాడు ప్రేమను పండించుకోవడం ముందు
విధి వంచితుడేనా!!

ఏమో!! ప్రేమ..
నిత్య చైతన్యశీలి..
ఎన్నిరంగులైనా మార్చగలదు..

మగాడి కామమే జీవితసత్యం.
ఒక్క ఒప్పందానికి..
ఎన్ని అవసరాలైనా తీర్చగలదు.

RTS Perm Link

No responses yet

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa